జనసేన ‘సోషల్’ వ్యూహం

రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు కామన్. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చింది. దీని ద్వారా తిమ్మిని బమ్మిని చేయచ్చు. బమ్నిని తిమ్మిని చేయచ్చు.  Advertisement పెయిడ్ ఆర్టిస్ట్‌లను పెట్టుకుని, కాన్సెప్ట్…

రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు కామన్. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చింది. దీని ద్వారా తిమ్మిని బమ్మిని చేయచ్చు. బమ్నిని తిమ్మిని చేయచ్చు. 

పెయిడ్ ఆర్టిస్ట్‌లను పెట్టుకుని, కాన్సెప్ట్ రైటర్లను పట్టకుని యూ ట్యూబ్ షార్ట్ లు చేసి వదలొచ్చు. అవన్నీ నిజమనే పామర జనం కూడా వుంటారు. అయితే జనసేన పార్టీ సోషల్ మీడియా మరో అడుగు ముందుకు వేసి కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ సభలకు జనాలు వస్తున్నారు. అందులో సందేహం లేదు. అలాంటి సభలకు వచ్చిన కొందరు మహిళలు ప్రత్యేకంగా వీరావేశంగా జగన్‌ను దుయ్య బట్టడమో, పవన్ అంటే వీరాభిమానం ప్రకటించడమో చేస్తున్నారు. ప్రత్యేకంగా వీరి ముందు మైకులు పెడుతున్నారు. వీరు గట్టిగా మాట్లాడుతున్నారు. అయితే ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని తెలుస్తోంది.

జనసేన రిక్రూట్ చేసుకున్న సోషల్ మీడియా స్పెషలిస్ట్‌లు స్క్రిప్ట్ లు తయారు చేసి, దానికి తగిన వారిని ఎన్నుకుని, వాళ్లను సభా ప్రాంగణం సమీపంలోకి తీసుకెళ్లి, అప్పుడు యాక్షన్ అంటున్నారట. చూసే జనాలకు సభలకు వచ్చిన వారి ముందు యధాలాపంగా మైక్ పెట్టినట్లు, వారు ఆవేశంగా మాట్లాడినట్లు కనిపిస్తుంది. కానీ దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరక్షన్ ఇలా అన్నీ వున్నాయని టాక్.

సాధారణంగా ఇలాంటి లైవ్ వీడియోలు, యూ ట్యూబ్ షార్ట్ లుగా మారి బాగా వైరల్ అవుతాయి. జనాలు చూసి నిజంగా జగన్ కు వ్యతిరేకత పెరుగుతోంది మహిళల్లో అనుకుంటారు. తప్పు లేదు. విజయం కోసం ఎవరి ప్రయత్నాలు వారివి. ఎవరి వ్యూహాలు వారివి. ఐడియా వచ్చిన వాళ్లు ముందు వుంటారు. రాని వాళ్లు వెనుక బడతారు.