అదియును… కాపులను తప్ప!

తూర్పు గోదావరి నుంచి టూర్ ప్రారంభించినపుడే పవన్ అవలింబించబోతున్న కొత్త వ్యూహాన్ని ‘గ్రేట్ ఆంధ్ర’ బయటపెట్టింది. ఇకపై ఎక్కడ టూర్ కు వెళ్లినా అక్కడి లోకల్ కాపు నాయకులను పవన్ నేరుగా విమర్శించరు అన్నది…

తూర్పు గోదావరి నుంచి టూర్ ప్రారంభించినపుడే పవన్ అవలింబించబోతున్న కొత్త వ్యూహాన్ని ‘గ్రేట్ ఆంధ్ర’ బయటపెట్టింది. ఇకపై ఎక్కడ టూర్ కు వెళ్లినా అక్కడి లోకల్ కాపు నాయకులను పవన్ నేరుగా విమర్శించరు అన్నది పాయింట్. ఈ వ్యూహం రహస్యమేమీ కాదు. కొందరు కాపు ప్రజా ప్రతినిధులే గ్రేట్ ఆంధ్రకు ఈ విషయం వెల్లడించారు. 

తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించినపుడు పవన్ ఇదే వైఖరి అవలంబించారు. అక్కడ ఎక్కువ మంది వైకాపా అధికార ప్రజా ప్రతినిధులు కాపు సామాజిక వర్గానికి చెందినవారే. పవన్ వారెవరి గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. గతంలో వీలయినపుడల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నబాబు మీద విరుచుకుపడేవారు. కన్నబాబు కూడా అలాగే సమాధానం ఇచ్చేవారు. కానీ ఈసారి కన్నబాబు గురించి మాట్లాడలేదు. ద్వారపురెడ్డి గురించి మాత్రం విరుచుకుపడిపోయారు.

అలాగే ఈస్ట్ వెస్ట్ లో కాపు ప్రజా ప్రతినిధులు ఎక్కువగా వుండడంతో, ఆ జిల్లాలతో సంబంధం లేని సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి లాంట వేరే ప్రాంతాల నాయకుల గురించి ప్రస్తావించి విమర్శలు కురిపించారు. ఇది పవన్ కు ఇచ్చిన కొత్త అసైన్ మెంట్ లేదా ఆయన ప్లాన్ చేసుకున్న కొత్త స్ట్రాటజీ అని అర్థం అయింది.

కట్ చేస్తే.. ఇప్పుడు విశాఖ జిల్లాకు వచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంవివి సత్యనారాయణ మీద ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. నిజానికి ఎంవివి ఏనాడూ పవన్ ను ఘాటుగా విమర్శించింది లేదు. అక్కడ వున్న మంత్రి అమర్ నాధ్ ఎప్పుడూ పవన్ ను టార్గెట్ చేస్తూ వుంటారు. 

జనసేన సామాజిక మీడియా కూడా అమర్ నాధ్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటూ వుంటుంది. అలాంటిది చిత్రంగా పవన్ ఈసారి అమర్ నాధ్ ను టార్గెట్ చేయలేదు. వైకాపా నాయకులు అంటూ మాట్లాడుకుంటూ వచ్చారు.

చూడాలి పవన్ ఈ వ్యూహం మీద ఎన్నాళ్లు వుంటారో? విజయనగరం వెళ్లిన తరువాత మంత్రి బొత్స ను టార్గెట్ చేస్తారో చేయరో? లేదా సుతి మెత్తని మాటలు మాట్లాడి వస్తారో?

ఈ వ్యూహం గమనించాల్సింది కాపులు కాదు.. బిసి లు ఇతర సామాజిక వర్గాలు. అప్పుడు వారికి అర్థం అవుతుంది. పవన్ జనసేన నాయకుడా? కాపు నాయకుడా? అన్నది?