ఏ వార్తా మాధ్యమం చూసినా రెండే కనిపిస్తున్నాయి. ఒకటి గత ప్రభుత్వాలు చేసిన అక్రమాలు.. రెండు అక్రమ సంబంధాలు. తెలంగాణలో ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం వచ్చి నెలలు దాటేసింది. ఆంధ్రలో నెల దాటింది. మీడియాకు వార్తలు లేవు. అంతా చప్పగా వుంది. ప్రభుత్వాల అనుకూల మీడియాలు ఎంత రాసినా, అహో.. ఒహో అనే వార్తలు జనాలకు అంతగా రుచించవు. ప్రభుత్వాల వ్యతిరేక మీడియాలు, ప్రస్తుతానికి మౌన వ్రతం పాటిస్తున్నాయి.
ఇలాంటి టైమ్ లో రెండు రకాల వార్తలు అక్కరకు వస్తున్నాయి సమస్త మాధ్యమాలకు. ఒకటి అక్రమ సబంధాలు. రెండు గత ప్రభుత్వాలు చేసిన అక్రమాలు. కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు దస్త్రాలు అన్నీ తమ ఆధీనంలోకి రావడంతో, అసలు సంగతులు అన్నీ వెలికి తీస్తున్నాయి. ఎక్కడెక్కడ భూములు కొల్ల గొట్టాయి, ఎక్కడెక్కడ ఇసుక దొచాయి, గనులు దొచిన ఘనులు ఎవరు, ఇలా రకరకాలుగా వార్తలు బయటకు వస్తున్నాయి.
కానీ ఇవి కొంత మందికే ఆసక్తికరం.
రెండోరకం వార్తలు అందరికీ ఆసక్తికరం. అవే అక్రమ సంబంధాలు. తెలంగాణలో హీరో రాజ్ తరుణ్ లివింగ్ రిలేషన్, వేరే హీరోయిన్లతో అక్రమ సంబధాలు అంటూ రకరకాల వార్తలు తెగ కనిపిస్తున్నాయి. అదే రాజ్ తరుణ్ తో బంధాలున్న హీరోయిన్ కు వున్న వేరే బంధాలు అంటూ మరిన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఇలా మొత్తానికి అక్రమ బంధాల వార్తలు అక్షరాల్లోకి వచ్చాయి. పైగా ఈ కేసును కళ్యాణ్ దిలీప్ సుంకర టేకప్ చేసారు. దాంతో మాంచి రంజుగా నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. మీడియా ద్వారా పోలీసుల మీద ఎమోషనల్ ప్రెజెర్ తెచ్చే ప్రయత్నం క్లారిటీగా కనిపిస్తోంది.
ఆంధ్రలో ఎంపీ విజయసాయిరెడ్డి అక్రమ సంబంధం అంటూ హడావుడి మొదలైంది. గతంలోనే విశాఖలో ఫలానా అంటూ ఒకటి రెండు సార్లు సోషల్ మీడియాలో హడావుడి జరిగింది. కానీ అప్పట్లో ప్రభుత్వం అధికారంలో వుంది కనుక పెద్దగా ముందుకు వెళ్లలేదు. ఇప్పుడు అలా కాదు, ఒక భర్తనే, తన భార్యతో విజయ సాయికి అక్రమ బంధం వుందని, బిడ్డ కూడా పుట్టాడని డిఎన్ఎ టెస్ట్ చేయాలంటూ మీడియా ముందుకు వచ్చి యాగీ చేస్తున్నారు.
వైకాపా సోషల్ మీడియా మొత్తం ఈ విషయంలో సైలంట్ అయింది. తేదేపా సోషల్ మీడియా ఫుల్ యాక్టివ్ అయింది. విజయసాయిని డిఫెండ్ చేసే వారే లేరు. పైగా విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. ఆ భర్త చెబుతున్న విషయాలు అన్నీ గట్టిగా ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఆ భార్య బాధ మాత్రం రాలేదు.
నిజానికి ఓ మహిళ జీవితాన్ని బజారులోకి ఈడ్చడం ఎంత వరకు సబబు అని ఏ మీడియా కూడా ఆలోచించడం లేదు. అదే అడిగితే ఆ దంపతులే బజారులోకి వచ్చారు కదా అని బుకాయిస్తుంది.
మొత్తం మీద అక్రమాలు.. అక్రమ సంబధాలు ఇప్పుడు మీడియాకు ఫీడింగ్ గా మారాయి.
Pawankalyan aithe andhariki nyayam chesthadu