అమరావతి చుట్టూ ఏం జరుగుతోంది?

డే వన్… ఆంధ్ర సిఎమ్ చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. కేంద్ర మంత్రి గడ్కరీకి ఇచ్చారు. అందులో అమరావతికి రింగ్ రోడ్ మంజూరు చేయమన్నారు. Advertisement డే టూ……

డే వన్… ఆంధ్ర సిఎమ్ చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. కేంద్ర మంత్రి గడ్కరీకి ఇచ్చారు. అందులో అమరావతికి రింగ్ రోడ్ మంజూరు చేయమన్నారు.

డే టూ… అమరావతికి రింగ్ రోడ్ వచ్చేసినట్లే వార్తలు వచ్చాయి.

డే త్రీ.. అమరావతికి రింగ్ రోడ్ మంజూరైపోయింది. వేల కోట్లతో కేంద్రం నిర్మిస్తుంది. దాని వల్ల అమరావతి దాదాపుగా రాష్ట్రం నలు మూలలకు అందుబాటులోకి వచ్చేసినట్లే అంటూ కథనాలు వచ్చేసాయి.

నిజంగా కేంద్రం అమరావతికి రింగ్ రోడ్ మంజూరు చేసి, నిర్మాణం చేపడితే సంతోషమే. కానీ దానికి ఓ ప్రొసీజర్ వుంది. డిపిఆర్ వగైరా వ్యవహారాలు వుంటాయి. ఏ ఏడాది బడ్జెట్ లోకి దాన్ని తీసుకుంటారు అనే విషయం వుంది.

ఇవన్నీ ఇలా వుంటే అమరావతి రింగ్ రోడ్ వచ్చేసింది, రేపే నిర్మాణం మొదలు అన్నట్లు హడావుడి చేయడం వెనుక అసలు విషయం ఏమిటని బుర్ర బద్దలు కొట్టుకోనక్కరలేదు. సింపుల్ ఆన్సర్. రియల్ ఎస్టేట్.

గత అయిదేళ్లుగా అమరావతి రియల్ ఎస్టేట్ పడుకుంది. కోట్లకు కోట్లు పెట్టిన పెట్టుబడి అలా వుండిపోయింది. ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ఎంత బూస్టప్ ఇచ్చినా ఇంకా అమరావతి రియల్ ఎస్టేట్ పెరగలేదు. గవ‌ర్నమెంట్ మారి ఎన్నో రోజులు కాలేదు కదా. అప్పటికీ మళ్లీ జగన్ రాకుండా, వచ్చినా అమరావతిని మార్చకుండా ఏం చేయాలో అన్నీ చేస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా అమరావతికి బూస్ట్ తీసుకురావాలి. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కదలిక తీసుకురావాలి. ఆపైన దాదాపు అయిదేళ్లకు పైగా అలా డెడ్ కాపిటల్ గా వుండిపోయిన భూములను విక్రయించాలి. మామూలుగా విక్రయించడం కాదు. అయిదేళ్ల వడ్డీ కలిసి వచ్చేలా విక్రయించాలి.

అలా జరగాలి అంటే ఇలాంటి హడావుడి జరగాలి. నిజానికి ఆంధ్ర కు కేంద్రం గతంలో మంజుూరు చేసి రోడ్ల ప్రాజెక్టులు ఇంకా ప్రారంభం కాకుండా కొన్ని వున్నాయి. వాటికి భూ సేకరణ కూడా జరిగిపోయింది. కాంట్రాక్టర్ ను ఫైనల్ చేసి ప్రారంభించాలంతే. అందువల్ల సహజంగా ప్రయారిటీ వాటికి వుంటుంది. ఆ తరువాత దశలో అమరావతి రింగ్ రోడ్ టేకప్ చేయచ్చు.

కానీ ఇప్పుడు అంతా అయిపోయినట్లు హడావుడి చేస్తే, పాపం, అమాయక ఇన్వెస్టర్లు బలైపోతారు. ఇవన్నీ చూసి కొన్న భూములకు సరైన రేట్లు రావాలంటే చాలా ఏళ్లు పడుతుంది మరి. ఫరివాలేదు వేచి వుంటాం.. ఇప్పుడే కొంటాం అంటే అది వేరే సంగతి.