జ‌గ‌న్ మారితే స‌రిపోదా.. స‌ల‌హాదారుడు అవ‌స‌రమా?

స‌ల‌హాదారుని నియ‌మించుకోవ‌డం సంగ‌తి ప‌క్క‌న పెడితే, ముందు త‌న‌లో మార్పు వ‌స్తేనే, ఎవ‌రైనా, ఏమైనా చేయ‌గ‌ల‌రు.

వైసీపీ ప్ర‌భుత్వం పోయినా, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి స‌ల‌హాదారులపై మోజు తీర‌లేదు. తాజాగా కొత్త స‌ల‌హాదారుడొచ్చారు. వైసీపీ నిర్మాణంలో అధ్య‌క్షుడికి స‌ల‌హాదారునిగా ఆళ్ల మోహ‌న్‌సాయిద‌త్‌ను నియ‌మించుకున్నారు. ఈయ‌నెవ‌రా? అని వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు వెతుక్కుంటున్నారు.

మ‌ల్కాజ్‌గిరి బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌కు ఎన్నిక‌ల స‌మ‌యంలో వ్యూహ‌క‌ర్త‌గా ప‌ని చేసిన‌ట్టు స‌మాచారం. అలాగే గ‌తంలో చంద్ర‌బాబునాయుడు వ‌ద్ద కూడా ప‌ని చేసిన‌ట్టు ఆయ‌నే ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఆళ్ల మోహ‌న్‌సాయిద‌త్తా గురించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి వుంది. అయితే కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్‌షా వ‌ద్ద ప‌నిచేశాన‌ని జ‌గ‌న్ వ‌ద్ద చెప్పిన‌ట్టు ప్ర‌చారం తెర‌పైకి రావ‌డం గ‌మ‌నార్హం.

అయితే వైఎస్ జ‌గ‌న్‌లో మార్పు రాకుండా, స‌ల‌హాదారుల‌ను ఎంత మందిని నియ‌మించుకున్నా ప్ర‌యోజ‌నం ఏంట‌నే ప్ర‌శ్నత‌లెత్తింది. అంతెందుకు వైసీపీ ప్ర‌భుత్వంలో లెక్క‌లేనంత మంది స‌ల‌హాదారులున్నారు. వైసీపీ నాయ‌కుల‌కు ప‌ద‌వులు కావాలి కాబ‌ట్టి, స‌ల‌హాదారులుగా నియ‌మించుకున్నారే త‌ప్ప‌, ఏ ఒక్క‌రి స‌ల‌హాలు తీసుకునే అల‌వాటు జ‌గ‌న్‌కు లేద‌ని వైసీపీ నాయ‌కులే ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు.

తాజాగా పార్టీ నిర్మాణంలో జ‌గ‌న్‌కు ఆళ్ల స‌ల‌హాదారునిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇత‌రుల మాట వినే అల‌వాటే లేని జ‌గ‌న్‌, అన‌వ‌స‌రంగా మోహ‌న్‌సాయిద‌త్తాను నియ‌మించ‌కున్నారేమో అనే అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికైనా పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని, నాయ‌కుల్ని త‌ర‌చూ క‌లుస్తూ, క్షేత్ర‌స్థాయిలో అస‌లేం జ‌రుగుతున్న‌దో తెలుసుకునేలా త‌న‌ను తాను మార్చుకుంటే స‌రిపోతుంది. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు ఎంత సేపూ తాను ఉప‌న్యాసాలు ఇవ్వ‌డం ప‌క్క‌న పెట్టి, వాళ్ల అభిప్రాయాల్ని తెలుసుకుంటే చాలు… ఎవ‌రి స‌ల‌హాలు అవ‌స‌రం లేదు.

అన్నీ త‌న‌కే తెలుస‌నే రీతిలో ఇంత‌కాలం జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారన్న‌ది నిజం. ఎవ‌రైనా ఏదైనా చెబితే, కొట్టి పారేసేవారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌నీసం ఒక‌ట్రెండు ఆకర్ష‌ణీయ‌మైన ప‌థకాలు ప్ర‌క‌టించాల‌ని నాయ‌కులు చెప్పినా, జ‌గ‌న్ ఖాత‌రు చేయ‌లేదు. చేతులు కాలాక ఆకులు ప‌ట్ట‌కున్న సామెత చందంగా… పొర‌పాటు జ‌రిగింద‌ని ఇప్పుడు జ‌గ‌న్ ప‌శ్చాత్పాతం చెందుతున్నార‌ని తెలుస్తోంది.

స‌ల‌హాదారుని నియ‌మించుకోవ‌డం సంగ‌తి ప‌క్క‌న పెడితే, ముందు త‌న‌లో మార్పు వ‌స్తేనే, ఎవ‌రైనా, ఏమైనా చేయ‌గ‌ల‌రు. లేదంటే స‌మ‌స్య మ‌ళ్లీ మొద‌టికొస్తుంది.

10 Replies to “జ‌గ‌న్ మారితే స‌రిపోదా.. స‌ల‌హాదారుడు అవ‌స‌రమా?”

  1. బలే కామెడీ ఆర్టికల్స్ రాస్తావు రా GA నువ్వు. వాడు మారడు అని నీకు కూడా ఎప్పుడో తెలుసు. అప్పుడే చెప్పి ఉండాల్సింది.

  2. రోజు ఇలా మీ వెబ్సైట్ లో జగ*న్ పనికిరాడు, చేతకాదు అని రాసే బదులు, నేరుగా ప్యాలస్ లో కలిసి, నీకు పార్టీ నడపడం చేతకాదు అని ముఖం మీదనే చెప్పొచ్చు కదా గ్రేట్ ఆంధ్ర.

    అధికారం లో వున్న టైంలో నిన్ను పోషించిన అతన్ని, ( అప్పుడు చెప్పకుండా)

    అధికారం పోగానే అతని లోపాలూ యెందుకు బయటకి చెబుతున్నవ్వు.

Comments are closed.