అయ్యో..పాపం..జనసైనికులు

జనసేనకు తేదేపా ఎన్ని సీట్లు కేటాయిస్తుంది అనే విషయంలో ఆరంభంలో వినిపించిన ఫిగర్ 32. కానీ ప్రకటించినవి 24 స్థానాలు. అప్పుడే అందరికీ ఆశ్చర్యం కలిగింది. చంద్రబాబు అను కుల మీడియా కూడా 32…

జనసేనకు తేదేపా ఎన్ని సీట్లు కేటాయిస్తుంది అనే విషయంలో ఆరంభంలో వినిపించిన ఫిగర్ 32. కానీ ప్రకటించినవి 24 స్థానాలు. అప్పుడే అందరికీ ఆశ్చర్యం కలిగింది. చంద్రబాబు అను కుల మీడియా కూడా 32 అని చెప్పింది కదా..24 కే పవన్ కళ్యాణ్ ఎలా అంగీకరించారు అని. కానీ ఇప్పుడిప్పుడు క్లారిటీ వస్తోంది. భవిష్యత్ లో భాజపా పొత్తు వుంటుందని పక్కా ధీమాగా వుండి, ఎనిమిది సీట్లు ఆ పార్టీ కోసం పక్కన పెట్టారని.

ఇప్పుడు అదే జరిగింది. భాజపాకు 10 అసెంబ్లీ సీట్లు ఇస్తున్నారు. పోనీ జనసేనకు 24, భాజపాకు 10 అనుకుందాం అనుకుంటే ఆ ఆనందం కూడా మిగలలేదు. జనసేనకు కోత వేసి 21 చేసారు. 32 కు ఒకటి తక్కువే అంటే జనసేన-భాజపాకు కలిపి 31 మాత్రమే ఫిక్స్ చేసారని వార్తలు వచ్చేసాయి.

కక్కలేక మింగలేక గిలగిల లాడుతున్నారు జనసైనికులు. ఏమిటి తమకు ఈ అవమానం అని పైకి చెప్పలేక లోలోపల కులుముతున్నారు. నిజానికి జనసేన వెనుక వున్న కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంక్ లేకుండా తెలుగుదేశం గెలవగలదా? అధికారం చేపట్టగలదా? అన్నది సందేహమే. అంతట అవసరం వుందని తెలిసినా కూడా పవన్ ఎందుకు బేరం ఆడలేకపోతున్నారు. ఎందుకంటే బాబు ఎలా అంటే అలా తల ఊపుతున్నారు. అదే సమాధానం తెలియని ప్రశ్న.

ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేల్లో ఎంత మంది గెలుస్తారు. ఒక వేళ అధికారం సిద్దిస్తే ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు? అన్నది అనుమానం. ఎందుకంటే తెలుగుదేశం నుంచి వచ్చిన జనాలు కాకుండా జనసేన నాయకులకు టికెట్ లు ఇస్తే లోకల్ తేదేపా జనాలు ఓడించడానికి వెనుకాడరు.

ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ లే తెలుగుదేశం జనాలను అటు పంపి మరీ ఇస్తున్నారు, అందువల్ల మంత్రి పదవులు కూడా అలాగే వుండొచ్చు. ఈ మాత్రం దానికి జనసేన అనే ఓ పార్టీ, దాని మద్దతు. అంటే సింపుల్ గా చెప్పాలంటే కేవలం కాపు సామాజిక వర్గ ఓట్లు తెలుగుదేశం పార్టీకి మళ్లించడానికి ఏర్పాటైన అనుబంధ సంస్థ లేదా స్పెషల్ పర్సస్ ఆర్గనైజేషన్ తప్ప వేరు కాదు అనుకోవాలి.