Advertisement

Advertisement


Home > Politics - Analysis

బాబు నా.. జగన్ నా? ఎవరిని నమ్ముతారు?

బాబు నా.. జగన్ నా? ఎవరిని నమ్ముతారు?

ఇప్పుడు ఎన్నికల టైమ్‌లో ఇదే మిలియన్ డాలర్ క్వశ్చను. చంద్రబాబు నా? జగన్ నా? ఎవరిని నమ్ముతారు జనం అన్నదే.

చంద్రబాబు అండ్ కో జగన్ ను గద్దె దించడానికి ముప్పేట వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఒకటి జగన్ అప్పచెల్లెళ్ల ద్వారానే అతను అరాచకవాది అది ప్రచారం సాగించడం. రెండు రాష్ట్రంలో అస్సలు అభివృద్తి లేదనే పాయింట్ తో ముందుకు వెళ్లడం. మూడు జగన్ విధానాలు, పథకాలు ఆపము అని చెప్పడం.

ఈ మూడింటిలో మొదటిది జనాన్ని ఎంటర్ టైన్ చేస్తుంది తప్ప, వారికి పట్టే పాయింట్ కాదు. మహా అయితే కడప, ఆ చుట్టుపక్కల వరకు ఏదైనా కాస్త ప్రభావం చూపిస్తే చూపించవచ్చు తప్ప మరేం కాదు. డైలీ తెలుగుదేశం కుల మీడియాలో వార్తలు రాసుకోవడానికి తప్ప మరెందుకు పనికి రావు.

రెండో పాయింట్ అభివృద్ది లేదు అనే ప్రచారం. అభివృద్ది వుందా లేదా అన్నది లోకల్ గా జనాలకు తెలుసు. స్కూలు బిల్డింగ్ లు, ఆసుపత్రులు, 24 గంటలు వైద్యం ఇవన్నీ లోకల్ జనాలకు తెలుసు. అలాగే ఎక్కడి పరిశ్రమలు అక్కడ జనాలకు పరిచయమే. అందువల్ల ఆ ప్రచారం కెేవలం కొంత రేంజ్ వరకే పని చేస్తుంది.

ఇక మిగిలింది ఒక్కటే సంక్షేమ పథకాలు. ఇప్పటికే జగన్ ఇస్తున్నవి. ప్రకటించబోయేవి. చంద్రబాబు కొనసాగిస్తా అంటున్నవి… కొత్తగా ఇస్తా అంటున్నవి. ఇవే కీలకం. ఇక్కడ మిగిలింది నమ్మకం. జగన్ ఏం సాధించారు ఈ అయిదేళ్లలో అంటే ముందుగా చెప్పాల్సింది.. జనాల నమ్మకం. ఏదో విధంగా జనాలకు ఇస్తా అన్న డబ్బులు ఇస్తూ వస్తున్నారు. కొత్తగా ఏమైనా చెబితే అది కూడా చేస్తారని జనం నమ్ముతారు.

చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మడం అన్నది కొంత శాతం జనాల వరకే. చంద్రబాబు ఎన్ని సాధించినా, జనాల దగ్గర ఆ క్రెడిబులిటీ మాత్రం సాధించలేదు. అక్కడే జగన్ లీడ్ తీసుకునేది. ఇప్పుడు ఆంధ్ర ఎన్నికలు అంతా కేవలం ఈ ఒక్క పాయింట్ చుట్టూనే తిరుగుతున్నాయి. జగన్ సంక్షేమం కోరుకుని, జగన్ ను నమ్ముతూ, జగన్ కు ఓటేస్తారా? లేదా చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా ప్రచారం నమ్ముతూ, ఏదో చేస్తారని అటు ఓటేస్తారా?

దానికి అనుగుణంగానే వుంటుంది ఆంధ్రలో పార్టీల గెలుపు.. ఓటమి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?