Advertisement

Advertisement


Home > Politics - Analysis

బిసి లు తిడితేనే పరువా?

బిసి లు తిడితేనే పరువా?

ఎవరు ఎవర్ని తిట్టినా తప్పే..అకారణంగా తిడితే మరీ తప్పే. అక్కసుతో తిడితే ఇంకా పెద్ద తప్పే. ఎవరి లెవెల్ కు వాళ్లు పరువునష్టం దావా వేయడంలో ఎంత మాత్రం తప్పు లేదు. ఈ కోణంలో చూస్తే ఎంపీ మాధవ్ మీద ఆంధ్రజ్యోతి ఆర్కే పరువు నష్టం దావా వేయడంలో ఎంత మాత్రం తప్పు లేదు. 

ఎందుకంటే ఆర్కే మీద విమర్శలతో పాట్లు, పరుష పదాలు కూడా మాధవ్ వాడారు కాబట్టి. కానీ ఇక్కడ ఎవరికైనా ఓ సందేహం రావచ్చు. నిత్యం ఆంధ్రజ్యోతిలో ఈవెనింగ్ డిస్కషన్ ల పేరిట చేస్తున్న వ్యవహారాల్లో కూడా ఇతరుల పరువు నష్టం అనేది వుంటుంది కదా..దాని సంగతి ఏమిటని? సరే దాన్నీ పక్కన పెడదాం.

అసలు గోరంట్ల మాధవ్ విషయంలో ఓ వ్యక్తిగా ఆర్కే తీసుకున్న నిర్ణయం అన్నది ఆయన వ్యక్తిగతం. మాధవ్ మీద దావా వేయడం అన్నది ఆయన ఇష్టం. కానీ గతంలో నటుడు పోసాని కృష్ణ మురళి ఇంతకన్నా దారుణంగా తిట్టారు లేదా విమర్శించారు ఆర్కే ను. 

అలాగే మోహన్ బాబు తానే నేరుగా ఆర్కే మొహం మీదే అనేసారు…’మీకు కుల గజ్జి వుందటగా’ అంటూ. కొడాలి నాని సంగతి చెప్పనక్కరలే లేదు. ఇప్పుడు మాధవ్ అంటున్నది కూడా ఇదే. తను బిసి కనుక ఆర్కే టార్గెట్ చేసారు అని.

మరి తన సామాజిక వర్గానికి చెందిన పోసాని తిడితే పరువునష్టం వేయని ఆర్కే ఇప్పుడు మాధవ్ మీద ఎందుకు వేసినట్లు? అంటే పోసాని తిడితే పోని పరువు మాధవ్ తిడితే పోయినట్లా? అంటే తన సామాజిక వర్గం వాళ్లు తిడితే పోదు కానీ, మాధవ్ చెప్పినట్లు ఓ బిసి తిడితే పోయినట్లా? 

ఒక విధంగా ఆర్కే ఇలా చేయడం ద్వారా మాధవ్ అంటున్న బిసి వెర్సస్ కమ్మ అనే ప్రచారాన్ని నిజం చేస్తున్నట్లు అవుతుందేమో?

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను