గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణమాలపై ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు స్పందిస్తూ.. చంద్రబాబు నిజ స్వరూపం ఎంటో బయట పెట్టారు.
వైసీపీ ఎంపీ అంశాన్ని వైసీపీ మొత్తనికి అంటగటడంపై ధర్మాన టీడీపీపై మండిపడ్డారు. చంద్రబాబు ప్రజా పోరాటలతో రాజకీయం చేయడం రాదని కుయోక్తులతో ఎదుటి పార్టీలను పడగొట్టడం నైజమన్నారు.
చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సీఎం జగన్ తన కేబినెట్ లో ఎన్నడు లేనంత మంది మహిళ ప్రతినిధులను తీసుకొని వారికి మంచి స్థానం ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు మహిళా రుణగ్రస్తులను చేసి మోసం చేస్తే.. సీఎం జగన్ వచ్చి వాళ్లకి రుణ విముక్తులను చేశారని అన్నారు.
దిశా లాంటి చట్టాలను చేసి మహిళలకు రక్షణ కల్పిస్తుంటే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చెప్పడానికి ఎలాంటి రాజకీయ అంశాలు లేకపోవడం వలన ఇలాంటి అనవసర యాగీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సమాజంలో సిగ్గుమాలిన పని ఎవరు చేసినా అది ఉపేక్షించేది కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.