సినిమా జనాలకు ఓ అలవాటు వుంది. అరేంజ్డ్ ఇంటర్య్యూ చేయించుకోవడం. అంటే భళా భళీ అనే ఇంటర్య్యూలు అన్న మాట. దీని కోసం యాంకర్లకు లక్షలు ఫీజు ఇచ్చి మరీ ఇంటర్య్యూ చేయించుకుంటారు. ఇలాంటివి అయితే ఏ ఇబ్బంది వుండదు. తమను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఎదురుకావు. పైగా ప్రశ్నకు సమాధానం ఇస్తే, ఆ సమాధానానికి మరో ప్రశ్న కౌంటర్ గా ఎదురు కాదు. ఇలా చాలా సౌలభ్యాలు వుంటాయి. అందుకే సినిమా జనాలు ఈ అరేంజ్డ్ ఇంటర్య్యూ వైపే మొగ్గు చూపుతారు.
ఇలాంటి ఫార్ములానే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. నిన్నటికి నిన్న తెలుగుదేశం మహిళలు కొందరు భువనేశ్వరి ప్రశ్నించడం. ఆమె సమాధానాలు ఇవ్వడం. వాటిని ప్రచురించడం. ఇదీ జరిగింది.
ఇప్పుడు ఓ లేటెస్ట్ ట్రెండ్ మొదలైంది. తేదేపా అనుకుల మీడియాలు కొన్ని వున్నాయి. వాటని ఎవరూ డేకడం లేదు. అది డిజిటల్ అయినా విజువల్ అయినా. అందుకు వాళ్లు కనిపెట్టిన ఫార్ములా ఏమిటంటే, అక్కడ అయిటమ్ లు పోస్ట్ చేయడం, వాటి లింక్ లు తీసుకుని వచ్చి ట్విట్టర్ లో పెట్టి, అలా జనాల దృష్టికి పంపడం.
ఇప్పుడు భువనేశ్వరి అరేంజ్డ్ ఇంటర్య్యూ మర్మం కూడా ఇదేలా కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ మీద సింపతీ సాధించేలా భువనేశ్వరి మాట్లాడాలి. ఆ మేరకు పాయింట్లు సెట్ చేయడం. ఆ పాయింట్ల మేరకు క్వశ్చన్లు అడగడం. ఆ విధంగా తయారైన దాన్ని తీసుకువచ్చి మీడియాలో ప్రచురించడం. ఆ క్లిప్ ను తీసుకువచ్చి వాట్సాప్ ల్లో చలామణీ చేయడం. ఇదీ స్కీములా కనిపిస్తోంది.
కానీ ఈ రోజు వచ్చిన ఈ అరేంజ్డ్ ఇంటర్య్యూలో ఒక్కటి అంటే ఒక్కటి కొత్త పాయింట్ లేదు. మళ్లీ అదే పాట. ఏ నేరం చేయకుండా అరెస్ట్ చేసారు. ఏ ఆధారం లేకుండా అరెస్ట్ చేసారు.
అన్నట్లు ఈ అరేంజ్డ్ ఇంటర్య్యూలో భువనేశ్వరి ఓ మాట చెప్పారు. తాత చంద్రబాబు జైలులో వున్నారని మనవడు దేవాన్ష్ కు చెప్పలేదట. చిన్న వయసు కదా బాధపడతాడు అని, విదేశాలకు వెళ్లారు అని చెప్పారట. మరి ఇదే విషయం జగన్ యాంగిల్ లోంచి ఆలోచించాలి కదా. జగన్ జైలులో వున్నపుడు అతని పిల్లలు ఎలా బాధపడి వుంటారు. వాళ్లు కాస్త పెద్ద వాళ్లే.. చెప్పకుండా దాచేది కూడా లేేదు.
మనకు అయితే బాధ.. సింపతీ.. జగన్ కు అయితే నేరం.. శిక్ష. అదే కదా తెలుగుదేశం సామాజిక అను’కుల’ మీడియా ఈ టోటల్ వ్యవహారాన్ని చూసే యాంగిల్.