టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతులు చెబుతుంటే బాబు గారు పెద్ద జోక్ వేశారు అనిపిస్తుంది.. ఎందుకంటే నేతీ బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో చంద్రబాబులో కూడా నీతి అంతే ఉంటుందనేది తెలుగు ప్రజలందరికి తెలుసు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం జగన్ తీరుపై చంద్రబాబు నీతులు చెప్తుంటే పొలిట్ బ్యూరో సభ్యులతో పాటు వినే జనం కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నోటి నుండి నిజాలు, చంద్రబాబు మనసులో నిజాయితీ లేవు రాలేవు అని తెలిసిన నగ్నసత్యం.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో గురించి మాట్లాడుతూ మాధవ్ రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడని, తక్షణమే ఎంపీని పార్టీ నుండి డిస్మిస్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి వారి వెనకేసుకు రావడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని చంద్రబాబు విమర్శించారు. అంతా బాగానే ఉంది మరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పార్టీ నాయకులపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి.
ఇంకా నిజా, నిజాలు తెలియని ఒక ప్రైవేట్ వ్యక్తుల మధ్యలో జరిగిన వీడియోను తీసుకువచ్చి విమర్శించే చంద్రబాబు తన హయాంలో తన ఎమ్మెల్యే స్వయాన ఒక ప్రభుత్వ అధికారిణిపై ఎంత నీచంగా ప్రవర్తించారో అందరూ కళ్ళకి కట్టినట్లు చూశారు. అప్పుడు ఆ ఎమ్మెల్యేపై చర్యలు ఎందుకు తీసుకోలేదు. ఆ ఎమ్యెల్యే తన సామాజిక వర్గం అని వదిలేశారా లేక టీడీపీ పార్టీలో ఇలాంటివి కామన్ అని వదిలేశారా.
స్వయాన చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా ఆడియో, వీడియో టేప్ లల్లో దొరికినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. కనీసం ఆ ఆడియో తనదా కాదా అని కూడా చెప్పలేదు. గతంలో విజయవాడకు చెందిన ఒక ఎమ్మెల్యే వల్ల ఒక కుటుంబంలో జరిగిన ఆత్మహత్యలపైనా, కాల్ మనీ కీచకులపైనా, బస్సు ప్రమాద నిందితులపై ఒక చర్య అయినా తీసుకున్నారా. తన ప్రచార ఆర్భాటం వలన పదుల సంఖ్యలో చనిపోయిన కుటుంబాలను అదుకున్నారా? ప్రమాదానికి కారణం అయినవారిపై ఏ చర్య తీసుకున్నారో చంద్రబాబునే సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే ఆ ఘటనలో స్వయాన చంద్రబాబే నిందితుడు.
గోరంట్ల మాధవ్ నిజంగా తప్పు చేసుంటే దానిని ఎవరూ సమర్ధించరు. నిజానిజాలు ఎలాగూ బయటకు వస్తాయి. కానీ చంద్రబాబు తాను, తన పార్టీ పెద్ద నీతివంతులు అని చెప్పుతుంటేనే వినడానికి కాస్తా ఇబ్బట్టుగా ఉంది. ప్రజా పోరాటాలు వదిలి పొత్తులు, వీడియోలు అంటూ రాజకీయం చేస్తే చంద్రబాబుకు 2019 పీడకల తప్పెలా లేదు.