కట్ డ్రాయర్ మీద తిప్పుతా

మొత్తానికి గుడివాడ గడ్డ మీద అడుగుపెడితే లోకేష్ బాబు కు కూడా బూతులు వచ్చేసాయి. కొడాలి నాని గురించి అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ, ‘మన అమ్మ’ ను అసెంబ్లీకి లాగి, అవమానించిన వాడిని గుడ్డలూడదీసి, కట్…

మొత్తానికి గుడివాడ గడ్డ మీద అడుగుపెడితే లోకేష్ బాబు కు కూడా బూతులు వచ్చేసాయి. కొడాలి నాని గురించి అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ, ‘మన అమ్మ’ ను అసెంబ్లీకి లాగి, అవమానించిన వాడిని గుడ్డలూడదీసి, కట్ డ్రాయిర్ మీద గుడివాడ రోడ్ల మీద తిప్పే బాధ్యత తనది అంటూ ప్రతిజ్ఙ పట్టారు.

బాగానే వుంది. అంటే..అధికారంలోకి వస్తే ప్రత్యర్ధుల మీద కక్ష సాధిస్తామని లోకేష్ బాహాటంగా చెప్పారన్న మాట. ఇంతకు ముందే రెడ్ బుక్ ఒకటి పట్టుకుని, అధికారంలోకి వచ్చాక ఎవరెవరిని కక్షసాధించాలా అన్నది పేర్లు రాసుకుంటున్నా అని ఓపెన్ గానే చెప్పారు. అంటే అధికారంలోకి వస్తే ప్రత్యర్ధుల మీద విరుచుకుపడతా అని చెప్పారన్నమాట.

మరి దీన్నే ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ అని, రాజారెడ్డి రాజ్యాంగం అని కూడా ఎల్లో మీడియా అంటూ వుంటుంది. జగన్ తనకు గిట్టని వారి మీద కక్షసాధిస్తే ఫ్యాక్షనిస్ట్ అని, రాజారెడ్డి రాజ్యాంగం అని యాగీ చేస్తుంటుంది కదా. మరి లోకేష్ అందుకు భిన్నంగా కదా వుండాలి.

అలా కాకుండా రెడ్ డైరీ, గుడ్డలిప్పదీయడం, కట్ డ్రాయిర్ మీద ఊరేగిస్తా అనడం, ఇంకా ముందుకు వెళ్లి ఉచ్చ పోయిస్తా అని సవాలు విసరడం…ఇది మాత్రం ఎల్లో మీడియాకు సంబంరంగా, సమ్మగా వుంటుందేమో?