దేశం నాయకులకు జనసేన కండువాలు1

తెలుగుదేశం- జనసేన పొత్తు ఫిక్స్ అయింది. అయితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు అన్నది ఇప్పట్లో తెలియదు. 25 నుంచి 30 మధ్యలో అని వార్తలు వున్నాయి. కానీ అన్ని తక్కువ సీట్లలో పోటీ…

తెలుగుదేశం- జనసేన పొత్తు ఫిక్స్ అయింది. అయితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు అన్నది ఇప్పట్లో తెలియదు. 25 నుంచి 30 మధ్యలో అని వార్తలు వున్నాయి. కానీ అన్ని తక్కువ సీట్లలో పోటీ చేస్తే కాపుల నుంచి అంత సానుకూల స్పందన రాదు. పైగా జనసేనకు అనుకూలంగా వున్న సీట్లు కాస్త ఎక్కువే వున్నాయన్నది తెలుగుదేశం అంతర్గత సర్వేలో తేలిన సంగతి. అందుకే ఈ అన్ని సమస్యలకు పరిష్కారంగా ఉభయతారక ఉపాయాన్ని ఆలోచించి పెట్టారని విశ్వసనీయ వర్గాల బోగట్టా.

సుమారు 40 సీట్లను జనసేనకు కేటాయిస్తారు. కానీ వాటిలో డజను మంది అభ్యర్ధులను తెలుగుదేశం పార్టీనే నిర్ణయిస్తుంది. తెలుగుదేశం పార్టీ జనాలకే జనసేన కండువాలు కప్పి, పోటీకి దింపుతారు. ముందుగానే ఐడెంటిఫై చేసి వుంచుతారు. 

సైలంట్‌గా జనసేన తరుపున వుండేలా చూస్తారు. ఎన్నికల ముందు వారికి టికెట్‌లు కేటాయిస్తారు. ఆ విధంగా జనసేనకు ఎక్కువ సీట్లు ఇచ్చామన్న భావన కాపుల్లోకి వెళ్లేలా చేయాలన్నది ఉభయ వర్గాల ప్లాన్ అని తెలుస్తోంది.

ఇదిలా వుంటే కాపుల ఓట్లు చాలా వరకు జనసేన వైపు పోలరైజ్ అయ్యాయని, కానీ బలిజ ఓట్లు మాత్రం ఇంకా దూరంగానే వున్నాయని, వాటిని ఇప్పుడు జనసేన వైపు మళ్లించడం అన్నది కీలకం అని భావిస్తున్నారట. అందులో భాగంగా తెలుగుదేశం ఎంపిక చేసే అభ్యర్థుల్లో బలిజలకు కాస్త ప్రయారిటీ వుండేలా చూస్తారని తెలుస్తోంది.

మొత్తం మీద జనసేన తరపున పోటీ చేసే అభ్యర్ధుల పొలిటికల్ కెరీర్ ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రారంభమైందో గమనించుకుంటే ఈ కండువాలు కప్పే ఫార్ములా బయటకు వస్తుంది. కానీ జనం అది గమనిస్తారో లేదో ఎన్నికల తరువాత కానీ తెలియదు.