అధికారంలోకి వచ్చినప్పటినుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్తన దేశాన్నే కాదు, ప్రపంచ దేశాలను కూడా ఠారెత్తిస్తున్నాడు. ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ అన్ని వర్గాల ప్రజలను, ప్రధానంగా విదేశీయులను తీవ్రంగా ఆందోళన పెడుతున్నాడు. వీసాల విషయంలో విదేశీ విద్యార్థులు, ప్రధానంగా భారతీయ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతుండటం చూస్తున్నాం. చాలామంది స్వదేశానికి పంపించేశారు కూడా.
ట్రంప్ నిర్ణయాల పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోంది. నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. అమెరికా రాజ్యంగం ప్రమాదంలో పడిందని, పౌర, మానవ హక్కుల అణిచివేస్తున్నారని, ట్రంప్‌కు కావల్సింది అవధులు లేని అధికారమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా క్రమంగా నియతృత్వం దిశగా పయనిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటివరకు ట్రంప్ తీసుకున్న చర్యలు, నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా లేవు. ట్రంప్ పాలన అధ్వానంగా ఉందని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు.
ట్రంప్ ఇంగ్లిషును అధికార భాషగా ప్రకటించాడు. అంతవరకు ఓకే. కాని ఆయన ఇంగ్లిష్భాషా వ్యామోహం వెర్రితలలు వేస్తున్నట్లుగా కనబడుతోంది. ఆయన తాజా నిర్ణయం అమెరికాలో పొట్టపోసుకుంటున్న లక్షమందికి పైగా భారతీయ ట్రక్కు డ్రైవర్లను ఇబ్బందుల పాలు చేసేవిధంగా ఉంది. ఇంతకూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏమిటంటారా? దేశంలో వాణిజ్య (కమర్షియల్) ట్రక్కులు నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా ఇంగ్లిషులోనే మాట్లడాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశాడు. ఆ భాషలో ప్రావీణ్యం సంపాదించుకోవాలని చెప్పాడు.
దేశ రక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. ఈ నిర్ణయంపై ఎలాంటి చర్చలకూ అవకాశం లేదని కూడా తేల్చి చెప్పాడు. ఇంగ్లిష్ మాట్లాడని ట్రక్కు డ్రైవర్లకు భారీగా జరిమానాలు విధిస్తారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇంగ్లిష్ మాట్లాడని, మాట్లాడటం రాని ట్రక్కు డైవర్లకు జరిమానాలు విధించడాన్ని, చర్యలు తీసుకోవడాన్ని నిషేధించారు. ఇప్పుడు ట్రంప్ ఈ నిషేధాన్ని ఎత్తేశాడు.
దీంతో భారతీయ ట్రక్కు డ్రైవర్లు ప్రధానంగా సిక్కులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఈ నిబంధన వల్ల తమ ఉపాధి పోతుందని ఆవేదన చెందుతున్నారు. అమెరికాలో భారతీయ ట్రక్ డ్రైవర్లకు బాగా డిమాండ్ ఉంది. నెలకు లక్షల్లో సంపాదన ఉంది. కాని ట్రక్కు డ్రైవర్లలో ఎక్కువమంది సిక్కులే ఉన్నారు. వీరికి ఆంగ్ల భాషా పరిజ్ఞానం తక్కువ. అందుకు ట్రంప్ నిర్ణయం పట్ల భయపడుతున్నారు.
అయితే పెద్ద చిక్కోచ్చి పడిందే మన “గ్యాస్ ఆంధ్రా వెంకీ” గానికి
ఈ ట్రంప్ ఒకడు మా “గ్యాస్ ఆంధ్రా” వెంకీగాణ్ణి ఇలా కూడా బతకనీయడా??
గట్టిగా 10 యేళ్ళు లో డ్రైవర్లు అవసరం ఉండదు. మొత్తం AI రోబోట్లు నే రవాణా వాహనాలు నడిపి స్తాయి.