Advertisement

Advertisement


Home > Politics - Analysis

చంద్రబాబులో ముందస్తు కలలు!

చంద్రబాబులో ముందస్తు కలలు!

చంద్రబాబునాయుడు రెండేళ్లు కూడా ఓపికగా వేచిచూసే పరిస్థితిలో లేరా? అర్జంటుగా ఆయనకు అధికారపీఠం కావాలని కోరుకుంటున్నట్టుంది. అందుకే.. నిమ్మళంగా పరిపాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వం అర్జంటుగా ముందస్తు ఎన్నికలకు వెళుతుందంటూ ఆయన జోస్యం చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ క్షణంలో అయినా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నదని అందుకు పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని ఆయన జోస్యం చెబుతున్నారు. 

ప్రజల్లో జగన్ ప్రభుత్వం పట్ల విపరీతంగా వ్యతిరేకత వస్తున్నదట. ఈ వ్యతిరేకత ముదిరిపోతుందని జగన్ మోహన్ రెడ్డికి భయంగా ఉన్నదట. అది బాగా పెరగకముందే అర్జంటుగా ఎన్నికలకు వెళ్లిపోయి మరోసారి నెగ్గాలనేది ఆయన వ్యూహంగా ఉన్నదిట. ఇదంతా చంద్రబాబునాయుడు వర్ణిస్తున్న ఆయన కల!

ముందస్తు ఎన్నికల విషయంలో రాష్ట్రంలో అనేక మంది ఎవరి ఊహాగానాలు వారు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికల మాట ఎత్తడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా జగన్ అర్జంటుగా ముందస్తుకు వెళుతున్నాడని ఆయన సెలవిచ్చారు. ఒకసారి అభాసుపాలయ్యారు. ఇప్పుడు మళ్లీ ముందస్తు మాట తెస్తున్నాడు. మళ్లీ అభాసుపాలు అవుతారు. 

కానీ వాస్తవం ఏంటంటే.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, క్షేత్రస్థాయిలో నాయకులు అందరూ కూడా బాగా నీరసించిపోయి ఉన్నారు. ఎవ్వరికీ తమ పార్టీ మీద ఆశ లేదు, నమ్మకం లేదు. 

వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూస్తూ.. తమకు ఎన్నికల్లో విజయం దక్కుతుందనే విశ్వాసం లేదు. క్షేత్రస్థాయిలో తిరుగుతూ.. ‘బాదుడే బాదుడు’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న చంద్రబాబునాయుడుకు, క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో ఉన్న నైరాశ్యం చాలా స్పష్టంగా తెలిసి వస్తోంది. కార్యకర్తల్లో ఎలా ఉత్తేజం నింపాలో ఆయనకు అర్థం కావడం లేదు. అందుకే ఆయన గతిలేక, ముందస్తు ఎన్నికలు అనే మాటను మంత్రంలాగా ప్రయోగిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

ఎన్నికలు అంటే పార్టీలో కాస్త చురుకుదనం వస్తుందని, కార్యక్రమాలకు వస్తారని ఆయన ఆశలాగా కనిపిస్తోంది. ఎన్నికలు వస్తున్నాయంటే ఖచ్చితంగా కొంచెం చురుకుదనం వస్తుంది. అయితే గెలుపు గురించి కాస్త డోలాయమానమైన పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే అలా జరుగుతుంది. ‘కష్టపడితే గెలుస్తాం’ అనే హోప్ ఉన్నప్పుడు.. కార్యకర్తలు మరింత ఎగబడి పనిచేస్తారు. కానీ ఏం చేసినా సరే.. గెలిచే చాన్సేలేదు.. అనే క్లారిటీ ఉన్నట్లయితే గనుక.. ఇక ఎవరికి చురుకుదనం పుడుతుంది? ఎలా పుడుతుంది? తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న పరిస్థితి ఇదీ..!

శయనాసనం వేసి ఉన్న పార్టీని లేపి కూర్చోబెట్టడానికి, కార్యకర్తల్లో మూడ్ కోసం చంద్రబాబు ముందస్తు ఎన్నికల మంత్రం వేస్తుండవచ్చు గాక.. కానీ నిజంగానే ముందస్తు అంటూ వస్తే అసలు కష్టం చంద్రబాబుకే ఉంది. 

ముందస్తు ఎన్నికలే గనుక వస్తే.. అసలు 175 నియోజకవర్గాల్లో పోటీచేయడానికి చంద్రబాబుకు కేండిడేట్లు ఉన్నారా? పార్టీ పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో నామరూపాలు లేకుండాపోయింది. ఇలాంటి నేపథ్యంలో పార్టీని అన్ని స్థానాల్లో బలంగా పోటీకి దింపగల సత్తా చంద్రబాబుకు ఉందా? లేదా, తమ తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోయిన నియోజకవర్గాలు అన్నింటినీ. జనసేన నెత్తిన తోసేసి చేతులు దులుపుకుందామని అనుకుంటున్నారు. 

ముందస్తు ఎన్నికల సంగతేమో గానీ.. ముందు చంద్రబాబు.. మనుషుల్ని వెతికి రెడీగా పెట్టుకోవడం అవసరం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?