Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఫ్యామిలీ.. నైజాం.. అంత దారుణమా?

ఫ్యామిలీ.. నైజాం.. అంత దారుణమా?

విజయ్ దేవరకొండ- పరుశురామ్ కాంబో సినిమా ఫ్యామిలీ స్టార్. బ్లాక్ బస్టర్ గీత గోవిందం కాంబినేషన్. దిల్ రాజు నిర్మాత. మృణాళ్ హీరోయిన్. మరి సినిమాకు ఓపెనింగ్ ఏ మేరకు వుండాలి. రన్ ఎంత వుండాలి. ఎన్ని ఆశలు వుంటాయి ఫ్యాన్స్ కు, నిర్మాతకు కూడా. కానీ అన్ని ఆశలు అడియాసలు చేస్తూ డిజాస్టర్ ఫలితాలను నమోదు చేసింది. విజయ్ దేవరకొండకు సరైన సినిమా పడితే నైజాంలో ఓపెనింగ్ నే నాలుగైదు కోట్లు వుంటుంది. అదీ అంతని రేంజ్.

కానీ ఫ్యామిలీ స్టార్ సినిమా నైజాంలో గట్టిగా అయిదు కోట్ల షేర్ సాధించడానికి కష్టపడుతోంది. టోటల్ రన్ లో ఈ సినిమా నైజాంలో అయిదు కోట్ల మేరకు చేస్తుందని తెలుస్తోంది. బిజినెస్ వర్గాల బోగట్టా ప్రకారం ఈ సినిమా ఇప్పటికి నాలుగు నుంచి అయిదు కోట్ల మధ్యలో షేర్ సాధించింది. నిర్మాత దిల్ రాజునే విడుదల చేసుకున్నారు. కనీసం పది నుంచి 12 కోట్లు నైజాం నుంచి రావాలని, వస్తాయని అంచనా వేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ అందులో సగానికి కూడా రీచ్ కాలేకపోయింది.

ఇంత డిజాస్టర్ ఫలితాలు ఎందుకు అన్నది ఎవరికీ అంతు పట్టడం లేదు. సినిమా విడుదల తరువాత, టాక్ బాలేదు, సినిమా బాలేదు అంటే అది వేరే సంగతి అసలు సినిమా ఓపెనింగ్ సరిగ్గా తీసుకోలేదు. వరుస సెలవులను క్యాష్ చేసుకోలేకపోయింది. అంటే విడుదల రాంగ్ టైమ్ అనుకోవాలా? సినిమాల మీద జనానికి ఆసక్తి లేని టైమ్ లో విడుదల చేసారు అనుకోవాలా?

వరుస సెలవులు వుండడంతో అద్భుతమైన డేట్ అని అనుకున్నారు. కానీ ముందు వారం విడుదలైన టిల్లు ఎఫెక్ట్ ఫ్యామిలీ మీద పడిందని అనుకోవాల్సి వస్తోంది. ఇప్పటికీ ఆంధ్రలో టిల్లు అంతో ఇంతో కలెక్షన్లు సాధిస్తోంది ఫ్యామిలీ స్టార్ పూర్తిగా ఆగిపోయినట్లే.

విజయ్ దాదాపు పాతిక కోట్ల మేరకు రెమ్యూనిరేషన్ అందుకోగల హీరో. అలాంటి హీరో సినిమాలు ఇలా వసూళ్ల దగ్గర చతికిల పడితే నిర్మాతలు ఆలోచనలో పడతారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?