Advertisement

Advertisement


Home > Politics - Analysis

‘స్వయంగా’ ముఖ్యమా? సాయం ముఖ్యమా?

‘స్వయంగా’ ముఖ్యమా? సాయం ముఖ్యమా?

తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న బురద రాజకీయం రోజు రోజుకు శృతిమించుతోంది! రాష్ట్రంలో వరదలు తీవ్ర బీభత్సాన్ని సృష్టిస్తున్న ఈ విషమ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అచ్చమైన బురద రాజకీయం చేస్తున్నది. 

రాష్ట్రంలో ఏ చిన్న పరిణామం జరిగినా సరే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై బురద చల్లడానికి తమకు దక్కే ఒక అవకాశంగా మార్చుకునే నీచమైన అలవాటు ఉన్న తెలుగుదేశం పార్టీ… వరదలను కూడా ఏమాత్రం విడిచిపెట్టడం లేదు! ఒకవైపు ప్రజలు ఇంకా విడవని వర్షాలతో సతమతం అవుతూ ఉండగా రాజకీయంగా ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలి? అనేదొక్కటే లక్ష్యంగా పచ్చ నాయకులు చెత్త మాటలు మాట్లాడుతున్నారు!!

తెలుగుదేశం నాయకులు ప్రధానంగా చెబుతున్నదల్లా ‘‘ఒకవైపు వరదలు ముంచెత్తుతుండగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆ ప్రాంతాల్లో ఎందుకు పర్యటించడం లేదు’’ అని మాత్రమే. తాజాగా తెలుగుదేశానికి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అదే ఆడిపోసుకుంటున్నారు. 

గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి వరద ప్రాంతంలోనూ ముమ్మరంగా పర్యటించారని, పదేపదే టీడీపీ వారు సొంత డబ్బా కొట్టుకుంటున్నారు! తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాలలో అప్పట్లో తిరుగుతూ ఉండేవాడు గనుక ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అదే తరహాలో ప్రతి ఊరిలోనూ పర్యటిస్తూ ఉండాలనేది బహుశా వారి కోరిక కావచ్చు! అందుకే పదేపదే వరద ప్రాంతాల్లో తిరగలేదే అని అడుగుతూ ఉన్నారు!!

వాస్తవంలోకి వస్తే వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు హఠాత్తుగా విరుచుకుపడిన సమస్యలతో ప్రజల సతమతం అవుతున్నప్పుడు వారికి అవసరమైన సాయం అందేలా చూడడం మాత్రమే ప్రభుత్వాల కర్తవ్యం గా ఉండాలి! అంతేతప్ప ప్రభుత్వాధినేత స్వయంగా వారు ఉండే ప్రాంతాలకు వెళ్లి ఫోటోలు తీయించుకుని ప్రచారం చేసుకోవాలని ముచ్చట పడకూడదు! 

ప్రజలకు సాయం అందడం ముఖ్యమా? లేదా, ఫోటోలతో తమ సొంత డబ్బా కొట్టుకోవడం ముఖ్యమా? అనే క్లారిటీ నాయకులకు ఉండాలి. తెలుగుదేశం నాయకులకు లోపించింది ఇదే! వారి ధ్యాస మొత్తం నిత్యం ఆత్మ స్తుతి, పరనింద, ప్రచారకాంక్ష మీద మాత్రమే ఉంటుంది! ప్రజలకు అందేసాయం మీద ఉండదు. 

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు.. వరద ప్రాంతాల్లో తిష్టవేసి.. అందించే సాయంకన్నా.. అధికంగా అధికార్లతో సమావేశాలు నిర్వహిస్తూ.. అంతా అస్తవ్యస్తం చేసేసేవారని, ఫాలో అప్ లే ముఖ్యమని అనుకుంటే.. రాజధాని నుంచి చేసినా కూడా సరిపోతుందని అప్పట్లో తీవ్ర విమర్శలు వినిపించేవి.

అలా కాకుండా, జగన్ సర్కారు వరదలు నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి తగిన సాయం అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది! సాయంపరంగా జరుగుతున్న ప్రతి పరిణామాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా తెలుసుకుంటున్నారు. అవసరమైన మార్గదర్శనం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ కూడా సాయం అందేలాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు! అయితే ఇవేమీ తమ కళ్లకు కనిపించని కబోదుల వంటి తెలుగుదేశం పార్టీ ‘‘ముఖ్యమంత్రి స్వయంగా తిరగలేదే.. తిరగలేదే..’’ అనే నానా యాగీ చేస్తున్నది. 

ప్రజల్లో తిరగడం అనేది ప్రచారకాంక్షమితిమీరిన చంద్రబాబు లాంటి వారిని లక్షణం! తాను తిరిగినా తిరగకపోయినా ప్రజలందరికీ తాను చేయగలిగిన ప్రతి చిన్న సాయం.. చివరివరకు అందాలనేది జగన్మోహన్ రెడ్డి సంకల్పం! ఆ విషయం తెలుగుదేశానికి అర్థం కావడం లేదు!!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?