Advertisement

Advertisement


Home > Politics - Analysis

మంత్రివర్గానికి జగన్ టాస్క్.. మహానాడుపై నజర్

మంత్రివర్గానికి జగన్ టాస్క్.. మహానాడుపై నజర్

సీఎం జగన్ ఈనెల 22న దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపుగా 10 రోజుల పాటు ఆయన రాష్ట్రానికి దూరంగా ఉంటారు. ఇటీవల కాలంలో ఇన్నిరోజులపాటు ఆయన రాష్ట్రానికి దూరంగా ఉన్న సందర్భాలు అరుదు. దీంతో ఆయన మంత్రులకు ఓ టాస్క్ ఇచ్చారు. 

ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనితోపాటు  ప్ర‌భుత్వంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టి, మంత్రులతో ప్ర‌త్యేకంగా బ‌స్సు యాత్ర‌కు వైసీపీ ప్లాన్ చేసింది.

ఈనెల 26 నుంచి నాలుగు రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగుతుంది. సామాజిక న్యాయం పేరుతో మొదలయ్యే ఈ యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు పాల్గొంటారు. పార్టీ కీలక నేతలు కూడా వారితో ఉంటారు. స్థానిక నేతలు ఎక్కడికక్కడ ఈ యాత్రకు ఘన స్వాగతం పలికేందుకు రంగం సిద్ధమైంది. బస్సు యాత్ర రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. ఈనెల 29న అనంతపురంలో జరిగే బహిరంగ సభతో బస్సు యాత్ర ముగుస్తుంది.

మహానాడుకు కౌంటర్ పడినట్టేనా..

ఈనెల 27, 28 తేదీల్లో ఒంగోలులో టీడీపీ మహానాడు ప్లాన్ చేసింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీ మహానాడు అంటే ఎల్లో మీడియాకి పండగే. అక్కడ వంటకాలేంటి, కార్యక్రమాలేంటి, ఎవరెవరు వచ్చారు, ఏమేం తీర్మానాలు చేశారనే దానిపై చర్చంతా నడుస్తుంది. రెండేళ్లుగా కరోనా వల్ల కళతప్పిన మహానాడుని ఈసారి భారీ స్థాయిలో విజయవంతం చేయాలని చూస్తున్నారు.

కానీ వైసీపీ బస్ యాత్రతో మహానాడు కవరేజ్ కి కాస్త గండిపడే అవకాశముంది. మహానాడుకి ముందు మొదలయ్యే వైసీపీ మంత్రులు బస్సు యాత్ర, మహానాడు తర్వాత పూర్తవుతుంది. అంటే దాదాపుగా టీడీపీ ఫోకస్ పెట్టే ఛానెల్స్ అన్నీ అనివార్యంగా బస్సు యాత్ర విశేషాలు కూడా జనాలకు చెప్పాల్సి ఉంటుంది. సో.. ప్రమోషన్ వన్ సైడ్ అనే ఛాన్సే ఉండదు.

జగన్ పరోక్షంలో నాయకులు బిజీబిజీ..

సహజంగా అధినాయకుడు రాష్ట్రంలో లేకపోతే మంత్రులంతా కాస్త రిలాక్స్ అవుతారు, కానీ ఇక్కడ మంత్రులు, ఇతర నాయకులకు ఆ అవకాశం ఇవ్వలేదు జగన్. ఇప్పటికే గడప గడపకు కార్యక్రమం జరుగుతోంది. దీనికి తోడు బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఖరారైంది కాబట్టి.. జగన్ వచ్చే వరకు ఇక్కడ నేతలంతా ఫుల్ బిజీగా ఉంటారు. 

తాను దావోస్ కి వెళ్తూ.. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇలా చేతినిండా పని కల్పించారు జగన్. జగన్ లేని సమయంలో ప్రతిపక్షం మరింత రెచ్చిపోయే అవకాశముంటుంది. నేతల్ని రెచ్చగొడుతుంది, తన అనుకూల మీడియాతో లేనిపోని సమాధానాలు తెప్పించే ప్రయత్నం కూడా చేస్తుంది. 

ప్రతి అవకాశాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోవడం బాబుకి అలవాటే. అయితే ఈసారి జగన్ మాత్రం దానికి గట్టి కౌంటర్ ఇచ్చే వెళ్తున్నారు. జగన్ వచ్చే వరకు మంత్రులు తమ టాస్క్ ని సమర్థంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. టీడీపీ ట్రాప్ లో పడకుండా.. సామాజిక న్యాయం టూర్ పూర్తవుతుందన్నమాట. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?