జనసేన- భాజపా కూటమికి…

అంకె తక్కువ అయితే ఎక్కువగా ఎలా చెప్పాలి అంటే.. తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాలి. అంతన్నాడు.. ఇంతన్నాడు అంటూ హడావుడి చేసి, ఆఖరికి జనసేనకు 24 టికెట్ లతో సరిపెట్టారు. అప్పుడే జనసైనికులు కొందరు…

అంకె తక్కువ అయితే ఎక్కువగా ఎలా చెప్పాలి అంటే.. తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాలి. అంతన్నాడు.. ఇంతన్నాడు అంటూ హడావుడి చేసి, ఆఖరికి జనసేనకు 24 టికెట్ లతో సరిపెట్టారు. అప్పుడే జనసైనికులు కొందరు బాహాటంగా, కొందరు లోలోపల నానా గోల పెట్టారు. ఇంత దారుణమా అని. కిట్టని వారు జనసేన ను తాకట్టు పెట్టేసారు. ప్యాకేజ్ అంటూ నానా గత్తర చేసారు. ఇదిలా వుంటే ఇప్పుడు భాజపా కూడా తోడయింది పొత్తుకు. ఆ పార్టీకి కూడా కొన్ని టికెట్ లు ఇవ్వాలి. మహా అయితే ఎనిమిది.. లేదంటే పది.

నిజానికి జనసేన కు టికెట్ లు అని ముందుగా వినిపించిన నెంబర్ 30 నుంచి 32. అంటే భాజపా పొత్తును దృష్టిలో పెట్టుకునే ఆ నెంబర్ ను ఫీలర్ గా వదిలి వుంటారు. అనకూడదు కానీ ఇప్పుడు మరో పార్టీ పొత్తు అన్నా కూడా ఈ 30 నుంచి 32 లోనే సర్దుబాటు చేస్తారు. దానికి కూడా జనసేన అధిపతి పవన్ కు అస్సలు అభ్యంతరం వుండదు. ఎందుకు అన్నది ఆయనకు మాత్రమే తెలిసిన బ్రహ్మ రహస్యం.

సరే ఇప్పుడు మొత్తానికి జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో వున్న భాజపాకు ఆంధ్రలో విదిలిస్తున్న సీట్లు జస్ట్ 8 అని టాక్. చాలా చీప్ గా వుంటుంది కదా ఈ నెంబర్ ఇలా చెబితే. అందుకే తేదేపా మీడియా విభాగం నుంచి ఆదేశాలు వచ్చినట్లున్నాయి. తేదేపా సామాజిక అను కుల మీడియా కొత్త రాగం అందుకుంది.

జనసేన-భాజపా కూటమికి 30 ప్లస్ 8 అని రాయడం మొదలు పెట్టారు. ఏకంగా ముఫై అసెంబ్లీ, ఎనిమిది లోక్ సభ అంటే చెప్పుకోవడానికి నెంబర్ ఘనంగా వుంటుంది కదా? అందుకన్న మాట. అదే భాజపాకు ఎనిమిది, జనసేనకు 24 అని రాస్తే అసహ్యంగా వుంటుంది. ఎవరితోక ఎవరు పట్టుకున్నారు, ఎవరికి ఎనిమిది ఎవరికి 24 అనే విమర్శలు మొదలవుతాయి. ఇలాంటివి అన్నీ ముందుగానే ఊహించే ఘనులు కదా తెలుగుదేశం పెద్దలు.

అందుకే ఈ కొత్త పద ప్రయోగం అన్నమాట. ‘జనసేన-భాజపా కూటమికి’ అనే రాయాలి. రాస్తున్నారు. అనీ సంగతి..