నాగబాబు మౌనవ్రతంలోకి?

అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీ చేస్తారు నాగబాబు అని విపరీతంగా వార్తలు వినిపించాయి. నాగబాబు కూడా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో తెగ హడావుడి చేసారు కొన్నాళ్ల పాటు. అచ్యుతాపురంలో మకాం వేసి డైలీ…

అనకాపల్లి నుంచి లోక్ సభకు పోటీ చేస్తారు నాగబాబు అని విపరీతంగా వార్తలు వినిపించాయి. నాగబాబు కూడా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో తెగ హడావుడి చేసారు కొన్నాళ్ల పాటు. అచ్యుతాపురంలో మకాం వేసి డైలీ తెగ తిరిగారు.

పవన్ కూడా కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్లి రెండు గంటలు గడిపి, తన బ్రదర్ ను ఎలాగైనా గెలిపించాలని కోరారని కూడా వార్తలు వినిపించాయి. 

కానీ వున్నట్లుండి సీన్ మారింది. అనకాపల్లి ఎమ్మెల్యే, ఎంపీ రెండూ జనసేనకు ఇవ్వడంపై గడబిడ మొదలయింది. దాంతో నాగబాబుకు టికెట్ లేనట్లే అని వార్తలు వచ్చేసాయి. ఇలాంటి నేపథ్యంలో నాగబాబు వున్నట్లుండి సైలంట్ అయినట్లు తెలుస్తోంది. దాదాపు ఎవరి ఫోన్ లు ఆన్సర్ చేయడం లేదని, ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడం లేదని తెలుస్తోంది. 

ఒకటి రెండు రోజుల్లో ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు అన్నది క్లారిటీ వస్తుంది. జనసేన పోటీ చేసే స్థానాలు, అక్కడ సామాజిక సమీకరణలు అన్నీ చూసిన తరువాత కానీ నాగబాబుకు ఈ సారి పోటీ చేసే అవకాశం వుంటుందా, వుండదా అన్నది తెలుస్తుంది. అంత వరకు ఈ మౌనవ్రతం ఇలా కొనసాగుతుందేమో?