టీడీపీ నేతలు ఫేక్ న్యూస్ కి సిద్ధమయ్యారు. దాదాపుగా ఈ రెండేళ్లు ఫేక్ న్యూస్ తో వైసీపీలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించారు. తాజాగా మాజీ మంత్రి కాల్వ వేసిన ట్వీటే దీనికి నిదర్శనం. నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ టీడీపీతో టచ్ లో ఉన్నారనేది ఆయన మాట. అసలు అది నిజమేనా..? టీడీపీతో టచ్ లో ఉండే మూర్ఖులు కూడా ఉంటారా..?
ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో సంబంధం లేకుండా పార్టీ మారితే కండువా కప్పి ఆహ్వానిస్తానంటూ జగన్ ఒక్క మాట చెబితే చాలు.. టీడీపీ ఖాళీ అవుతుంది. కానీ ఆయన ఆ పని చేయలేదు. అందుకే టీడీపీ ఇప్పుడు రెచ్చిపోతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు సైతం తమతో టచ్ లో ఉన్నారని గొప్పలు చెప్పుకుంటోంది. అసలు మునిగిపోయే నావలో ఎవరైనా ఎక్కుతారా..? మరి కాల్వ మాటలకు అర్థమేంటి.
గోబెల్స్ ప్రచారంలో భాగంగా టీడీపీ ఈ తప్పుడు ప్రచారానికి సిద్ధమవుతోంది. ఫలానా ఎమ్మెల్యేపై నెగెటివ్ కామెంట్స్ చేస్తే, తమ అనుకూల మీడియాలో ఊదరగొడితే.. జనంలో గందరగోళం నెలకొంటుందనేది టీడీపీ నాయకుల ఆలోచన. అధినేత సూచనతోనే వీరంతా బరితెగిస్తున్నారు.
వాస్తవానికి వైసీపీలో నాయకులు ఎక్కువ అయినా.. స్థానిక ఎన్నికల్లో చాలా చోట్ల చాలామంది మాట చెల్లుబాటు కాకపోయినా అందరూ ఒక్కటిగా కలిసున్నారు. గెలిచే పార్టీ, గెలిచే నాయకుడితో ఉండటమే తమ భవిష్యత్తుకి మంచిదని భావిస్తున్నారు. అందులోనూ వలస నాయకులకు జగన్ పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదని తేలేసరికి.. ఉన్నవారు తమ పార్టీ, తమ ప్రయారిటీపై ధీమాగా ఉన్నారు. పక్కపార్టీల వైపు చూడటం ఎప్పుడో మానేశారు.
ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో కాకాణి, అనిల్ మధ్య అంత తీవ్రమైన విభేదాలున్నా కూడా సర్దుకుపోయి వైసీపీలోనే ఉన్నారు కానీ, అధినేత మాట జవదాటలేదు. పార్టీ పరువు తీయాలనుకోలేదు. ఎవరి పని వారు చేసుకుంటున్నారు, ఎవరి రాజకీయం వారిది. మంత్రి పదవి రాలేదనో, ఇన్ చార్జి పదవి ఇయ్యలేదనో, కాంట్రాక్ట్ వర్క్ లు రాలేదనో.. ఇలా రకరకాలుగా వైసీపీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉండొచ్చు కానీ, పార్టీని వీడిపోయేంత ఇబ్బందైతే ఎక్కడా లేదు, ఎప్పుడూ రాదు.
మంత్రి కాకాణి మాటల్లో చెప్పాలంటే వైసీపీ నేతలెవరూ కూర్చున్న కొమ్మను నరుక్కునే ఉద్దేశంలో లేరు. గెలుపు ఓటములన్నీ జగన్ తోనే, వైసీపీలోనే అని వారు సీరియస్ గా డిసైడ్ అయ్యారు. కానీ టీడీపీ మాత్రం తప్పుడు ప్రచారానికి బలంగా తెరలేపింది. చివరి రెండేళ్లు జనంలో, పార్టీలో గందరగోళం సృష్టించేందుకు ఫలానావారు టచ్ లో ఉన్నారు, ఆ జిల్లాలో అంతమంది, ఈ జిల్లాలో ఇంతమంది టీడీపీలో చేరబోతున్నారంటూ ఫేక్ వార్తలు ప్రచారం చేసుకుంటూ ఫేక్ రాజకీయాలు చేస్తోంది.