తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాకూడదని కమ్మ సామాజిక వర్గం తెరవెనుక గట్టిగా కృషి చేస్తోందని రాజకీయ వర్గాల్లో బలమైన గుసగుసలు వినిపిస్తూనే వున్నాయి.
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పక్కా చంద్రబాబు మనిషి అని విమర్శలు వినిపిస్తూనే వున్నాయి. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికలకు దూరంగా వుండిపోయింది. మరో అయిదేళ్ల వరకు మళ్లీ అవకాశం రాదని తెలిసినా మౌనంగా వుండిపోయింది.
చాలా సోషల్ మీడియా పోస్ట్ ల్లో ట్రెండ్ చూస్తుంటే తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గం కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడుతోంది. పోస్ట్ లు వేస్తోంది. అందువల్ల తెలంగాణ రాజకీయాలు పరిశీలించేవారు అందరికీ ఈ క్లారిటీ వుంది. కానీ ఎటొచ్చీ గత అయిదేళ్లుగా ఆ వర్గాన్ని దగ్గరకు తీసి పెంచి పోషించిన కేసీఆర్ కు..కేటీఆర్ కు ఆ క్లారిటీ వుందా లేదా అన్నది మాత్రం తెలియదు.
ఇలాంటి నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ నాయకుడు కే ఎ పాల్ ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ కుండ బద్దలు కొట్టారు. తనను కూడా కాంగ్రెస్ కు మద్దతు పలకమంటూ పలువురు కమ్మ వారు ఫోన్ లు చేసారని కాల్ లిస్ట్ తో సహా వెల్లడించారు. వీరిలో ఎక్కువ మంది అమెరికా నుంచి చేసారని, అక్కడ ప్రముఖ తెలుగు సంఘాల నేతలు కూడా వీరిలో వున్నారని కాల్ లిస్ట్ చూపించి మరీ వెల్లడించారు.
ఇప్పుడు సెటిలర్ల లో వున్న నాన్ కమ్మ వర్లాలకు కూడా ఫుల్ క్లారిటీ వచ్చి వుండాలి. బీఆర్ఎస్ను వ్యతిరేకించేలా సెటిలర్లను ఎవరు ప్రోత్సహిస్తున్నారో క్లారిటీ వచ్చి వుండాలి. సెటిలర్లలో బలంగా కమ్మవారి తరువాత బలంగా వున్న బిసి, కాపు, క్షత్రియ, బ్రాహ్మణ వర్గాలు ఇప్పుడు ఈ క్లారిటీతో ఎటు మొగ్గుతాయో చూడాలి.