Advertisement

Advertisement


Home > Politics - Analysis

కొడాలి నాని కి ఆహ్వానం వెనుక..!

కొడాలి నాని కి ఆహ్వానం వెనుక..!

చాలా రోజులు అయిపోయింది.. ఎన్టీఆర్ సోదరి, హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇంట్లో పెళ్లి వేడుక జరిగి. ఆ వేడుకకు కొడాలి నాని హాజరుకావడం అనే పాయింట్ మీద గుసగుసలు మాత్రం వినిపించడం ఆగలేదు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి అంతగా సంబంధాలు ఇప్పుడు లేవు అన్నది ఓ ప్రచారం. తమ మధ్య గట్టి సంబంధాలు వున్నాయని కూడా కొడాలి నాని ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ చంద్రబాబు అరెస్ట్ తరువాత ఎన్టీఆర్ దానిని ఖండించకపోవడం, అలాగే కళ్యాణ్ రామ్ కూడా అదే తీరలో వుండడం వార్తల్లోకి వచ్చింది. అన్ స్టాపబుల్ షో కి అందరినీ పిలిచారు కానీ ఈ సోదరులను పిలవలేదు.

ఇలాంటి టైమ్ లో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇంట జరిగిన వేడుకకు కొడాలి నాని రావడం కాస్త చర్చనీయాంశం అయింది. తరువాత పెద్దగా హడావుడి జరగలేదు. కానీ తెలుగుదేశం అనుకూల వర్గాల్లో మాత్రం ఈ పాయింట్ ఇంకా నానుతూనే వుంది. 

ఎన్టీఆర్ నో, లేదా కళ్యాణ్ రామ్ నో స్వయంగా పూనుకుని కొడాలి నానికి పెళ్లి పిలుపు వెళ్లేలా చేసారని టాక్ ఆ వర్గాల్లో వినిపిస్తోంది. లేదూ అంటే చంద్రబాబుకు అనుకూలంగా వున్న నందమూరి సుహాసిని ఎందుకు పిలుస్తారు? అన్నది వాళ్లు లాగుతున్న లాజిక్ పాయింట్.

తెలుగుదేశం వర్గాలు అనుమానిస్తున్నది ఏమిటంటే కొడాలి నాని ని అన్నదమ్ములు చెప్పిన మేరకే సుహాసిని పిలిచి వుంటారన్నది. పైగా ఆ పెళ్లి వేడుకుకు సంబంధించి ఎన్టీఆర్ వున్న ఫోటొలు, వీడియోలు ఎక్కువగా రాకుండా జాగ్రత్త పడ్డారని ఒక వీడియో వస్తే దాన్ని సోషల్ మీడియాలోకి రాకుండా జాగ్రత్త పడ్డారని వినిపిస్తోంది.

మొత్తానికి నందమూరి సోదరులకు, నారా కుటుంబానికి దాంతో పాటు బాలయ్యకు మధ్య ప్రస్తుతానికి అయితే పెద్దగా సత్సంబంధాలు లేవనే అనుకోవాలేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?