అవతలివాళ్లు ఏమన్నా, చిన్న చిన్న మాటలు పడినా, తప్పులు వున్నా తిరిగి ఏమీ అనకుండా సర్దుకుపోండి అంటూ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చి మరీ జనసైనికులకు సుద్దలు చెప్పారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. దీంతో చాలా మంది దిగాలు పడ్డారు. మరికొంత మంది లోలోపలే దిగాలు పడ్డారు. దేశం పల్లకీ మోత తప్పదు కదా అని నిట్టూర్చే వాళ్లు నిట్టూర్చారు. ఇలాంటి టైమ్ లో జనసేనకు తొలి విజయం లభించింది. నిజంగా అది చెప్పుకోదగ్గదే.
జనసేన కుర్రాళ్లలో చాలా ఇమేజ్ వుంది దిలీప్ కళ్యాణ్ సుంకర కు. ఆయన వీడియోలకు, మాటలకు చాలా మంది ఫ్యాన్స్ వున్నారు. కానీ ఆయన చేసిన ఓ వీడియో కు తెలుగుదేశం పార్టీ నుంచే అధికారికంగా అభ్యంతరం వచ్చింది. తెలుగుదేశం అధికార ప్రతినిధి నే నేరుగా కళ్యాణ్ సుంకరను తప్పు పట్టారు.
దాంతో ఆయన మనసు కష్టం పెట్టుకుని, ఇకపై ఎన్నికలు అయ్యే వరకు ఏ విధమైన పొలిటికల్ వీడియోలు చేయనని చెప్పేసారు. తాను పవన్ అభిమానినని, నాగబాబు తండ్రి సమానుడని చెబుతూనే, తన ఆవేదనను ఓ వీడియో రూపంలో పోస్ట్ చేసారు.
ఇది నిజంగా జనసేనకు పెద్ద మైనస్. ఎందుకంటే జనసేన తరపున అడ్డుగా విరుచుకు పడే వారే తప్ప, కాస్త లాజికల్ గా, పాయింట్ టు పాయింట్ మాట్లాడే వాళ్లు లేరు. వన్ అండ్ ఓన్లీ కళ్యాణ్ దిలీప్ సుంకర మాత్రమే. ఇప్పుడు ఆయన అండ లేకుంటే ఆ రేంజ్ లో సోషల్ మీడియాలో ఉపయోగపడే వారు ఏరీ?
ఇది తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించినట్లుంది. అందుకే అర్జంట్ గా తెలుగుదేశం అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ మరో వీడియో చేసి, సారీ చెప్పారు. తన వీడియో ఇంత పని చేస్తుందనుకోలేదని, కళ్యాణ్ దిలీప్ సుంకర కు క్షమాపణ చెబుతున్నానని అన్నారు. మరి ఇంక మరో మంచి పాయింట్ దొరకగానే ఆయన తన స్టయిల్ వీడియోలు చేయడం మొదలు పెడతారేమో?
ఏమైనా జనసేన-తేదేపా కూటమిలో తొలిసారి జనసేన ది పై చేయి అయింది.