ఎమ్మెల్యేలు రాజీనామా సాధ్యమేనా?

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తారని ఓ టాక్. చంద్రబాబుకు బెయిల్ రాకుండా, మరి కొంత కాలం కనుక జైలులోనే వుండాల్సిన పక్షంలో ప్రభుత్వం మీద వత్తిడి పెంచేందుకు, జనాల్లోకి…

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తారని ఓ టాక్. చంద్రబాబుకు బెయిల్ రాకుండా, మరి కొంత కాలం కనుక జైలులోనే వుండాల్సిన పక్షంలో ప్రభుత్వం మీద వత్తిడి పెంచేందుకు, జనాల్లోకి వెళ్లి మరింత పాజిటివ్ ట్రెండ్ ను సాధించేందుకు వీలుగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేస్తారనే గ్యాసిప్ ఎక్కడో పుట్టింది. కానీ ఇదెంత వరకు సాధ్యం అన్నది ప్రశ్న.

ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం పెద్ద కష్టం కాదు. పెద్దగా కాలపరిమితి కూడా మిగిలలేదు. కానీ అదే సమస్య. ఆరు నెలల కన్నా తక్కువ సమయం వుంటే ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి వుండదు. 

పోనీ ఉపఎన్నికలు వస్తాయి అనుకున్నా, గెలవకపోతే, మొత్తానికే మోసం వస్తుంది. ఇప్పుడు నెలకొంది అనుకుంటున్న పాజిటివ్ ట్రెండ్ అంతా పోతుంది. పైగా ఇప్పుడు పోటీ చేసేవారికి టికెట్ ఇస్తే, తరువాత కూడా వారికే ఇవ్వాలి. పైగా పొత్తులు ఇంకా తేలలేదు.

అందువల్ల తెలుగుదేశం ఎమ్మెల్యేల రాజీనామా అన్నది ప్యూర్ గాలి వార్తే అనుకోవాలి. అసలు ఆ ఆలోచన కూడా తెలుగుదేశం అధిష్టానం మదిలో మెదిలి వుండి వుండకపోవచ్చు. ఒకవేళ అలాంటి ఆలోచనను ఎవరైనా సజెస్ట్ చేసినా, పైన చెప్పుకున్న అనేకానేక సమస్యలు ఎదురు అవుతాయి. అందువల్ల 23 మంది ఎమ్మెల్యేల రాజీనామా అన్నది కేవలం గ్యాసిప్ గానే మిగిలిపోతుంది.