మస్క్ బోడి సలహాలకి ఒక నమస్కారం

ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడైనంత మాత్రాన అతనికి అన్నీ తెలుసు అనుకోవడం మూర్ఖత్వం.

అంధవిశ్వాసం, మితిమీరిన నమ్మకం ప్రమాదాలకు దారితీస్తాయి. ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడైనంత మాత్రాన అతనికి అన్నీ తెలుసు అనుకోవడం మూర్ఖత్వం.

మస్క్ కి తెలిసిందల్లా వ్యాపారం చేయడం. తన కంపెనీని నెంబర్ వన్ గా నిలెబెట్టుకోవడం. అంత మాత్రాన అతను ఒక దేశాన్ని కూడా నెంబర్ వన్ గా నిలబెట్టేస్తాడనుకోవడం పిచ్చితనం.

ట్యాక్సీ నడిపే డ్రైవర్ని తీసుకొచ్చి రిక్షా తొక్కమంటే ఎలా ఉంటుంది? ఆకాశంలో విమానాన్ని నడుపుతున్నాడు కదా అని సముద్రంలో ఓడను కూడా నపడమంటే ఎలా ఉంటుంది? ట్రంప్ ఆలోచన సరిగ్గా అలానే ఉంది.

ఒక కంపెనీని నడిపేవాడిని తీసుకొచ్చి దేశాన్ని నడపమంటున్నాడు. అతనిచ్చే సలహాలు శిరోధార్యమనుకుంటున్నాడు. కారణం అతను వ్యాపారంలో సక్సెస్ఫుల్ కాబట్టి.

కాస్ట్ కటింగులు, ఫైరింగులు, పది మంది చేసే పనిని ఒకడిచేతే చేయించడం లాంటివి కంపెనీల్లో సాగుతాయి. ప్రభుత్వంలో అలా కుదరదు. ప్రభుత్వోద్యోగులంటే సిటిజెన్స్. “అమెరికా ఫస్ట్” నినాదంతో గెలిచి కాస్ట్ కటింగ్ పేరుతో అమెరికన్ల ఉద్యోగాలే పీకేస్తుంటే ఎలా? పోనీ వాళ్లకి ప్రత్యామ్నాయం చూపిస్తున్నాడా అంటే లేదు.

హెచ్ 1 బీ ద్వారా వచ్చే విదేశీ ఉద్యోగుల్ని ఆపేసి ఈ ఉద్యోగాలు పోయిన వాళ్లని ప్రైవేట్ కంపెనీల్లో ప్లేస్ చేసుకోమంటున్నాడా అంటే అదీ లేదు. అందరూ అలా ప్లేస్ కాలేకపోయినా కొందరికైనా అవకాశాలుంటాయి, కట్టడిగా చేస్తే. అవేవీ చేయకుండా ఉద్యోగాలు పీకేస్తుంటే వాళ్లు “మస్క్ డౌన్ డౌన్” నినాదాలు చేస్తూ రోడ్లెక్కుతున్నారు. ఆందోళనకారులు కనిపించిన టెస్లా కార్లపై కోపం తీర్చుకుంటున్నారు.

మస్క్ తన డోజ్ ద్వారా తీసుకున్న తొలి నిర్ణయాల్లో ఈ ఊస్టింగుల కార్యక్రమం ఒకటి. అంతే కాదు ఈ ఊస్టింగుల్లో భాగంగా పేరున్న చాలామంది ముందే ఎగిరిపోయారు.

వివేక్ రామస్వామి తప్పుకున్నాడు. తప్పుకున్నడా లేదా మస్కే పొమ్మన్నాడా అనేది వేరే విషయం. పొమ్మనకుండా పొగ పెడితే చాలు కదా!

జాతీయ భద్రదా సలహాదారుడు మైకేల్ ఫ్లిన్ ని పీకేశారు. కారణం అతనికి రష్యాతో లింకులున్నాయట!

ఎఫ్బీయై డైరెక్టర్ జేంస్ కోమేని, ఇతర అధికారులు రెక్స్ టిలర్సన్, జేంస్ మాటీస్ లాంటి చాలామంది ఎగిరిపోయారు.

వీళ్లందరికీ మస్క్ పై ఎలాంటి కోపం ఉంటుందో చెప్పక్కర్లేదు. లుకలుకలు, కంప్లైంటులు మొదలయ్యాయి. వాతావరణం ట్రంప్ కి బెడిసికొట్టేలా ఉందని ట్రంప్ కూడా గ్రహించాడేమో. కొత్తగా మస్క్ ముందే ఒక ప్రకటన చేసాడు.

“మస్క్ సూచనలు మాత్రమే చేస్తాడు. అవసరమైన వాటిని అమలుపరిచే హక్కు ఆయా డిపార్ట్మెంట్ల హెడ్లదే” అన్నాడు.

అంటే ఇది డ్యామేజ్ కంట్రోల్ చర్య అన్నమాట. తాజాగా ఎఫ్బీయై కొత్త డైరెక్టర్ కాష్ పటేల్ కూడా “డోజ్ ఆర్డర్లని పట్టించుకోకండి” అని తన స్టాఫ్ తో చెప్పాడు. అంటే తమ ఉద్యోగాలకి భయం లేదు, మస్క్ ని పక్కన పెట్టి, తాను చూసుకుంటాను అని చెప్పినట్టే కదా!

ఇప్పటికే 14 రాష్ట్రాల్లో డోజ్ కి ప్రభుత్వ ఖర్చు పద్దుల యాక్సెస్ ఇవ్వకూడదని కేసులు వేసాయి. ఫెడరల్ జడ్జ్ కూడా అదే అంటున్నాడు.

మస్క్ ఎందరికో ఎసరుపెట్టాడు. ఇప్పుడూ అందరూ కలిసి మస్క్ కి ఎసరు పెడుతున్నారు. ఎంత ట్రంప్ కి మస్క్ ముద్దుల సహచరుడైనా, కాస్త దూరం పెట్టాల్సిన అవసరముంది. పూర్తిగా పెట్టకపోయినా స్టేట్మెంట్స్ లో అయినా ఇవ్వాలి. అతనికి పరిపాలనలో ఫ్రీహ్యాండ్ లేదని చెప్తూ ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది ట్రంప్ కి.

పైగా మస్క్ అమెరికా ఇమేజ్ ని దెబ్బతీస్తున్నాడు. తన పిల్లలతో వచ్చి ఓవల్ ఆఫీసులొ కూర్చోవడం, ఫార్మల్ గా ఉండాల్సిన చోట మరీ టెకిటీజీగా కనిపించడం రిపబ్లికన్స్ కే నచ్చడంలేదు. ఉక్రైన్ అధ్యక్షుడు జెలెన్స్కీని సూట్ వేసుకుని రాలేదెందుకని ఒక అధికారి వైట్ హౌజ్ లో ప్రశ్నించాడు… అది అమెరికాని అవమానించడమన్నాడు. కానీ అదే ప్రశ్న మస్క్ కి కూడా వర్తిస్తుంది!

మస్క్ చేతిలో ట్రంప్ కీలుబొమ్మ అనే టాక్ ప్రపంచమంతా పాకింది. దానిని పోగొట్టుకోవాల్సిన అవసరం కూడా ట్రంప్ కి ఉంది. లేకపోతే పరిస్థితులు అమెరికాకి నెగటివ్ గా మారే అవకాశముంది. లోకల్ గా మస్క్ నిర్ణయాలపై తిరుగుబాటు, అంతర్జాతీయంగా అన్ని దేశాలు కలిసి ట్రంప్ ని లెక్కచేయకపొవడం జరగొచ్చు. అలా జరిగితే అమెరికా పతనం వేగవంతమవుతుంది.

టారిఫ్స్ విధించడం కూడా చెప్పినంత తేలిక కాదు. అది తెలుసుకునే ట్రంప్ కూడా వెనక్కి తగ్గి కొన్ని వారాలు గడువిస్తున్నాని చెప్తున్నాడు. అసలు టారిఫ్స్ కి ప్రపంచదేశాలు భయపడకుండా తిరుగుబాటు బావుటా ఎగరేస్తే అమెరికా పరిస్థితి ఏంటి?

డాలర్ ట్రేడ్ కి వ్యతిరేకంగా బ్రిక్స్ మళ్లీ యాక్టివేట్ అయితే ట్రంప్ ఏం చేస్తాడు?

డాలర్ శక్తి వల్ల ఎకనామిక్ వార్ కి దిగేటంత దమ్ము అమెరికాకి లేకపోలేదు. కానీ దానివల్ల అమెరికాతో పాటూ ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ దెబ్బతినడం తప్ప ఏమీ ఉండదు.

ట్రంప్ వచ్చాక స్టాక్ మార్కెట్ బాగుంటుందనుకుంటే ఢామాల్ అంది. ఇంకా అంటోది. బిట్ కాయిన్ కూడా బావురుమని ఏడుస్తూ మూలుగుతోంది.

అందుకే మస్క్ సలహాలకి నమస్కారం పెట్టి ప్రభుత్వాన్ని దూకుడుగా కాకుండా పద్ధతిగా నడపాల్సిన అవసరముంది ట్రంప్ కి.

పద్మజ అవిర్నేని

12 Replies to “మస్క్ బోడి సలహాలకి ఒక నమస్కారం”

  1. ఇక్కడ రాసుకుంటే ఏమి లాభం? ఈ ముక్క అమెరికా పేపర్ లో ఇంగ్లీష్ లో రాసుకుంటే వాళ్ళు చదువుకుంటారు నీ భాధ.

  2. అసలు ట్రంప్ కూడా ఆ జాతి వాడే కదా?

    మొదటి టర్మ్ లోనే దేశాన్ని కంపెనీ నడిపి నట్టు నడిపే ప్రయత్నం చేసాడు. ఇప్పుడు కోతి కి కొబ్బరికాయ లా మస్క్ ఒకడు తయారు అయ్యాడు. ఇది పెద్ద ప్లాప్ కాంబినేషన్ అవుతుంది.

  3. ఏమిటో అక్కాయ్ ఈమధ్య అన్నతో పాటు మస్క్ కి కూడా సలహాలు ఇస్తోంది.

  4. ఇదే మాట , వైట్ హౌస్ కి మన వెబ్సైట్ తరఫు రాసి పంపు అక్క,

    మన వెనకటి రెడ్డి గారు , ఎలా usa లో యే డాక్యుమెంట్ పెట్టీ సెటిల్ అయ్యారు అనేది తవ్వి చూస్తారు.

    1. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారి మాట సాయం తో usa లో సెటిల్ అయ్యిన వెనకటి రెడ్డి ,

      ఇప్పుడు అదే వైఎస్ఆర్ భార్య కి వ్యతిరేకం గా రపిస్తున్నాడు, అదే మన రెడ్డి కులం నీతి.

  5. వాళ్ళు కూడా జగన్ అన్న తు.-.గ్ల.-.క్ సలహాలు తీసుకొంటె మంచిది అంటవా?

    1. Last time gelipinchina ventane kuda ilage anukunnaru le chetha president ever ani …voters chala manchi vallu vurike gatham marchipotharu ante only mana daggare ankunna..annichotla ilane vundhi paristhiti

  6. Biden recruited millions of federal employees to tackle unemployment rate. It is like China building ships in desert to create employment. It is will bring manufacturing to USA in big way, but takes at least couple o fyears.

Comments are closed.