హీరో నిర్మాతగా అందిస్తున్న సినిమా కోర్ట్. ఈ సినిమాను జనాలకు చేరువ చేయడానికి హీరో నాని కొత్త మార్గం తొక్కారు. సినిమా బాగా లేదంటే డబ్బులు వెనక్కు ఇస్తా అని అనలేదు. కోర్ట్ సినిమాకు కచ్చితంగా వెళ్లండి. ఇంటిల్లిపాదీ వెళ్లండి. ప్రెండ్స్ ను అందరినీ తీసుకెళ్లండి. ఒక వేళ కనుక సినిమా మీకు నచ్చకపోతే, మరో రెండు నెలల్లో వచ్చే నా హిట్ 3 సినిమా చూడకండి అని చెప్పుకు వచ్చారు నాని.
ఇంతకన్నా ఈ సినిమా గురించి ఎలా చెప్పాలో తనకు తెలియడం లేదన్నారు. తెలుగు ప్రేక్షకులు ఇంత గొప్ప సినిమా మిస్ కాకూదని ఇలా చెబుతున్నా అన్నారు నాని.
సరే, కోర్టు సినిమా మంచి సినిమా కావచ్చు, బాగుండొచ్చు. మొదటి రోజు అంతగా జనాలు రాకున్నా, బాగుంది అనే మౌత్ టాక్ వస్తే మన ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారు. అస్సలు వదలరు. బాగున్న సినిమా అంటే చాలు క్యూ కడతారు. బాగా లేని సినిమా అంటే పక్కన పెడతారు. ఈ విషయం నాని కి సైతం తెలియంది కాదు. బలమైన ఓపెనింగ్ తీసుకురావడం కోసం అలా అని వుంటారని సరిపెట్టుకోవాలా?
పోనీ అలాగే అనుకుందా అన్నా, హిట్ 3 చూడకండి అని చెప్పడం ఏమిటి? కోర్ట్ సినిమా చూసేసిన తరువాత అది బాగున్నా బాగా లేకున్నా హిట్ 3 చూడకుండా ఎలాగూ వుండరు ఫ్రేక్షకులు, ముఖ్యంగా తన ఫ్యాన్స్ అని నానికి తెలుసు. ఎందుకంటే హిట్ సిరీస్ క్రేజ్ అలాంటిది. అందువల్ల ఇలాంటి మాట చెప్పడం ద్వారా కోర్ట్ సినిమా కచ్చితంగా చూసేలా జనాలను డ్రయివ్ చేయడం తప్ప వేరు కాదు అని అర్థం అవుతోంది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Super nani garu meru
Veedi OA mamuluga undadu