సిద్దు జొన్నలగడ్డ.. రెండు హిట్ సినిమాలు. టిల్లు.. టిల్లు స్క్యేర్. తరువాత ఏంటీ? తెలుసుకదా అనే క్లాస్ సినిమా, జాక్ అనే మాస్ సినిమా చేస్తున్నారు. సహజంగా ఓ బ్లాక్ బస్టర్ క్రేజీ సినిమా తరువాత వస్తున్న సినిమా అంటే మాంచి క్రేజ్ వుంటుంది. వుండాలి కూడా. కానీ జాక్ సినిమా విడుదల డేట్ నెల రోజుల్లోకి వచ్చేసినా కూడా రావాల్సిన బజ్ రాలేదు. క్రేజ్ సంతరించుకోవడం లేదు. కారణం ఏమిటి?
ఇప్పటి వరకు సరిగ్గా కంటెంట్ ఇంకా రాలేదు. అందువల్లే అని అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి జస్ట్ టీజర్ మాత్రమే వచ్చింది. అందులో హీరో క్యారెక్టర్ ను పరిచయం చేసారు. ఇదే టిల్లు టైమ్ లొ ఆ క్యారెక్టర్ ను పరిచయం చేస్తే వచ్చిన వైబ్ వేరు. ఇప్పుడు వేరు. లేటెస్ట్ గా సాంగ్ వదిలారు. ఈ పాట కూడా హీరో క్యారెక్టర్ ను పూర్తిగా పరిచయం చేసే విధంగానే సాగింది. పాట ఎలా వుందన్నది పక్కన పెడితే సినిమా బజ్ పెంచడానికి అయితే పెద్దగా ఉపయోగపడదు.
టిల్లు లాంటి సిరీస్ తరువాత సిద్దు చేస్తున్న సినిమా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం, మాస్ క్యారెక్టర్, మాస్ టైటిల్. అందువల్ల ఇక లోపం ఎక్కడ వున్నట్లు? ప్రాపర్ గా కంటెంట్ ను మొదటి నుంచి లాంచ్ చేస్తూ, సినిమాకు బజ్ తీసుకురావడంలో యూనిట్ విఫలం కావడం వల్ల. ఇప్పుడు పబ్లిసిటీ ట్రెండ్ వేరుగా వుంది. సినిమాకు హీరో, దర్శకుడు, క్రియేటివ్ టీమ్ అంతా కలిసి ముందుగా ప్లాన్ చేసి, డే వన్ నుంచి సినిమాను జనాలకు చేరువ చేసే ప్రయత్నం చేయాలి. దానికి తోడు కంటెంట్ కూడా పడాలి. టిల్లు టైటిల్ సాంగ్ లాంటి సాంగ్ పడాలి.
వీటన్నింటికి తోడు సిద్దు రంగంలోకి దిగాలి. అప్పుడు కానీ జాక్ జనాలకు చేరువ కావడం కష్టం.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Chudam
Eedu jack kaadu fluke
Black mailing start చేశాడు…