చావు వివేకాది.. బ‌తుకు తెలుగుదేశానిది!

వివేకా మ‌ర‌ణించి ఆరేళ్లు అవుతున్నా, ఇంకా ఆ చావు నుంచి రాజ‌కీయంగా ప్రాణం పోసుకోవాల‌ని అనుకునే నాయ‌కుల్ని మ‌న‌మిప్పుడు చూస్తున్నాం.

“పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది” అని ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు చెప్పిన గొప్ప మాట‌… వైఎస్ వివేకా హ‌త్య‌లో సాక్షుల మ‌ర‌ణాల‌పై ప్ర‌భుత్వ అనుమానం గుర్తు చేస్తోంది. చావు వైఎస్ వివేకానిది, రాజ‌కీయ బ‌తుకు తెలుగుదేశానిది అని ప్ర‌జాక‌వి మాట‌ను కాస్త మార్చుకోవాల్సిన రాజ‌కీయ ప‌రిస్థితిని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చూడొచ్చ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వివేకా హ‌త్య‌కు సంబంధించి సాక్షుల్ని ఎవ‌రైనా ఏదైనా చేసి వుంటే, చ‌ట్ట‌ప‌రంగా త‌ప్ప‌క శిక్షించాల్సిందే. ఇందులో ఎవ‌రికీ అభ్యంతరాలు వుండాల్సిన ప‌నిలేదు.

అనుమానం రావాల్సింది ఎవ‌రికి? వ‌స్తున్న‌దెవ‌రికి?… ఈ ప్ర‌శ్న‌లు వేసుకుంటే, స‌మాధానంగా కూట‌మి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే అని చెబుతున్న వాళ్లే ఎక్కువ‌. వాచ్‌మ‌న్ రంగ‌న్న మృతితో వివేకా హ‌త్య కేసులో సాక్షుల మృతుల‌పై చంద్ర‌బాబు స‌ర్కార్‌కు అనుమానాలొచ్చాయ‌ట‌! వెంట‌నే ద‌ర్యాప్తున‌కు సిట్ వేయ‌డం గ‌మ‌నార్హం. అంత‌టితో ఆగ‌లేదు. నాట‌కాన్ని మ‌రింత ర‌క్తి క‌ట్టించేందుకు.. ఈ విష‌య‌మై వివ‌రాలు తెలుసుకునేందుకు మంత్రి వ‌ర్గ స‌మావేశానికి డీజీపీ హ‌రీష్‌కుమార్ గుప్తాను పిలిపించ‌డం, దాన్ని ప్ర‌భుత్వ అనుకూల మీడియా హైలైట్ చేయ‌డం… వారెవ్వా అంటున్నారు జ‌నం.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు స్వ‌యాన పిల్ల‌నిచ్చిన మామ ఈసీ గంగిరెడ్డి, అలాగే వ‌రుస‌కు అన్న కుమారుడైన డాక్ట‌ర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి మ‌ర‌ణంపై ప్ర‌భుత్వానికి అనుమానం వుంద‌ట‌. ఎక్క‌డైనా బాధితుల‌కు అనుమానం రావ‌డం గురించి విన్నాం, చూశాం. కానీ బాధిత కుటుంబ స‌భ్యులెవ‌రికీ లేని అనుమానాలు ప్ర‌భుత్వానికి రావ‌డం, ఆ వెంట‌నే ద‌ర్యాప్తున‌కు సిట్ వేయ‌డం, మంత్రి వ‌ర్గ స‌మావేశానికి డీజీపీని పిలిపించి మాట్లాడ్డం…. ఇవ‌న్నీ చూస్తే , డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో భాగ‌మ‌ని అర్థ‌మ‌వుతుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

చావుకేం తెలుసు… వాళ్లంతా వివేకా హ‌త్య కేసులో సాక్షుల‌ని. ఏదైనా చేయాల‌ని అనుకుంటే, వివేకాను హ‌త్య చేసింది తానే అని అప్రూవ‌ర్‌గా మారి, టీడీపీ అనుకూల టీవీ స్టూడియోల్లో కూచుని హీరోలా ఇంట‌ర్వ్యూలిస్తున్న వ్యక్తి ఇంకా బ‌తికే ఉన్నాడెందుకు? అనే అనుమానం ప్ర‌భుత్వానికి రాలేదెందుకో!

ప‌రిపాల‌న‌పై జ‌నంలో అసంతృప్తి మొద‌లైంద‌ని ప‌సిగ‌ట్టిన ప్ర‌భుత్వం, ఆ నెగెటివ్ నుంచి ఇప్పుడు కొత్త‌గా వివేకా హ‌త్య కేసులో సాక్షుల మ‌ర‌ణాల్ని అడ్డుపెట్టుకుని కొంత‌కాలం క‌థ న‌డ‌పాల‌ని అనుకుంటోంద‌నే అనుమానాలు ప్ర‌జ‌ల్లో ఉన్నాయి. వివేకా చావుతో మ‌రోసారి రాజ‌కీయంగా ఊపిరి పోసుకోవాల‌నే తాప‌త్ర‌యం… ఎవ‌రిలో, ఎందుకుందో తెలుసుకోలేని అమాయ‌క స్థితిలో ఏపీ స‌మాజం వుంద‌ని గుర్తిస్తే మంచిది.

బ్రెయిన్‌డెడ్ అయిన వాళ్ల నుంచి కొన్ని అవ‌య‌వాలు తీసుకుని, ఇత‌రుల‌కు అమ‌ర్చి ఊపిరిపోస్తుండ‌డం గురించి గొప్ప‌గా వింటుంటాం. కానీ వివేకా మ‌ర‌ణించి ఆరేళ్లు అవుతున్నా, ఇంకా ఆ చావు నుంచి రాజ‌కీయంగా ప్రాణం పోసుకోవాల‌ని అనుకునే నాయ‌కుల్ని మ‌న‌మిప్పుడు చూస్తున్నాం.

28 Replies to “చావు వివేకాది.. బ‌తుకు తెలుగుదేశానిది!”

  1. చావు తండ్రిది చిన్నాన ది, కష్టం చెల్లి ది తల్లిది, ఆస్తి అధికారం అన్న ది వదిన ది, దీన్ని కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం..

  2. అసలు వివెకా కెసులొ బాదితులు ఎవరు?

    అవినాష్ రెడ్డి, జగన రెడ్డులా?

    లెక భార్య, సౌభాగ్యమ్మా, కూతురు సునితలా లా?

    ఈ విషయంలొ రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఉంది, ఇంకా ఎంత కాలం బొంకుతావ్ GA!

    .

    పరిటాల హత్య్లొ నిందితులు వరుసగా అనుమాస్పద స్తితిలొ చదవటం మరిచిపొక ముందె, వివెకా వివెకా కెసులొ సాక్షులు వరుసగా చనిపొవటం ఎమిటి?

  3. వివేకా హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించినట్లే సాక్షి మీడియాలో రంగన్నను పోలీసులు చంపారంటూ తొలుత ప్రసారం కావటం ఇక్కడ నువ్వు రాయనె లెదు? ఇక్కడె అందరికి అనుమానం వచ్చింది!

    .

    వివేకా హత్య కేసులో సాక్ష్యుల మరణాల:

    • 2019 సెప్టెంబర్ 2వ తేదీన కె.శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి
    • సాక్షి గంగాధర్ రెడ్డి 2022 జూన్ 09న మృతి
    • వివేకాకు కుట్లు వేసిన భారతిరెడ్డి తండ్రి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి అనుమానాస్పదంగా మృతి
    • కుట్లు వేయటానికి సహకరించిన జగన్ రెడ్డి తమ్ముడు వైఎస్ అభిషేక్ రెడ్డి చిన్న వయసులోనే అనుమానాస్పద మృతి
    • వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న కూడా అనుమానాస్పదంగా కడప రిమ్స్​లో మృతి
    • వివేకా హత్య జరిగిన రోజు జగన్, భారతిలను హైదరాబాద్ నుంచి పులివెందుల తీసుకొచ్చిన డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి
  4. వివేకా హత్యను తొలుత గుండెపోటుగా చిత్రీకరించినట్లే సాక్షి మీడియాలో రంగన్నను పోలీసులు చంపారంటూ తొలుత ప్రసారం కావటం ఇక్కడ నువ్వు రాయనె లెదు? ఇక్కడె అందరికి అనుమానం వచ్చింది!

    .

    వివేకా హత్య కేసులో సాక్ష్యుల మరణాల:

    • 2019 సెప్టెంబర్ 2వ తేదీన కె.శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి
    • సాక్షి గంగాధర్ రెడ్డి 2022 జూన్ 09న మృతి
    • వివేకాకు కుట్లు వేసిన భారతిరెడ్డి తండ్రి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి అనుమానాస్పదంగా మృతి
    • కుట్లు వేయటానికి సహకరించిన జగన్ రెడ్డి తమ్ముడు వై.-.ఎస్ అభిషేక్ రెడ్డి చిన్న వయసులోనే అనుమానాస్పద మృతి
    • వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న కూడా అనుమానాస్పదంగా కడప రిమ్స్​లో మృతి
    • వివేకా హత్య జరిగిన రోజు జగన్, భారతిలను హైదరాబాద్ నుంచి పులివెందుల తీసుకొచ్చిన డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి
  5. హైకోర్టునే బురిడీ కొట్టించిన బోరుగడ్డ – అమ్మకు అనారోగ్యమంటూ ఫేక్ సర్టిఫికెట్

    ఈ వార్త ఎదిరా GA?

  6. శివ శంకర రెడ్డి,ఎర్ర గంగి రెడ్డి, ఉమామహేస్వర రెడ్డి,సునీల్ యాదవ్, దస్ట గిరి,అవినాశం, భాస్కరం.. నెక్స్ట్ వీళ్ళే.. వరుస మారొచ్చు.

  7. బాధిత కుటుంబం ఎంపీ కి హత్యతో సంబంధం ఉంది అని నెత్తి నోరు బాదుకుంది. మరి ఆ కుటుంబం నుండే సీఎం గ ఉంది ఎం పీకినట్లు?

  8. బాధిత కుటుంబం  సిబిఐ ఎంక్వయిరీ కావలి అంటే, అదే కుటుంబం నుండి సీఎం గా ఉంది అవసరం లేదు అని కోర్ట్ లో ఎందుకు చెప్పినట్లు

  9. వైస్సార్ చనిపోయి పదహారు ఏళ్ళు అయింది…అయినా రాజకీయం గా ప్రాణం పోసుకోడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు?

  10. ఆ శవాన్ని SYMPATHY డ్రామా కి వాడుకోవడానికి మాత్రం మన అన్నయ్య….😂😂…అంతేనా GA

  11. ఓరి నీ వేషాలూ… వివేకా చావు మీద బ్రతుకు కాదు జెగ్గు కుర్చీ ఎక్కిందే వివేకా చావు మీద….వివేకా చావు లేకపోతే 2019 లో కూడా చంద్ర బాబే ముఖ్యమంత్రి…2019 ఎన్నికల కోడ్ వచ్చాక ఎన్నికలకి సరిగ్గా మూడు వారల ముందు బాబాయిని వేసేసి “నారాసుర రక్త చరిత్ర” అని ఆ సింపతీ తో గెలిచాడు…. తండ్రి శవం దహనం చేయకముందే 147 మంది చేత సంతకాలు పెట్టించి డ్రామా మొదలు పెట్టాడు…. 2014 ఎన్నికకు జనసేన రావడంతో కుర్చీ ఎక్కలేకపోయాడు….2019 ఎన్నిక కోసం అక్టోబర్ 1 2018 లో చంద్ర బాబు సెంటర్ లో కాంగ్రెస్ కూటమితో కలవగానే అదే నెల 20వ తారీకున సెంటర్ లో బీజేపీ తో కుమ్మక్కు అయి ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్ లో (సెంటర్ పరిధిలో) కోడి కత్త్తితో పొడిపించుకుని నాటకాలు మొదలు పెట్టాడు…. బాబాయి హత్య నిజాలు తెలిసే లోపు కుర్చీ ఎక్కేసాడు…. బాబాయి కి 5 ఏళ్లలో ఒకసారి కానీ నివాళులు అర్పించలేదు ఈ కొడుకు… పైగా బాబాయి వ్యక్తిత్వ హననం చేయించాడు… అడ్డు పడినందుకు చెల్లెల్లు ఇద్దరి మీద అదే బూతుల దాడి….

  12. అత్యంత కీలకమైన మర్డర్ కేసులో ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఆరుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకూడదా.. సుమోటో గా యాక్షన్ తీసుకోకూడదా .. ఇదేం వింత వాదన GA గారూ. నోటికి ఏది వస్తే అది వాగెయ్యడం, చేతికి ఏది అనిపిస్తే అది అడ్డంగా రాసెయ్యడం.. ప్రత్యక్షంగా, పరోక్షంగా కనిపిస్తున్న కిల్లర్స్ ని కూడా సపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ రాయడానికి మీకు చేతులెలా వస్తున్నాయి సార్. జర్నలిజం మానేసి వాళ్ళింట్లో ఊడిగం చేసుకోండి

  13. అత్యంత కీలకమైన మర్డర్ కేసులో ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఆరుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకూడదా.. సుమోటో గా యాక్షన్ తీసుకోకూడదా .. ఇదేం వింత వాదన GA గారూ. నోటికి ఏది వస్తే అది వాగెయ్యడం, చేతికి ఏది అనిపిస్తే అది రాసెయ్యడం.. ప్రత్యక్షంగా, పరోక్షంగా కనిపిస్తున్న కిల్లర్స్ ని కూడా సపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ రాయడానికి మీకు చేతులెలా వస్తున్నాయి సార్. జర్నలిజం పక్కనపెట్టి వాళ్ళింట్లో ఊడిగం చేసుకోండి

  14. ఏంది వెంకట్ రెడ్డి.. భుజాలు తడుముకొంటున్నావు..

    “నారాసురరక్తచరిత్ర” అనే ఒక అబద్ధం ఈ రాష్ట్రాన్ని ఎంతగా నాశనం చేసిందో కనపడలేదా..

    ఇప్పుడు వాచ్ మన్ రంగన్న విషయం లో కూడా సాక్షి కూతలు చూసావా..

    ఆయన చనిపోయిన రోజు.. పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడని రాశారు..

    ఈ రోజు మెయిన్ ఎడిషన్ లో “సహజ మరణం” అని రాశారు..

    ..

    మీ కప్పదాట్లకు అనుమానం రాకూడదా.. వస్తుంది వెంకట్ రెడ్డి..

    ..

    అంతెందుకు.. నీ జగన్ రెడ్డి నిజాయితీ పరుడే అయితే.. అసెంబ్లీ కి వచ్చి..

    బాబాయ్ హత్య లో సాక్షులందరూ చనిపోతున్నారని .. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయమను..

    బోరుగడ్డ అనిల్ కి ఫెక్ సర్టిఫికెట్స్ తో బెయిల్ ఎలా ఇచ్చారో..

    ప్రభుత్వాన్ని అడిగి కడిగి పారేయమను..

    అసలే జగన్ రెడ్డి లేక “కళ” తప్పింది.. రమ్మను.. వచ్చి “కళ” తెప్పించమను ..

  15. అత్యంత కీలకమైన మర్డర్ కేసులో ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఆరుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకూడదా.. సుమోటో గా యాక్షన్ తీసుకోకూడదా .. ఇదేం వింత వాదన GA గారూ. నోటికి ఏది వస్తే అది వాగెయ్యడం, చేతికి ఏది అనిపిస్తే అది రాసెయ్యడం.. ప్రత్యక్షంగా, పరోక్షంగా కనిపిస్తున్న కిల్లర్స్ ని కూడా సపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ రాయడానికి మీకు చేతులెలా వస్తున్నాయి సార్. జర్నలిజం పక్కనపెట్టి వాళ్ళింట్లో ఊడిగం చేసుకోండి

Comments are closed.