మహేష్-నమ్రత కూడా విడిపోయారు

మహేష్-నమ్రత కూడా విడిపోయారు. కానీ మిగతావాళ్లలా కాకుండా, కొన్నాళ్లకు మళ్లీ కలిశారు. ఈ విషయాన్ని నమ్రత స్వయంగా బయటపెట్టారు.

ఇండస్ట్రీలో ఎన్నో బ్రేకప్స్ ఉన్నాయి. కళ్ల ముందే విడిపోయిన సెలబ్రిటీ జంటలున్నాయి. ఆ తర్వాత మరో కొత్త జీవితాన్ని ప్రారంభించినవాళ్లూ ఉన్నారు. ఈ లిస్ట్ లో మహేష్-నమ్రత కూడా ఉన్నారు.

అవును.. కాస్త అశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం. మహేష్-నమ్రత కూడా విడిపోయారు. కానీ మిగతావాళ్లలా కాకుండా, కొన్నాళ్లకు మళ్లీ కలిశారు. ఈ విషయాన్ని నమ్రత స్వయంగా బయటపెట్టారు.

“మహేష్ కెరీర్ లో చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అదే టైమ్ లో నేను కూడా నా తల్లిదండ్రుల్ని కోల్పోయాను. మా మధ్య కొన్ని అభిప్రాయబేధాలొచ్చాయి. కొడుకు గౌతమ్ ను తీసుకొని నేను ముంబయికి వచ్చేశాను. కొన్నాళ్లు మేం విడిపోయాం. అయితే ఆ విడిపోవడంతోనే మా బంధం ఎంత బలమైనదో తెలుసుకున్నాం.”

అలా తెలుసుకున్న తర్వాత తిరిగి కలుసుకున్నట్టు వెల్లడించారు నమ్రత. విడిపోయి కలుసుకున్న తర్వాతే సితార జన్మించింది. అంతేకాదు, మహేష్ వల్ల తన కెరీర్ ను పక్కనపెట్టిన విషయాన్ని కూడా నమ్రత బయటపెట్టారు.

“పెళ్లి తర్వాత నేను పనిచేయాలని మహేష్ కోరుకోలేదు. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడే మహేష్ ఈ విషయం నాకు చెప్పాడు. హీరోయిన్ గా ఉన్నానని కాదు, నేను ఏ ఆఫీస్ జాబ్ లో ఉన్నప్పటికీ మహేష్ నన్ను ఆ జాబ్ వదిలేయమని అడిగేవాడు. స్టార్ హీరోయిన్ అవ్వాలనే ఆశ నాకు ఎప్పుడూ లేదు. అందుకే కెరీర్ ఆపేసినప్పుడు పెద్దగా బాధ అనిపించలేదు.”

తను మహేష్ కంటే పెద్దదాన్నని, తమకు సమస్యలు అక్కడ్నుంచే మొదలయ్యాయని, అయినప్పటికీ ప్రతిది పరిష్కరించుకుంటూ ఓ మంచి కుటుంబాన్ని ఏర్పాటుచేసుకున్నామని అంటున్నారు నమ్రత. ప్రస్తుతం లైమ్ లైట్ కు దూరంగా, భర్తే సర్వస్వంగా కుటుంబ బాధ్యతలు మోస్తోంది నమ్మత. మహేష్ కు చెందిన పలు వ్యాపారాల్ని కూడా ఈమె చూసుకుంటోంది.

6 Replies to “మహేష్-నమ్రత కూడా విడిపోయారు”

Comments are closed.