ఏం ఖర్మరా బాబూ!: నందమూరి ఫ్యాన్స్ దిగులు!

జనసేన- తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం నాయకులందరూ కూడా.. పవన్ కల్యాణ్ బొమ్మను ముద్రించిన జనసేన కండువాలను భుజాల మీద వేసుకుని ఫోటోలు దిగుతున్నారు. Advertisement తద్వారా.. తమ రెండు పార్టీల…

జనసేన- తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం నాయకులందరూ కూడా.. పవన్ కల్యాణ్ బొమ్మను ముద్రించిన జనసేన కండువాలను భుజాల మీద వేసుకుని ఫోటోలు దిగుతున్నారు.

తద్వారా.. తమ రెండు పార్టీల మధ్య చాలా సఖ్యత ఉన్నదని.. కలిసి మెలిసి ముందుకు సాగుతున్నాం అని చాటడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కలిసే ఉన్నాయని నిరూపించుకోవడానికి.. ఊరూరా రెండు పార్టీల నాయకుల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే నందమూరి బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో కూడా సమావేశం జరిగింది. 

ఎమ్మెల్యే హోదాలో బాలయ్య కూడా పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ ది నాది ఒకే మనస్తత్వం.. ఉన్నదున్నట్టుగా మాట్లాడేస్తాం.. అవినీతిని నిలదీస్తాం అని బాలయ్య తన డప్పు ప్లస్ పవన్ డప్పు కలిపి వాయించారు. అంత వరకు ఓకే. కానీ.. పవన్ కల్యాణ్ బొమ్మను అచ్చేసిన కండువాలను కప్పుకుని బాలయ్య కనిపించడం.. నందమూరి ఫ్యాన్స్ కు చాలా కంటగింపుగా ఉంది. వారు ప్రధానంగా సంధిస్తున్న ప్రశ్నలు కొన్ని ఉన్నాయి.

రెండు పార్టీల ఉమ్మడి సమావేశాలు ప్రతిచోటా జరుగుతూనే ఉన్నాయి. పవన్ కల్యాణ్ గానీ, కనీసం ఆయన పార్టీలో నెంబర్ టూ నాదెండ్ల మనోహర్ గానీ ఎన్నడైనా తెలుగుదేశం పార్టీ పసుపు పచ్చ కండువాలు వేసుకుని ఫోటోలు దిగారా? అనేది తెలుగుదేశం వారి తొలి ప్రశ్న. కిందిస్థాయి నాయకులు మాత్రమే వేసుకుంటున్నారనేది వారి ఆవేదన. నందమూరి ఫ్యాన్స్ వేదన అంతకంటె పెద్దది.

బాలకృష్ణ చాలా పెద్ద హీరో. క్రేజ్ విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్ కంటె ఎక్కువ క్రేజ్ ఉన్న నటుడే అని చెప్పుకోవాలి. పవన్ సినిమాలైనా కొన్ని ఫ్లాప్ అవుతాయేమో గానీ… బాలయ్య సినిమాలకు బాక్సాఫీసు వద్ద మినిమం గ్యారంటీ ఉంటుంది. అలాంటిది ఇవాళ బాలయ్య పవన్ కల్యాణ్ బొమ్మలు ముద్రించిన కండువాలను భుజాల మీద వేసుకోవాల్సి వచ్చింది. నిజానికి తెలుగుదేశం పార్టీ పచ్చ కండువాల మీద ఆయన బొమ్మ ఉండవలసిన రేంజి కదా బాలయ్యది.. అని నందమూరి ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

గతంలో ఏ కారణాల వల్ల ఆయన పార్టీ సారథ్యాన్ని వద్దనుకున్నారనేది వేరే సంగతి. కానీ.. ఇప్పుడు బావ చంద్రబాబునాయుడు జైలుకు పరిమితం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్న సమయంలోనైనా నందమూరి బాలయ్య పార్టీ పగ్గాలు స్వీకరించాలి కదా అనేది వారి కోరిక. 

నిజానికి చంద్రబాబు సీఎంగా కొనసాగినా సరే.. పార్టీ సారథ్యం నందమూరి కుటుంబంచేతిలో, బాలయ్య చేతిలో ఉండాలనే డిమాండ్ నందమూరి ఫ్యాన్స్ నుంచి చాలాకాలంగా ఉంది. అదే జరిగి ఉంటే.. ఇప్పుడు బాలయ్య ఫోటో ముద్రించిన కండువాలను పవన్ కల్యాణ్ కూడా వేసుకోవాల్సి ఉండేది కదా.. అప్పుడు పరువుగా ఉండేది కదా అని వారు వాపోతున్నారు. మరి వారి కోరిక తీరుతుందో లేదో?