‘చైనా’ కాలేజీలు.. అనే మాట తెలుగునాట చాలా పాపులర్. పిల్లలను హింసించి అయినా సరే వారికి మార్కులు తెప్పించే కాలేజీల కింద చైనా కాలేజీలకు చాలా గుర్తింపు ఉంది. చైనా కాలేజీలు అంటే అర్థం అందరికీ తెలుసు. చైనా కాలేజీలు అనే పదబంధంతో సినిమాల్లో డైలాగులు కూడా వచ్చాయి. అవి రెండు గ్రూపులకు చెందిన కాలేజీల సమూహాలు. వీటిలో తాజా పరిణామాలతో ఒక గ్రూపు విద్యా వ్యాపారం సర్వనాశనం అయిపోతుందా? అనే అనుమానం పలువురిలో కలుగుతోంది.
ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి.. నారాయణ ప్రస్తుతం బెయిలుపై బయట ఉన్నారు. పేపర్లు లీకైన నాటినుంచి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి అనేక రకాల ఆరోపణలు ముప్పిరిగొన్నాయి. బాధ్యులుగా తేలిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.
అదే సమయంలో.. నారాయణ కాలేజీల వ్యవస్థాపకుడు మాజీ మంత్రి నారాయణ ఈ మొత్తం లీకేజీల బాగోతానికి సూత్రధారిగా కూడా తేలింది. ఆ నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేశారు. తాను ఎప్పుడో 2014లోనే నారాయణ సంస్థల అధిపతిగా రాజీనామా చేసేశానని కోర్టు ఎదుట చెప్పుకుని.. నారాయణ ప్రస్తుతానికి బెయిలు తెచ్చుకున్నారు.
ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. చాలా శోధించి, పలువురిని విచారించిన తర్వాత సూత్రధారిని అరెస్టు చేస్తే ఇలా తేలిగ్గా బెయిలు తెచ్చుకోవడంపై పైకోర్టుకు వెళ్లనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పైకోర్టులో కూడా ప్రభుత్వానికి ఊరట దక్కే అవకాశం తక్కువ. అప్పటికీ ప్రభుత్వం దీనిని సీరియస్ గా పరిగణించి, పంతానికి పోతే గనుక.. పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. ‘నారాయణ’ సంస్థల సామ్రాజ్యానికి పెద్ద నష్టమే జరిగే అవకాశం ఉంది.
ప్రొఫెషనల్ కాలేజీలను మినహాయిస్తే.. ఉన్నత పాఠశాలలు 300, జూనియర్ కాలేజీలు 300 లను నారాయణ గ్రూపు నిర్వహిస్తోంది. లీకేజీ వ్యవహారాన్ని ప్రభుత్వం గట్టిగా బయటకు లాగిందంటే గనుక.. అధినేత నారాయణ టెక్నికల్ గా తప్పించుకోవచ్చు గానీ.. ప్రతిచోట కీలక స్థానాల్లో ఉండే సిబ్బంది ఇరుక్కుంటారు. నారాయణ బెయిలుపై జారుకోవడం వలన.. ఆ సంస్థ ఉద్యోగులు పదుల సంఖ్యలో అరెస్టు అయినా ఆశ్చర్యం లేదు. ఆ రకంగా సంస్థ పరువు పోతుంది.
అదే సమయంలో ఇంకో ప్రమాదం ఉంది. వీరి విద్యా వ్యాపారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే.. తనిఖీలు పెంచుతుంది. ఒక పాఠశాల, కాలేజీ ఏర్పాటు చేయడానికి పాటించాల్సిన నియమ నిబంధనలను బయటకు తీశారంటే.. వాటిలో 90 శాతం కాలేజీలు.. నిబంధనలకు విరుద్ధంగానే ఉంటాయన్నది గ్యారంటీ. వాటిని సీజ్ చేయడానికి ప్రభుత్వం పూనుకుంటే గనుక.. నారాయణ విద్యా వ్యాపారం ఒక్కసారిగా కుప్పకూలుతుంది.
వచ్చే అకడమిక్ ఇయర్ ప్రారంభం అయ్యేనాటికి ఈ దాడులు నిర్వహించి.. నిబంధనలు పాటించని, స్కూలుకు తగిన గ్రౌండులు లేని వాటిని కొన్నింటిని మూసేస్తే.. నారాయణ విద్యాసంస్థల్లో ఏది ఎప్పుడు సీజ్ అవుతుందోననే భయంతో చేరేవారి సంఖ్య భారీగా తగ్గిపోతుంది. ఆ రకంగా చూసినా కూడా.. నారాయణ విద్యావ్యాపారం దారుణంగా కుప్పకూలే ప్రమాదం ఉంది.
Veedu college business pichi peaks
ఇలాంటి పాచిపోయిన పాత వార్తలు డిలీట్ చేస్తేనే నువ్వు ఎలాంటి విపి వార్తలు రాసావో అందరికీ తెలియకుండా ఉంటుంది.. నారాయణ అరెస్ట్ జైలు ఏంట్రా అనుకున్నా.. ఆయన ఇప్పుడు మంత్రి కదా.. డేట్ చూస్తే తెలిసింది.. ఇది రెండేళ్ల క్రితం నువ్వు రాసిన పిచ్చి పుల్కా వార్త అని
😇😇🤐🤐😬😬😬🤣🤣🤣Narayana, narayana
కొత్త కంటెంట్, వ్యూస్ క్లిక్స్ రావట్లేదు పాపం. అందుకే పాతవి తవ్వి తీస్తున్నాడు.
yeraa kuppa koolindhaa…langaa vedhava.
చెత్త కంటెంట్ వెదికి మరీ తిప్పి తిప్పీ వేసే వెదవ బతుకు నీకెందుకురా జర్నలిజం. పోయి నీ బీ బ్యాచ్ కు చిడతలు కొట్టుకోకుండా
Mari antha anyayam jarugunte mi prabhutavam yenduku serious ga tisukoledu…. please cheppavaaa