అదిగో కౌంటింగ్ అంటే ఇదిగో ప్రమాణ స్వీకారం అంటున్నాయి పార్టీలు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం, డేట్, టైమ్ ముందే ఫిక్స్ చేసినట్లు లీడర్లు ప్రకటించారు. అదే పనిగా వైకాపా జనాలు కూడా ముహుర్తం పెట్టేసి హడావుడి మొదలుపెట్టేసారు.
దీంతో వైకాపా అనుకూల జనాలు ప్రమాణ స్వీకారానికి ముందు తేదీలు అయిన ఏడు, ఎనిమిది తేదీల్లో బస్ రేట్లు పెరిగిపోయాయి. హోటల్ రేట్లు పెరిగిపోయాయి అంటూ హడావుడి. తెలుగుదేశం జనాలు రివర్స్ లో, అబ్బే అసలు బస్ టికెట్ లు బుక్ కావడం లేదు. అంతా ఖాళీనే అంటూ కౌంటర్.
నిజానికి విశాఖలో ప్రస్తుతానికి ఏ హడావుడి జరగడం లేదు. నాల్గవ తేదీ మధ్యాహ్నం వరకు పరిస్థితి ఇలాగే వుంటుంది. ఆ రోజు కౌంటింగ్ స్టార్ట్ అయ్యాక, ట్రెండ్ తెలిస్తే మార్పు రావాలి తప్ప మరేమీ కాదు. అప్పుడు ట్రెండ్ వైకాపా అంటే వైజాగ్ లేదా తేదేపా అంటే విజయవాడ ఫుల్ బిజీ అవుతాయి.
ప్రస్తుతానికి రెండు చోట్లా కూడా ఎటువంటి హడావుడి లేదు. వైజాగ్ లో హోటళ్లు అన్నీ 7,8,9 తేదీలకు ఖాళీగానే వున్నాయి. రేట్లు కూడా నార్మల్ గానే వున్నాయి. ఏమీ పెరగలేదు. అందువల్ల పొలిటికల్ యాక్టివిటీ లేక ఖాళీగా వున్న సోషల్ మీడియా హ్యాండిళ్ల హడావుడి తప్ప మరేమీ కాదు ఇదంతా అన్న క్లారిటీ వస్తోంది.