Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఎన్టీఆర్..తెలుగుదేశం..భవిష్యత్

ఎన్టీఆర్..తెలుగుదేశం..భవిష్యత్

ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ తగు రీతిలో స్పందించలేదన్నది తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్స్, అలాగే దాని మూలాల్లో వున్న వర్గం అసంతృప్తికి కారణమైంది. అసలు ఎన్టీఆర్ ఎవరి కోసం ఇప్పుడు కత్తి పట్టుకుని కదనరంగంలోకి దిగిపోవాలి. లోకేష్ కు, చంద్రబాబుకు, బాలయ్యకు అవసరం. వారు రాజకీయాల్లో వున్నారు. పదవులు అనుభవించారు. అనుభవిస్తున్నారు. ఇంకా అనుభవించాలనుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ అలా కాదు కదా?

అసలు చంద్రబాబు లేదా బాలయ్య ఒక్క విషయం క్లారిటీగా చెప్పగలరా?

లోకేష్ వుండగా ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీలో తగు స్థానం, ప్రయారిటీ వుంటుందా? ఎన్టీఆర్ సంగతి కాస్సేపు పక్కన పెడదాం. విశాఖ నుంచి పోటీ చేయడానికి లోకేష్ తోడల్లుడు, బాలయ్య చిన్నల్లుడు ఎంత కిందా మీదా కావాల్సి వచ్చింది. 2019లో అక్కడ బాలయ్య చిన్నల్లుడు పోటీ చేయడానికి ఎంత హంగామా జరిగిందో పార్టీ వర్గాలకు బాగా తెలుసు. తోడల్లుడు భరత్ కు చాన్స్ ఇవ్వకుండా చేయడానికి లోకేష్ విశ్వప్రయత్నం చేసారన్నది పార్టీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.

సరే, ఈ సంగతి కూడా అలా వుంచుదాం. అసలు ఎన్టీఆర్ ఇలా సినిమాల్లోకి ఎంటర్ కాగానే తారకరత్న కు ఒకటి కాదు, రెండు కాదు, ఒకేసారి తొమ్మిది సినిమాలకు క్లాప్ పడింది. అది ఎలా సాధ్యమైంది? దాని వెనుక ఏం జరిగింది? ఎవరు ఉన్నారు? అన్న గుసగుసలు టాలీవుడ్ లో ఇప్పటికీ వున్నాయి కదా?

ఇక అలాగే ఓ ఛానెల్ వ్యవహారంలో లోకేష్-ఎన్టీఆర్ పోటీ పడ్డారని, కిందా మీదా అయ్యారని కూడా గ్యాసిప్ లు వున్నాయి. గతంలో ఎన్టీఆర్ ను మహానాడుకు పిలిచారా అన్న ప్రశ్న ఎదురయినపుడు లోకేష్ ఏమన్నారు? పార్టీ ఎవ్వరినీ పిలవదు. అభిమానంతో రావాలి అంతే అనే కదా? ఇలా పార్టీ పరంగా ఎన్టీఆర్ ను దగ్గరకు తీసుకోకుండా ఎన్ని చేసారు? అన్నీ పార్టీ జనాలకు తెలుసు..ఎన్టీఆర్ కు తెలుసు.

లోకేష్ మంత్రి పదవి స్వీకారం సందర్భంగా కళ్యాణ్ రామ్ వెళ్లినపుడు ఆయనకు సరైన స్వాగతం లభించని మాట వాస్తవం కాదా? ఎన్టీఆర్-జగన్ ఎయిర్ పోర్ట్ నోవాటెల్ లో కలిసి మాట్లాడుకున్నారని గతంలో వదంతులు ప్రచారం జరిగిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ ఎవరు చేసి వుంటారు?

ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ ల సోదరిని కూకట్ పల్లి బరిలోకి దింపినపుడు ఓ మాట అయినా వారికి చెప్పలేదని వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. ఇలా అడుగు అడుగునా, పైకి తెలియకపోయినా ఎన్టీఆర్ ను వీలయినంతగా పార్టీకి దూరంగానే వుంచుతూ వచ్చారు.

ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలకలేదని యాగీ ప్రారంభించారు. సినిమా కెరీర్ కు ముందు ఎన్టీఆర్ ను ‘మావాడు..మనవాడు’ కాదన్నారు. ఓ రేంజ్ కు వెళ్లగానే ‘మావాడే..మనవాడే’ అన్నారు. మళ్లీ ఇప్పుడు అబ్బే ‘మావాడు..మనవాడు’ కాదంటున్నారు. ఇలా అవసరం బట్టి, స్పందనను బట్టి ఎన్టీఆర్ ను కలుపుకోవడం లేదా దూరం చేయడం చేస్తుంటే, అసలు అతగాడు ఎందుకు పార్టీకి దగ్గర కావాలి? ఎందుకు మద్దతు ఇవ్వాలి.

తాతపేరు వాడుకున్నాడు అనొచ్చు. ఎవరి తాత పేరు ఎవరు వాడుకున్నారు. ఎన్టీఆర్ తన తాత పేరు తను వాడుకుంటే తప్పేంటీ? విశ్వాసాలు అనే పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ ను గద్దె మీద నుంచి లాగినపుడు ఎవరు విశ్వాసాలు ప్రదర్శించారు.

చంద్రబాబు-లోకేష్ చేతిలో తెలుగుదేశం పార్టీ వున్నంత కాలం ఎన్టీఆర్ దానికి దూరంగానే వుండాల్సిందే. ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్ కు స్ధానం వుండదు. లేదూ తెలుగుదేశానికి ఇంక చంద్రబాబు-లోకేష్ తో లాభం లేదని, ఎవరైనా పూనుకుని ఎన్టీఆర్ ను దానికి దగ్గర చేయాలి. అది జరగాలంటే 2024 లో కూడా జగన్ గెలవాల్సి వుంటుంది. అప్పుడు తెలుగుదేశంలో చాలా అంటే చాలా మార్పులు వచ్చే అవకాశం అయితే పక్కాగా వుంటుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?