అమరావతిలో ఏకైక రాజధాని కొనసాగించాలనే డిమాండ్‌తో అరసవెల్లికి పాదయాత్ర చేస్తున్నారు. ప్రశాంతంగా చేస్తామని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడమని హైకోర్టుకు హామీ కూడా ఇచ్చారు. కానీ గుడివాడలో వారు చేసిందేంటి? మాజీ మంత్రి కొడాలి నాని అడ్డాలో ఆయనపై తొడలు కొట్టారు. కొడాలి నానిపై అభ్యంతరకర భాషను ప్రయోగించారు. ఈ భాష ఎల్లో మీడియాకు, టీడీపీ నేతలకు వినసొంపుగా వుంటుంది.
ఇదే కొడాలి నాని తిడితే మాత్రం చేదుగా వుంటోంది మరి. కొడాలిని రెచ్చగొట్టి, ఆయనతో చంద్రబాబు, లోకేశ్‌లను నానాబూతులతో తిట్టించడం అవసరమా? పాదయాత్రగా గుడివాడ వెళ్లిన టీడీపీ నేతలు, అమరావతి రైతులు …దమ్ముంటే బయటకు రావాలని కొడాలికి సవాల్ విసరడం ఏంటి? ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు ఒక అడుగు ముందుకేసి, కొడాలిని దూషించారు. మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్న కొడాలిని చెప్పు దెబ్బలతో సత్కరించాలని మాగంటి పిలుపునిచ్చారు. బూటుకాలుతో తంతానని ఆయన తీవ్ర వ్యాఖ్య చేయడం గమనార్హం.
అలాగే కొందరు మహిళలు తొడలు కొట్టి కొడాలి నాని, ఆయన అనుచరులపై రెచ్చగొట్టే చర్యలకు దిగారు. పాదయాత్ర వద్దకు కొడాలి నాని, ఆయన అనుచరులు వచ్చి అడ్డంకులు సృష్టిస్తే… దూషణలను, తొడలు కొట్టడాన్ని అర్థం చేసుకోవచ్చు. అదేం లేదు కదా! మరి ఎందుకు ఈ పనులనే ప్రశ్నలొస్తున్నాయి. కొడాలి నాని సంగతి తెలిసి కూడా టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
అసలే కొడాలి నాని నోరు మంచిది కాదు. చంద్రబాబు, లోకేశ్‌లు ఆయనకు గుర్తొస్తే ఏం మాట్లాడ్తారో ఆయనకే తెలియదు. పాదయాత్రలో పెద్ద ఎత్తున జనం వున్నారని కొడాలిపై తిట్టొచ్చు. అంతిమంగా నాని తిట్టేది చంద్రబాబు, లోకేశ్‌లనే కదా? ఈ మాత్రం జ్ఞానం వారిలో ఎందుకు కొరవడిందో అర్థం కాదు. కొడాలిని తిట్టడం ఎందుకు? ఆయనతో చంద్రబాబు, లోకేశ్‌లను తిట్టించడం ఎందుకు? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.