ఈ పార్టీలకు ఏమైంది.. ఎవ్వరూ నోరు మెదపరేంటి?

పవన్ కల్యాణ్ వచ్చారు.. వైసీపీని తిట్టి వెళ్లారు. Advertisement చంద్రబాబు వచ్చారు.. వైసీపీని తిట్టి వెళ్లారు సోము వీర్రాజు వచ్చారు.. వైసీపీని తిట్టి వెళ్లారు. అసలు ఈ పార్టీలకు ఏమైంది? తిడితే పనైపోతుందా.. ఎన్నికల్లో…

పవన్ కల్యాణ్ వచ్చారు.. వైసీపీని తిట్టి వెళ్లారు.

చంద్రబాబు వచ్చారు.. వైసీపీని తిట్టి వెళ్లారు

సోము వీర్రాజు వచ్చారు.. వైసీపీని తిట్టి వెళ్లారు.

అసలు ఈ పార్టీలకు ఏమైంది? తిడితే పనైపోతుందా.. ఎన్నికల్లో ఓట్లు రాలతాయా? గతంలో ప్రతిపక్షం స్థానంలో ఉన్నప్పుడు జగన్ కూడా అదే చేశారు. చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను, బీజేపీని విమర్శించారు. కానీ అంతమాత్రానికే ఆయనకు అధికారం దక్కలేదు. విమర్శలు చేయడంతో పాటు.. తన ఎజెండా ఏంటో చెప్పారు. 

అధికారం అప్పగిస్తే ఏం చేస్తానో ప్రజలకు వివరించారు. అందుకే అఖండ మెజారిటీ అందుకున్నారు. కానీ బీజేపీ, జనసేన, టీడీపీ మాత్రం ఈ విషయంలో నోరు మెదపడం లేదు. తమ నోటిని జగన్ ను తిట్టడం వరకే పరిమితం చేస్తున్నాయి. ఆ తర్వాత ఏంటనేది చెప్పడం లేదు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలి.

కన్ఫ్యూజన్ లో ప్రతిపక్షాలు..

ఏపీలో నవరత్నాల కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో జగన్ ఈ కార్యక్రమంలో ఏ ఒక్కటి ఆలస్యం చేసినా, ఆపినా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం గ్యారెంటీ. అలాంటిది ప్రతిపక్షాలు.. ఆయా పథకాలను ఆపేసి కొత్తవాటిని మొదలు పెడతామని చెప్పలేవు. పోనీ కొనసాగిస్తామంటే అది జగన్ కు నకలుగా మారుతుంది. 

అందుకే పథకాల విషయంలో ప్రతిపక్షాలు కన్ఫ్యూజన్లో పడ్డాయి. పోనీ కొత్త పథకాలు తెస్తామంటే.. ఉన్నవాటికే నిధులు లేవని విమర్శిస్తున్నారు కదా, ఇంకా కొత్త పథకాలేంటని ప్రజలు ప్రశ్నించే అధికారం ఉంది. దీంతో వారు పూర్తిగా డైలమాలో పడ్డారు.

జగన్ కు చాలా ఈజీ..

2024 ఎన్నికల్లో జగన్ కొత్తగా చేయాల్సిన ప్రామిస్ లు ఏవీ లేవు. నవరత్నాల పథకాలను కొనసాగిస్తానని చెబితే చాలు. మద్యపాన నిషేధం వంటి వాటిని చేయగలిగితే ఓకే, లేకపోతే వచ్చే దఫా ఎలా చేస్తారో చెబితే చాలు. 

అయితే ప్రతిపక్షాలకు మాత్రం కష్టమే. అందుకే ఎవ్వరూ నోరు మెదపడంలేదు. కనీసం తాము ఏం చేయబోతున్నామని కూడా చెప్పుకునే సాహసం చేయడంలేదు.

వైసీపీని తిడితే పనైపోతుందా..?

మేనిఫెస్టో అంటే ఎన్నికల ముందు విడుదల చేసి, ఎన్నికలైపోయి అధికారంలోకి వచ్చాక దాన్ని ఇంటర్నెట్ లో కూడా లేకుండా చేయడం టీడీపీకి అలవాటు. కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేని బీజేపీ హామీలను ప్రజలు అస్సలు లెక్కలోకి కూడా తీసుకోరు. 

ఇక జనసేన ఉచిత పథకాలేవీ వద్దంటోంది. సో.. వాళ్లు చెప్పే మాటలు జనాలకు రుచించవు, ఓట్లు పడవు. అందుకే కేవలం వైసీపీని తిట్టే పని పెట్టుకున్నాయి ప్రతిపక్షాలు. అదే ఫ్లో కంటిన్యూ చేస్తున్నాయి. ఈ విమర్శల వల్ల వాళ్లకు ఓట్లు రాలవనే విషయాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.