వీర‌మ‌ల్లు కాదు…ఘోర‌మ‌ల్లు

జ‌గ‌న్ నువ్వేమైనా దిగొచ్చావా… నువ్వెంత నీ బ‌తుకెంత అని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఎలియాస్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎక్క‌డ‌? షూటింగ్‌లో బిజీగా వున్నాడ‌ని కొంద‌రు, త‌దుప‌రి వ్యూహ ర‌చ‌న‌లో వున్నాడ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. అమాయ‌క…

జ‌గ‌న్ నువ్వేమైనా దిగొచ్చావా… నువ్వెంత నీ బ‌తుకెంత అని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు ఎలియాస్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎక్క‌డ‌? షూటింగ్‌లో బిజీగా వున్నాడ‌ని కొంద‌రు, త‌దుప‌రి వ్యూహ ర‌చ‌న‌లో వున్నాడ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. అమాయ‌క అభిమానులు మాత్రం ప‌వ‌న్ జ‌నంలోకి వ‌చ్చి అద్భుతాలు సృష్టిస్తార‌ని న‌మ్ముతున్నారు.

ప‌వ‌న్ నాన్ సీరియ‌స్ అనిఅంద‌రికీ తెలుసు. అందుకే ప‌దేళ్ల నుంచి జ‌న‌సేన‌కి జ‌న‌మూ లేరు, సైన్య‌మూ లేరు. అస‌లు పార్టీ ఎందుకు పెట్టాడు? జ‌గ‌న్ మీద కోప‌మా? బాబు మీద ప్రేమా? జ‌గ‌న్ మీద కోపం అనుకుంటే కార‌ణాలు ఎవ‌రికీ తెలియ‌దు. బాబు మీద ప్రేమ‌కి మాత్రం కార‌ణాలు అంద‌రికీ తెలుసు. పార్టీ పెట్ట‌గానే బాబుని గెలిపించండి అన్నాడు. ఆయ‌న్ని గెలిపించ‌డానికి ఈయ‌న పార్టీ పెట్ట‌డం దేనికో అర్థం కాలేదు.

బాబు గెలిచిన త‌ర్వాత నాలుగేళ్లు షూటింగ్‌ల్లో బిజీ. జ‌నాన్ని గాలికి వ‌దిలేశాడు. చివ‌ర్లో వ‌చ్చి సొంతంగా పోటీ చేస్తాన‌న్నాడు. బాబు వ్య‌తిరేక ఓట్లు చీల్చ‌డమే టార్గెట్ అని అంద‌రూ అన్నారు. ఏమైతేనేం టోట‌ల్‌గా ఓడిపోయాడు. మ‌ళ్లీ ఎన్నిక‌లొచ్చాయి. ఈ సారి చంద్ర‌బాబుకి జై అని వ‌స్తున్నాడు. 

దాదాపు ఒక ద‌శాబ్ద‌పు జ‌ర్నీలో జ‌న‌సేన ఎజెండా ఏమిటో ప‌వ‌న్‌కీ తెలియ‌దు. జ‌గ‌న్‌ని ఓడించ‌డం అని కాకుండా, త‌న‌ని గెలిపిస్తే ఏం చేస్తాడో చెప్ప‌డు. రైతులు, మ‌హిళ‌లు, కార్మికులు, బీసీలు, ద‌ళితులు వీళ్లంద‌రికీ జ‌న‌సేన ఏం చేస్తుందో చెప్ప‌రు. జ‌గ‌న్‌ని ఓడించి జ‌న‌సేన‌ని గెలిపిస్తే సంక్షేమ ప‌థ‌కాలు కంటిన్యూ అవుతాయా? లేదా? చెప్ప‌రు.

జ‌నంలోకి ఒక స్ప‌ష్ట‌మైన విధానంతో కాకుండా, కేవ‌లం అభిమానుల ఈల‌ల్ని న‌మ్మే రాజ‌కీయం చేస్తే విశ్వ‌స‌నీయ‌త వుంటుందా? నాదెండ్ల మ‌నోహ‌ర్ కాకుండా మ‌రో సీనియ‌ర్ నాయకుడు లేని పార్టీ, రాని పార్టీ రేపు ఎన్నిక‌ల్లో గ‌ట్టిగా నిల‌బ‌డుతుందా?  

ప‌వ‌న్‌తో పొత్తు వ‌ల్ల బాబుకి రాజ‌కీయంగా న‌ష్ట‌మే త‌ప్ప లాభం లేదు. ఎందుకంటే బాబు గ్యారెంటీగా సీట్లు ఉన్నాయి. జ‌న‌సేన గ్యారెంటీగా గెలిచే సీటు ఒక‌టైనా వుందా? తెలుగుదేశం ఊతంతో జ‌న‌సేన గెల‌వాలి త‌ప్ప‌, జ‌న‌సేన వ‌ల్ల టీడీపీ గెల‌వ‌దు. ఓటు చీల‌కూడ‌ద‌ని ఏకైక కార‌ణం త‌ప్ప , పొత్తు వ‌ల్ల టీడీపీకి సున్నానే.

బాబు అరెస్ట్ అయిన త‌ర్వాత పొత్తు పార్టీ నాయ‌కుడిగా ప‌వ‌న్ జ‌నంలోకి వెళ్లి వుంటే రెస్పాన్స్ వేరుగా వుండేది. క‌నీసం వారాహి యాత్ర‌ని కొన‌సాగించినా లెక్క వేరే. అవ‌న్నీ వ‌దిలి ప‌వ‌న్ సైలెంట్ అయిపోయారు. క‌నీసం త‌న బీజేపీ మిత్రుల్ని కూడా ప్ర‌భావితం చేయ‌లేక‌పోయారు. 

ప‌వ‌న్ , లోకేశ్‌లా చంద్ర‌బాబు పిరికివాడు కాదు. జైలు నుంచి వ‌చ్చిన వెంట‌నే నాన్‌స్టాప్ కార్యాచ‌ర‌ణ లోకి దిగుతాడు. లోకేశ్ వ‌ల్ల పార్టీ బ‌త‌క‌ద‌ని ఈ ప‌ది రోజుల్లో అర్థ‌మైపోయింది. వీర‌మ‌ల్లు కేవ‌లం మాట‌ల మ‌ల్లు అనే క్లారిటీ కూడా వుంది. ఒక‌వేళ బాబు ఎన్నిక‌ల వ‌ర‌కూ బ‌య‌టికి రాక‌పోతే… టీడీపీని ఎవ‌రూ కాపాడలేరు.