పిఠాపురం.. ఎమ్మెల్యే vs డిప్యూటీ సీఎం

ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎన్నికలు జగన్ వర్సెస్ చంద్రబాబు చుట్టూ తిరుగుతే.. సోషల్ మీడియాలో మాత్రం పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం చూట్టే చర్చ జరుగుతోంది. దీనికి ముఖ్య కార‌ణం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో…

ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎన్నికలు జగన్ వర్సెస్ చంద్రబాబు చుట్టూ తిరుగుతే.. సోషల్ మీడియాలో మాత్రం పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం చూట్టే చర్చ జరుగుతోంది. దీనికి ముఖ్య కార‌ణం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో నిల‌బ‌డ‌ట‌మే. అందుకే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారా ఓడిపోతారా గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తాడు ఓడితే ఎన్ని ఓట్లతో ఓడిపోతాడు అని విపరీతంగా చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా ఈసారి ప‌వ‌న్‌ గెలవబోతున్నాడు అంటూ అత్యుత్సాహంతో ఆయ‌న‌ అభిమానులు సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇప్పటికే తమ ఫోన్ల‌ పైన తమ బైకు నెంబర్ ప్లేట్ల పైన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ స్టిక్కర్లు అతికించుకుంటూ సరదా పడుతున్నారు. 

తాజాగా పవన్ అభిమానుల‌కి కౌంటర్ గా వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి వంగా గీత అభిమానులు కూడా తమ బైకులు.. తమ ఫోన్లపై పిఠాపురం డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ వారు సంద‌డి చేస్తున్నారు. వీరిని చూస్తుంటే పిఠాపురం మాత్రం ఎవ‌రు గెలిచిన ఓడిన ఇద్ద‌రి అభిమానుల అనందానికి హద్దులు ఉండ‌క‌పోవ‌చ్చు. ఎన్నిక‌ల అనంత‌రం వంగా గీత మాట్లాడుతూ ఖ‌చ్చితంగా తాను గెలుస్తానంటూ ధీమా వ్య‌క్తం చేశారు. 

కాగా ప‌వ‌న్ గెలుపు కోసం మెగా హీరోలల్లో చిరంజీవి(కేవ‌లం వీడియోలో ప్ర‌చారం) త‌ప్పా మిగిలిన వారంద‌రూ పిఠాపురం వెళ్లి ప‌వ‌న్‌ను గెలిపించ‌డం అంటూ వేడుకున్నారు. అలాగే సినిమా ప‌రిశ్ర‌మ‌లోని కొంత మంది న‌టులు, నిర్మాత‌లు కూడా ఇంటింటికి వెళ్లి ప‌వ‌న్ కోసం ప్ర‌చారం చేసిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు వైసీపీ నుండి వంగా గీత ఒక‌రే ఇంటింటికి వెళ్లి ప్ర‌చారం చేశారు. ప్రచారం చివ‌రి రోజు పిఠాపురంలో సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ వంగా గీత‌ను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తా అంటూ ప్ర‌క‌టించారు. 

మ‌రోవైపు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ హడావుడి చేస్తున్న ప‌వ‌న్ అభిమానుల‌ను చూసి.. ఇన్ని రోజులు ప‌వ‌న్‌ సీఎం.. సీఎం.. అంటూ అరిచిన మీరే ప‌వ‌న్ ఎమ్మెల్యే  అంటున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒక‌వేళ కూట‌మి అధికారంలోకి వ‌స్తే ప‌వ‌న్‌కు ఎదైన మంత్రి ప‌దవి వ‌చ్చే అవ‌కాశం ఉంది.