1). చాయ్ దుకాణం కామెంట్ కారు కండీషన్‌లోనే వుంది కానీ, గేర్లే సరిగా పడడం లేదు
2). బీజేపీ కార్యకర్త ఆవేదన – కొలనులో వుండాల్సిన కమలం, గాజు గ్లాస్‌లో ఇరుక్కుపోయింది
3). కాంగ్రెస్ భయం – హస్తం గుర్తుపై గెలిచి , హ్యాండ్ ఇచ్చే వాళ్లే ఎక్కువున్నారు
4). బాబు ఏం చేస్తున్నాడు -దృష్టి కోణాన్ని సవరించుకుంటున్నాడు
5). ఉట్టికి ఎగరలేక, స్వర్గానికి ఎగిరినట్టు ఉదాహరణ – పవన్ తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయడం
6). టీడీపీ అభిమాని ఆవేదన -అసలే రోడ్లు బాలేవు, సైకిల్‌పైన జనసేనని ఎక్కించుకుని తొక్కాలి
7). ఆంధ్రాలో బీజేపీకి నోరుంది కానీ, గెలిచే వూరు లేదు- ఓటరు కామెంట్
8). నాయకులు ఇపుడు బజ్జీలు వేయిస్తారు గెలిచాక మనల్ని నూనెలో వేయిస్తారు
9). ఓటర్ డిమాండ్లు ఎలా వున్నాయంటే నాయకులకి చలిలో కూడా చెమటలు పడుతున్నాయి
10). ప్రజాస్వామ్యమంటే – నెలరోజులు జనం చుట్టూ తిరిగి ఐదేళ్లు తమ చుట్టూ జనాన్ని తిప్పించుకోవడం
11).దూకడానికి అనువుగా వుంటుందని నాయకులు పోల్‌వాల్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు
12).లోకేశ్ చేతిలో రెడ్‌బుక్ ఎక్కడ? -లాయర్లకు ఇచ్చే చెక్‌బుక్‌గా మారింది
13). టీడీపీ కార్యకర్త కామెంట్ -బాబుకి చత్వారమని తెలియక, పార్టీకి దారి చూపిస్తాడని ఆశపడ్డం
14). పవన్ దృష్టిలో పాలిటిక్స్ – రెండు షూటింగ్‌ల మధ్యలో బ్రేకింగ్ టైమ్
15).ఓటరు అమాయకత్వం -కొండ చిలువని శాలువ అని నమ్మడం