
వెనుకబడిన కడప జిల్లాపై రామోజీరావు కక్ష కట్టారు. వైఎస్ కుటుంబంపై అక్కసు, చివరికి వారు పుట్టిన గడ్డను కూడా ద్వేషించేలా రామోజీ నైతికంగా పతనమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్లో గ్యాంగ్ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి మాత్రమే అని నేటి ఈనాడు కథనం నిరూపించింది. అమరావతిని కాదని వైఎస్సార్ జిల్లాలోని కొప్పర్తిని కొత్త నగరంగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిందని రామోజీ ఆలోచనల్ని ప్రతిబింబించేలా ఆయన పత్రిక విషం చిమ్ముతూ కథనాన్ని వండివార్చడం గమనార్హం.
15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు దేశంలో 8 కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సంతోషించదగ్గ విషయం. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను కేంద్రం కోరింది. వైఎస్సార్ జిల్లాలోని కడప నగరానికి అతి సమీపంలోని కొప్పర్తిని ఏపీ సర్కార్ ప్రతిపాదించింది. ఇదో పెద్ద నేరంగా రామోజీకి కనిపిస్తోంది. ఎందుకంటే అమరావతిని కాదని, ఎక్కడో వెనుకబడిన కడప జిల్లాలోని కొప్పర్తిని పంపడం ఏంటంటూ ఈనాడు నిలదీస్తూ కథనం రాసింది.
అమరావతిని ప్రతిపాదిస్తేనే విజ్ఞత వున్నట్టని స్పష్టం చేసింది. కొప్పర్తిని ప్రతిపాదించింది కాబట్టి జగన్ సర్కార్‌కు అసలు విజ్ఞతే లేదని ఈనాడు పత్రిక నిస్సిగ్గుగా రాసుకొచ్చింది. ఇప్పటికే కొప్పర్తిని పారిశ్రామికంగా ఏపీ సర్కార్ అభివృద్ధి చేస్తోంది. ఈ పరంపరలో కేంద్ర ప్రభుత్వం కల్పించిన గొప్ప అవకాశాన్ని జగన్ మంచిగా ఆలోచించి, సద్వినియోగం చేసుకున్నారు.
కొప్పర్తిలో కూడా భూసమీకరణ చేసిన సంగతి రామోజీకి తెలిసినట్టు లేదు. ప్రస్తుతం నగరం కోసం మరింత అవసరం కావచ్చేమో. గ్రామీణ వాతావరణంలో ఉన్న ఆ ప్రాంతాన్ని నగరంగా అభివృద్ధి చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. వైఎస్ జగన్ సర్కార్ నినాదమే అన్ని ప్రాంతాల అభివృద్ధి. చంద్రబాబు ప్రభుత్వం మాదిరిగా అంతా అమరావతిపైనే పెట్టుబడి పెట్టడానికి జగన్ సర్కార్ సిద్ధంగా లేదు.
అమరావతిపై వైసీపీ ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో ఇదో ఉదాహరణగా ఈనాడు పత్రిక రాసుకొచ్చింది. జగన్ సర్కార్‌కు కాదు, మిగిలిన ప్రాంతాలపై ఎల్లో గ్యాంగ్‌కు కక్ష అని ఇలాంటి రాతల ద్వారా అర్థమవుతోంది. జగన్ సర్కార్‌కు అమరావతిపై కక్షే వుంటే, మరి ఆ ప్రాంతంలో ఇవాళ 51 వేల నిరుపేద కుటుంబాలకు నివాస స్థలాలు ఇచ్చి, మహానగరంగా అభివృద్ధి చేయాలని ఎందుకు ముందుకొస్తుంది? లక్షలాది మందిని రాజధాని ప్రాంతానికి శాశ్వతంగా తీసుకురావడం ద్వారా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కాదా? కరవుతో అల్లాడే వైఎస్సార్ జిల్లాలో ఓ నగరాన్ని అభివృద్ధి చేయాలని భావించడమే నేరమా?
కొప్పర్తిపై విషం చిమ్మితే తూ...అని మూస్తారని ఈనాడు పిల్లిమొగ్గలు వేసింది.
"సొంత జిల్లాపై ముఖ్యమంత్రికి అభిమానం ఉండొచ్చు. కానీ ఆయన ముఖ్యమంత్రి అనే విషయం మరిచిపోతే ఎలా? కొప్పర్తిలోనో, మరో ప్రాంతంలోనో కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడాన్ని ఎవరూ కాదనరు. కేవలం ఒక ప్రాంతంపై కక్షతో రాష్ట్ర ప్రయోజనాల్ని పణంగా పెట్టడాన్ని ఏమనాలి? కేంద్రం నిర్మించాలని అనుకుంటున్న ఒక్కో నగరానికి రూ.1000 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం ప్రతిపాదించింది. ఎంపిక చేసిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.250 కోట్లు ఇస్తుంది"
జగన్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే కొప్పర్తిని ప్రతిపాదించారు. చంద్రబాబు సీఎంగా ఉంటే, అమరావతి తప్ప, మరో ప్రాంతం కంటికి కనిపించేదా? ఏంటీ వితండ వాదం. కొప్పర్తిని ప్రతిపాదిస్తే ముఖ్యమంత్రి అనిపించుకోరా? ఆహా ఏం పలికావయ్యా రామోజీ. కొప్పర్తిలోనో, మరో ప్రాంతంలోనో కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడాన్ని ఎవరూ కాదనరంటూనే, తమరు చేస్తున్న పనేంటనే ప్రశ్నకు రామోజీ వద్ద సమాధానం వుందా? ఇదేనా విజ్ఞత?
కొప్పర్తిని వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తారనే ఆలోచననే జీర్ణించుకోలేకపోతున్నారనేది ఈనాడు రాతలు స్పష్టం చేస్తున్నాయి. ఈనాడు పత్రిక బరితెగింపునకు ఇంత కంటే నిదర్శనం ఏం కావాలి? దేశంలో 8 నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, అందులో ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకోవడం... సీఎం జగన్ ప్రతిభకు నిదర్శనం.
ఇటీవల ఏపీ లోటు బడ్జెట్ కింద రూ.10 వేల కోట్లకు పైగా నిధుల్ని జగన్ సర్కార్ రాబట్టడాన్ని మరిచిపోకనే, మరో ఘనతను సాధించింది. ఇదే ఎల్లో గ్యాంగ్ కడుపు మంటకు దారి తీసింది. మీడియాని అడ్డు పెట్టుకుని విషం చిమ్మడమే లక్ష్యంగా రాతలు రాస్తోంది. ప్రజలు ఛీత్కరించుకునేలా చేస్తోంది. జగన్ విజయం, ఎల్లో గ్యాంగ్ ఓటమి ఇవే.
నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా