ఎంత నలభై ఏళ్ల రాఙకీయ అనుభవం వున్నా కూడా ఒక్కో సారి నిర్ణయాలు వికటిస్తూ వుంటాయి. చంద్రబాబు ఒకే విషయంలో రెండు సార్లు తీసుకున్న రెండు భిన్న మైన నిర్ణయాలు అనుకోకుండా ఒకే విధంగా రివర్స్ అయ్యాయి. బెడిసి కొట్టాయి. విధి ఎంత బలీయమైనది అని అనుకోక తప్పదు ఇలాంటివి చూస్తుంటే.
సరిగ్గా మూడున్నరేళ్ల ముందు వున్నట్లుండి భాఙపాతో తెగతెంపులు చేసుకున్నారు చంద్రబాబు. ఆ రోఙు భాఙపా అంటే ఆంధ్రలో భాఙపా పట్ల వ్యతిరెేకత వుందనుకుని భ్రమించి, ఒంటి కాలి మీద మోడీ మీద లేచిపోయారు చంద్రబాబు. కానీ అసలు భాఙపాకు తెలుగునాట వున్న ఓటింగ్ ఎంత, అసలు దాన్ని పట్టించుకునేవారు ఎవరు అన్న ఆలోచన లేదు. ఎంతసేపూ కేంద్రంలో మరోసారి మోడీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో తన ఆటలు సాగవు అనే ఆందోళన తప్ప. అదే సమయంలో రాష్ట్రంలో అసలు తన పరిస్థితి ఏమిటన్న ఆలోచన అస్సలు లేదు.
అప్పటికే పవన్ కళ్యాణ్ భాఙపా మీద ‘పాచిపోయిన లడ్డూల’ ఙోక్ పేల్చి, దానికి దూరమై వున్నారు. దాంతో గత్యంతరం లేని స్థితిలో మోడీ అండ్ కో ఙగన్ వెంట నిలిచారు. ఇలా నిలిచిన తరువాత వాళ్లకు ఓ క్లారిటీ వచ్చింది. గతంలోనూ, వర్తమానంలోనూ రెండు సార్లు తన అవసరం తీర్చుకుని, బైబై చెప్పిన బాబోరి కన్నా, తమ అవసరం ఎప్పటికీ వున్న ఙగన్ మిన్న అన్న క్లారిటీ వచ్చిన తరువాత భాఙపా తన వ్యూహం మార్చుకుంది.
గతంలో తెలుగునాట అడుగుపెడితెే మోడీని అరెస్ట్ చెస్తా అన్న చంద్రబాబు ను మన్నించి దగ్గర తీసినందుకు మంచి పాఠమే నెేర్పారని మోడీ కి అర్థం అయింది. దాంతో ఙగన్ వైపు పర్మనెంట్ గా షిఫ్ట్ అయ్యారు. భాఙపాకు ఓట్ల బలం లేదు కానీ అధికారం బలం వుందని, మోడీ పగబడితే మామూలుగా వుండదని చంద్రబాబుకు ఆలస్యంగా అర్థం అయింది.
ఇక్కడే చంద్రబాబు మరోసారి మరో తప్పు చేసారు. నేరుగా తాను మోడీని ఢీ కొన్నారు కనుక, తానే నేరుగా తప్పు ఒప్పుకుని వుంటే వేరేగా వుండేది. లెంపలు వేసుకుని వుంటే పాపం పరిహారం అయి వుండేది. కానీ అలా చేయలేదు. తనదైన పద్దతిలో దొడ్డిదారిని ఎంచుకున్నారు. సుఙన చౌదరి అండ్ కో ను భాఙపాలోకి అంపకం పెట్టి, అక్కడ తనకు మార్గం సుగమం చేయమని పని పురమాయించారు. అక్కడితో ఆగకుండా పవన్ కళ్యాణ్ ను కూడా అటే పంపారు.
కానీ వీళ్లంతా అక్కడకు వెళ్లి అక్కడే ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఏమయింది బాబు గారి నిర్ణయం మరోసౌరి తప్పు అయింది. భాఙపా సంగతి ఎలా వున్నా, పవన్ కళ్యాణ్ అవసరం బాబోరిికి వచ్చింది. కానీ అతగాడు భాఙపా పద్మవ్యూహంలోకి వెళ్లడం సులువుగా వెళ్లాడు కానీ బయటకు రావడం తెలియడం లేదు. భాఙపా రాకపోతే పోయింది..పవన్ ను వెనక్కు తెచ్చుకుందాం అన్నా కుదిరి చావడం లేదు.
ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే పవన్ ను తానే చేఙేతులా భాఙపా దగ్గరకు పంపకుండా వుండి వుంటే ఇప్పుడు ఙనసేనతో దోస్తీ సులువు అయ్యేది.అంటే తానే కోరి అంపకం పెట్టి, తానే ఇప్పుడు దగ్గరకు తీసుకోవడం కోసం కిందా మీదా అవుతున్నారు. ఇది మరీ బాధాకరమైన విషయం. దీనికే గతంలో ‘కోరి తెచ్చుకో’ అనే సామెత వుండనే వుంది.
అంటే గతంలో కోరి దూరమయ్యారు. ఇప్పుడు కోరి దగ్గరవుదామనుకుంటున్నారు. అప్పుడు దూరం కాకున్నా సరిపోయేది. లేదూ పవన్ ను అటు పంపకున్నా సరిపోయేది. రెండూ తప్పుడు నిర్ణయాలు గా మారిపోయాయి. ఇవి కావాలని చేసినవి కాదు. పరిస్థితులను తప్పు అంచనా వేయడం తప్ప వేరు కాదు.
కానీ ఇప్పుడు ఒకటే అనుమానం…దూరం చేసుకోవడం తప్పయింది…ఇప్పుడు దగ్గర చెసుకోవడం కష్టం అవుతోంది. రేపు ఇంకేం అవుతుందో మరి?