Advertisement

Advertisement

indiaclicks

Home > Politics - Analysis

సిగ్గు భాజపాకు వుండాలి

సిగ్గు భాజపాకు వుండాలి

పురంధేశ్వరి భాజపాను భూ స్ధాపితం చేస్తున్నారు. భాజపా అభ్యర్ధుల పేరుతో తెలుగుదేశం జనాలను దించుతున్నారు, ఇలా చేయడానికి సిగ్గుందా అంటూ భాజపా కార్యకర్తలు సోషల్ మీడియా సాక్షిగా కిందా మీదా అయిపోతున్నారు. ప్రశ్నిస్తున్నారు. కానీ నిజానికి సిగ్గు వుందా అని అడగాల్సింది పురంధేశ్వరిని కాదు. భాజపా అధిష్టానాన్ని.

ఎందుకంటే వేటగాడు మెత్తనైతే కదా లేడి మూడు కాళ్ల మీద గెంతేది. తెలుగుదేశం, పురంధేశ్వరి కలిసి చేస్తున్న ఈ ములాఖత్ సంగతి భాజపా అధిష్టానానికి తెలియదా?

భాజపా అభ్యర్ధుల ఎంపిక ను పార్టీ అధిష్టానం పర్యవేక్షించాలి కదా. తమ పార్టీని నమ్ముకుని చిరకాలంగా వున్నది ఎవరో, మరో పార్టీ నుంచి వచ్చినది ఎవరో తెలియదా? అప్పటిప్పుడు పార్టీ కండువా మార్చించి, టికెట్ లు ఇస్తుంటే భాజపా అధిష్టానం చోద్యం చూస్తోందా? పార్టీ రాష్ట్ర పరిశీలకులు, బాధ్యులకు ఇవన్నీ తెలియని విషయాలా?

మరి ఎందుకు తేదేపా ఆడించినట్లు భాజపా ఆడుతోంది. ఎక్కడ ఏం జరిగింది? తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇదే జరుగుతోంది. రాష్ట్రంలో భాజపా అనేది ఎప్పటికప్పుడు కట్ చేసి, ఎదగకుండా చేసే క్రోటన్స్ మొక్క మాదిరి తయారైంది. ఇలా తయారు కావడానికి కారణం రాష్ట్ర భాజపా పెద్దలు. తేదేపా తో సామాజిక బంధాలు పెనవేసుకున్న వారు.

వారిని అలా వదిలేసి, పార్టీని ఎదగకుండా చేయడంలో తమ వంతు పాపం కూడా పంచుకుంటున్నది భాజపా అధిష్టానం. అందువల్ల సిగ్గుందా అని కార్యకర్తలు అడగాల్సింది రాష్ట్ర భాజపాను కాదు, కేంద్ర అధిష్టానాన్ని.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?