Advertisement

Advertisement


Home > Politics - Analysis

పతివ్రత తెలుగుదేశం

పతివ్రత తెలుగుదేశం

తెలుగుదేశం అభిమానాన్ని నరనరాల నింపేసుకున్న మీడియాకు వైకాపాలో అన్నీ తప్పులే కనిపిస్తాయి. అలాంటి వ్యవహారాలు తెలుగుదేశం పార్టీలో వున్నా అస్సలు కళ్లకు కనిపించవు. వైకాపా లో సీనియర్లు చాలా మంది ఈసారి పోటీ చేయమని తమ వారసులకు టికెట్ లు ఇవ్వాలని కోరుతున్నారట. ఇదీ అద్భుతమైన కథనం. 

సరే, రాజ‌కీయాల్లో ఇది మామూలే. దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు తాము అధికారంలో వుండగానే పిల్లలను అందలం ఎక్కించేసి, వారసత్వంగా అధికారం అందించాలన్న తహ తహ వుంటుంది. దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు. కానీ అక్కడికేదో వైకాపా లోనే ఈ జాఢ్యం వున్నట్లు కథనం వండి వార్చారు.

కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏం చేసారు..ఏం చేస్తున్నారో మరిచారు. గతసారి అధికారంలో వుండగానే కొడుకు లోకేష్ కు నచ్చిన టికెట్ ఇచ్చేసారు. తన పార్టీనే కదా. అడగాల్సిన పనే లేదు. కానీ జ‌నం తిరగొట్టారు. అయినా ఊరుకోకుండా దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి, ఏకంగా మంత్రిని చేసేసారు. మరి దీన్ని ఏమంటారు..పైగా తన కొడుకును వారసత్వం అని ఎక్కడ అంటారో అని తన పార్టీలోని నేతల పిల్లలను కూడా ఎంకరేఙ్ చేయడం ప్రారంభించారు.

కిం.రాపు ఎర్రంనాయుడు కుమారుడు, బండారు సత్యనారాయణ కుమారుడు, గౌతు శివాజీ కుమార్తె, అయ్యన్న పాత్రుడి తనయుడు, ఆడారి తులసీరావు తనయుడు ఆనంద్ (ఇప్పుడు పార్టీ మారారు), పరిటాల రవి కుమారుడు శ్రీరామ్, ఎంవివిఎస్ మూర్తి మనుమడు భరత్, ప్రతిభా భారతి కుమార్తె, ఇలా ఙాబితా రాసుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీలో ఎంకరేజ్ చేసిన వారసుల జాబితా చాంతాడంత వుంటుంది.

కానీ దీన్ని మరిచిపోయి, వైకాపాలో ఇదేదో కొత్త వింత అని, అసంతృప్తి అన్నట్లుగా, గెలుపు మీద భయం అన్నట్లుగా, ఇలా రకరకాల ఫీలింగ్స్ కలిగేలా కథనం వండి వార్చారు. అసలు వారసత్వ రాజ‌కీయాలను తెగనాడింది ఎన్టీఆర్. ఆయన పెట్టిన పార్టీని తను లాగేసుకుని చంద్రబాబు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నదే వారసత్వాన్ని.

కానీ ‘మన మీడియా’ కదా. కన్వీనియెంట్ గా వాస్తవాన్ని దాచేసి, వైకాపా మీద బురద జ‌ల్లే ప్రయత్నం చేస్తోంది. రోజూ వుండే పనే కదా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?