ప‌చ్చ ఏడుపులు.. రూ.371 కోట్లు చంద్ర‌బాబుకు చిల్ల‌ర‌ట‌!

నిజ‌మే కావొచ్చు..  చంద్ర‌బాబుపై 1999లోనే రెండు వేల కోట్ల రూపాయ‌ల అవినీతి ఆరోప‌ణ‌ల‌ను చేశారు క‌మ్యూనిస్టులు! చంద్ర‌బాబు నాయుడు 95లో సీఎం అయితే, 99 నాటికే రెండు వేల కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను సంపాదించార‌నేది…

నిజ‌మే కావొచ్చు..  చంద్ర‌బాబుపై 1999లోనే రెండు వేల కోట్ల రూపాయ‌ల అవినీతి ఆరోప‌ణ‌ల‌ను చేశారు క‌మ్యూనిస్టులు! చంద్ర‌బాబు నాయుడు 95లో సీఎం అయితే, 99 నాటికే రెండు వేల కోట్ల రూపాయ‌ల ఆస్తుల‌ను సంపాదించార‌నేది అప్పుడు క‌మ్యూనిస్టులు అచ్చేసిన బాబు జ‌మానా అవినీతి ఖ‌జ‌నాలో పేర్కొన్న విష‌యం. మ‌రి వారే ఇప్పుడు చంద్ర‌బాబు అరెస్టుపై క‌న్నీళ్లు పెట్టుకుంటున్నార‌నుకోండి!

మ‌రి 1999 నాటికే రెండు వేల కోట్ల రూపాయ‌ల అవినీతి ఆరోప‌ణ‌లు అంటే ఇప్పుడు ఆఫ్ట్రాల్ 371 కోట్ల రూపాయ‌లు చిల్ల‌రే క‌దా! ఇలాంటి చిల్ల‌ర మొత్తానికి చంద్ర‌బాబు క‌క్కుర్తి ప‌డతారా! అంటూ ప‌చ్చ‌జ‌నాలు ప్ర‌శ్నిస్తున్నారు! మాబాబు గారి రేంజ్ 2000 నాటికే రెండు వేల కోట్ల రూపాయ‌లు అని, ఇప్పుడు 371 కోట్ల‌తో మూసేయ‌డం ఏమిట‌నే వాద‌న‌లాగుంది ఇది!

ఎఫ్ఐఆర్ లో పేరు లేదు, చంద్ర‌బాబు అరెస్ట్ కు గ‌వ‌ర్నర్ అనుమ‌తి లేదు.. ఇలాంటి సాంకేతిక అంశాలు, దానికి తోడు కేవ‌లం 371 కోట్ల రూపాయ‌లేనా! అనే వాద‌న‌లు ఇవీ ఈ వ్య‌వ‌హారంపై ప‌చ్చ స్పంద‌న‌లు! ఎంత‌సేపూ సాంకేతిక అంశాలు, లేక‌పోతే ఇంతేనా.. ఈ మాత్ర‌మేనా..అనే చిన్న బుచ్చ‌డాలు. ఎఫ్ఐఆర్ ఎన్ సైక్లోపీడియా కాద‌ని, అందులో ప్రాథ‌మిక స‌మాచార‌మే ఉంటుంద‌ని సీఐడీ త‌ర‌ఫు లాయ‌ర్లు చెబుతూనే ఉన్నారు. కోర్టులు కూడా ఈ అంశాన్ని ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కూ ప్ర‌తి ప‌చ్చోడూ ఎఫ్ఐఆర్ అంటూ లా చ‌దివిన వాళ్ల కంటే గ‌ట్టిగా మాట్లాడుతున్నారు!

అలాగే చంద్ర‌బాబు రేంజ్ కు 371 కోట్లు చాలా చిన్న‌ది అనేది వాద‌న‌ను కూడా వినిపిస్తూ ఆయ‌న అవినీతి వేల కోట్ల‌లో ఉండాలి కానీ ఇలా చిన్న కేసేమిటి అని బాధ‌ప‌డుతున్నారు పాపం! అయితే.. దేశంలో అవినీతికి రెప్ర‌జెంటేటివ్ గా లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ను చాలా సంవ‌త్స‌రాలు చూపారు! దాణా స్కామ్ లో లాలూ జైలు పాలై సీఎం సీటును భార్య‌కు అప్ప‌గించాడు, సుదీర్ఘ‌కాలం ఆ కేసు విచార‌ణ జ‌రిగింది. ఆ కేసు విచార‌ణ కొన‌సాగుతున్న స‌మ‌యంలో లాలూ కేంద్ర రైల్వే శాఖామంత్రిగా ప‌ని చేశారు. రైల్వేలు లాభాల బాట ప‌ట్టింది లాలూ రైల్వే శాఖా మంత్రిగా ఉన్న‌ప్పుడే!

ఆ త‌ర్వాత దాణా స్కామ్ లో ఆయ‌న మ‌ళ్లీ జైలుకు వెళ్లారు. విచార‌ణ‌లో శిక్ష ప‌డింది. మ‌రి దాణా స్కామ్ విలువ చాలా చిన్న‌ది. అందులో లాలూకు అందిన ముడుపులుగా చెప్ప‌బ‌డిన‌వి వంద‌ల‌, వేల కోట్ల రూపాయ‌లేమీ కావు ! బ‌హుశా ఆ మొత్తం పది కోట్ల లోపేలాగుంది. మ‌రో విష‌యం ఏమిటంటే.. ఆ దాణా స్కామ్ అనేది లాలూ బిహార్ సీఎం కాక‌ముందు కూడా కొన‌సాగింది. లాలూ సీఎం అయ్యాకా..  వాటాలు కొన‌సాగాయంతే! పాత సీఎంలు ఇరుక్కోక‌పోయినా లాలూ ఇరుక్కున్నాడు. 

మ‌రి యూపీఏ టైమ్ లో లాలూ వెలిగిన తీరుకూ, ఆయ‌న శిక్ష ప‌డ్డ కేసు స్థాయికీ ఏమైనా సంబంధం ఉన్న‌ట్టా? ప‌చ్చ బ్యాచ్ ఈ విష‌యాన్ని గ్ర‌హించి.. చంద్ర‌బాబు రేంజ్ కు 371 కోట్లు చిల్ల‌ర అన‌డం మానాలి. ఆయ‌న వేల కోట్ల, ల‌క్ష‌ల కోట్ల అవినీతి చేసే ఉన్నా.. ఈ చిల్ల‌ర ద‌గ్గ‌రే దొరికాడేమో!