బీ2: బోడిగుండుతో ముడి, బురద చల్లుడు

ఎఫ్ 2 అనే సినిమా మనకు తెలుసు. ఎఫ్ 2 అంటే ఫన్ అండే ఫ్రస్ట్రేషన్ అని డెఫినిషన్ చెప్పుకున్నాడు దర్శకుడు. ఇప్పుడు  తెలుగుదేశం పార్టీ వ్యవహారం గమనిస్తే బీ2 అన్నట్టుగా తయారవుతోంది. అంటే..…

ఎఫ్ 2 అనే సినిమా మనకు తెలుసు. ఎఫ్ 2 అంటే ఫన్ అండే ఫ్రస్ట్రేషన్ అని డెఫినిషన్ చెప్పుకున్నాడు దర్శకుడు. ఇప్పుడు  తెలుగుదేశం పార్టీ వ్యవహారం గమనిస్తే బీ2 అన్నట్టుగా తయారవుతోంది. అంటే.. బోడిగుండుతో ముడి మరియు బురదచల్లుడు అన్నమాట!

ఎన్నికల పోలింగ్, అనంతర పరిణామాల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద వారు చేస్తున్న ఆరోపణలు, వాటిద్వారా పొందాలనుకుంటున్న అనుచితమైన లబ్ధి గురించిన అంశాలు గమనిస్తే.. తెలుగుదేశం తీరు ఈ నిర్వచనానికి అతికినట్టుగా సరిపోతుందని మనకు అర్థమవుతుంది.

పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి ఈవీఎం ను పగలగొట్టారు. ఇందులో ఎవ్వరికీ భిన్నాభిప్రాయం లేదు. కానీ.. వైసీపీ వాళ్లు డిమాండ్ చేస్తున్న ప్రకారం ఆ చిన్న ముక్క వీడియోను కాకుండా.. అంతకు ముందు జరిగిన వీడియోను మొత్తం బయటపెడితే అసలు సంగతి తెలుస్తుంది. విచ్చలవిడిగా రిగ్గింగ్ చేస్తున్నందునే ఆ సమాచారంతో ఆగ్రహించిన పిన్నెల్లి అక్కడకు వచ్చి అలా చేశారనేది వారి వాదన.

కారణం ఏదైనా సరే పిన్నెల్లి చేసింది తప్పే. కానీ.. అందుకు ఎవరిని నిందించాలి? తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టినట్టుగా జగన్ ప్రోద్బలంతోనే పిన్నెల్లి వచ్చి అక్కడ ఈవీఎం పగలగొట్టారని, జగన్ మీద కూడా కేసులు పెట్టాలని అంటున్నారు. బిజెపి కూడా ఇలాంటి వాదనకు వంత పాడుతున్నది.

అదే సమయంలో పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డిని శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా నిషేధం విధించాలని తెలుగుదేశం తైనాతీలు డిమాండ్ లు వినిపిస్తున్నారు. పిన్నెల్లి నేరాన్ని ఎవ్వరూ కాదనడం లేదు. కానీ.. ఆ నేరానికి చట్టం ఒక శిక్షను నిర్దేశించి ఉంటుంది. నేరం నిరూపణ అయితే.. అందులో నేరపూరిత ఉద్దేశమే ఉన్నట్టు తేలితే.. ఆయనకు ఆ శిక్ష పడుతుంది. జీవితాంతం ఎన్నికలనుంచి నిషేధించాలనేది తెలుగుదేశం తైనాతీల మాట.

తెలుగుదేశం పార్టీలో ఇంకో బ్యాచ్ నాయకులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. వారెవ్వరూ ఎన్నికలకు పనికొచ్చే నాయకులు కాదని తేలిపోడంతో చంద్రబాబు వారిని పక్కన పెట్టారు. కానీ.. తాము పార్టీకి చాలా చాలా సేవ చేసేస్తున్నట్టగా కనిపించడం వారికి ఫస్ట్ ప్రయారిటీ!  వారంతో ప్రతిరోజూ ఎన్నికల ప్రధానాధికారి వద్దకు వెళ్లి ఏదో ఒక పితూరీలేఖలు సమర్పించుకుంటూ మీడియాతో మాట్లాడుతూ బతుకుతుంటారు. అలాంటి నాయకులు తమ బురదచల్లుడు కార్యక్రమంలో భాగంగా.. చిత్రమైన ఫిర్యాదులు చేస్తున్నారు.

తాడిపత్రిలో కౌంటింగ్ రోజున అరాచకం చేయాలని వైసీపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారట. ఇటీవలి పోలింగ్ అనంతర అల్లర్ల తరువాత జేసీ, పెద్దిరెడ్డి కుటుంబాల్ని పోలీసులు గట్టిగా దూరం పెట్టిన తర్వాత తాడిపత్రి ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. కానీ ఈ ప్రశాంతత తెలుగుదేశానికి నచ్చదు. అక్కడి ప్రజల్లో ఒక ఆందోళనను, భయాన్ని, ఆశాంతిని నాటడం వారికి కావాలి.

తాము ముందు ఫిర్యాదు చేస్తే పరిశుద్ధులం అయిపోతాం అని.. వైసీపీ మీద బురద చల్లినట్టు అవుతుందని వారి కుట్ర. ఇలాంటి హైపోతిటికల్ అంశాలతో కూడా బురద చల్లుతూ తెలుగుదేశం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది.