లోకేష్ మంత్రి కాకుండా బ్రేకులేస్తున్న బుద్ధా!

‘అధికారంలోకి వచ్చేస్తున్నాం.. ఇక విచ్చలవిడిగా చెలరేగిపోదాం.. 2014 తర్వాత ఐదేళ్లపాటు ఏ రకంగా దోపిడీపర్వం కొనసాగిస్తూ వచ్చామో అదే తరహాలో విజృంభించి దోచుకుందాం’ అనే ఆలోచనలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అనేకమందికి ఉండవచ్చు! Advertisement…

‘అధికారంలోకి వచ్చేస్తున్నాం.. ఇక విచ్చలవిడిగా చెలరేగిపోదాం.. 2014 తర్వాత ఐదేళ్లపాటు ఏ రకంగా దోపిడీపర్వం కొనసాగిస్తూ వచ్చామో అదే తరహాలో విజృంభించి దోచుకుందాం’ అనే ఆలోచనలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అనేకమందికి ఉండవచ్చు!

కొన్ని సర్వేలు కూటమి గెలుస్తుంది అని చెబుతున్న నేపథ్యంలో వారు ఆశల పల్లకిలో ఊరేగుతుండవచ్చు! అలాగే మంత్రి పదవులు విషయంలో కూడా మాకు పదవి అంటే మాకు పదవి అనుకుంటూ ఆశావహులు తమ తమ ప్రయత్నాలను ప్రారంభించి ఉండవచ్చు! అదంతా ఒక ఎత్తు అయితే- చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ కు క్యాబినెట్లో చోటు లేకుండా సొంత పార్టీ నాయకులే బ్రేకులు వేస్తుండడం మరొకఎత్తు.

ఒకవైపు నారా లోకేష్ ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగుడుతున్నట్టుగానే కనిపిస్తున్నారు కా..నీ ఆయనకి మంత్రి పదవి దక్కకుండా చేయడానికి ఒక స్కెచ్ ప్రకారం ముందుకు వెళ్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి! 
విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు బుద్ధా వెంకన్న తాజాగా ఒక విలేకరుల సమావేశం పెట్టారు.

రాజకీయ నాయకుడిని అనే బిల్డప్ ఇవ్వడానికా అన్నట్లుగా ఎన్నడూ లేని విధంగా ఒక హాఫ్ కోటు కూడా తొడుక్కుని మరీ విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో ప్రధాన ఎజెండా ఏమిటంటే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసే ముహూర్తానికి- రాష్ట్ర పార్టీ సారధ్య బాధ్యతలను నారా లోకేష్ చేతిలో పెట్టాలని అంటున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర పార్టీ సారథిగా ఉన్నటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు ను క్యాబినెట్ లోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడుకు మార్గదర్శనం చేస్తున్నారు బుద్ధా వెంకన్న! దాని అర్థం ఏమిటంటే క్యాబినెట్లో ఉన్నవాళ్లు రాష్ట్ర పార్టీ సారథ్యం చేయాల్సిన బాధ్యత నుంచి తప్పుకోవాలి అని! ఇన్ డైరెక్ట్ గా రాష్ట్ర పార్టీ సారధిగా పూర్తి బాధ్యతలు లోకేష్ చూసుకుంటూ క్యాబినెట్లో ఉండకూడదు అని కూడా సంకేతాలు ఇస్తున్నారు! 
బుద్ధా వెంకన్న తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడైన ద్వితీయ శ్రేణి నాయకుడు!

చంద్రబాబు నాయుడు మాకు దేవుడు అంటూ విపరీతమైన స్తోత్ర పాఠాలు పటిస్తున్న ఆయన తనకు కూడా మంత్రి పదవి దక్కుతుందేమోనని ఆశపడుతున్నారేమో తెలియదు గానీ.. లోకేష్ కు మాత్రం మంత్రి పదవిని దక్కకుండా అడ్డుపడుతున్నారు! 2014 తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లో నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ అనేక రకాలుగా భ్రష్టు పట్టుపోయిన సంగతి తెలిసిందే! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతకాన్ని ఫోర్జరీ చేయడం దగ్గరనుంచి అనేక అవినీతి భాగోతాలకు సంబంధించిన కేసులు నారా లోకేష్ చుట్టూతా ముసురుకుని ఉన్నాయి!

ఈ నేపథ్యంలో మళ్లీ లోకేష్‌కు మంత్రి పదవి ఇస్తే ప్రభుత్వం మరింతగా భ్రష్టు పట్టిపోతుందని బుద్ధా వెంకన్న లాంటి పార్టీ నాయకులు ఇప్పటినుంచే భయపడుతున్నట్లుగా ఉంది. అందుకే లోకేష్ ను క్యాబినెట్ లోకి తీసుకోవద్దు అని డైరెక్ట్ గా చెబితే హర్ట్ అవుతారనే భయంతో ఇండైరెక్టుగా ఆయన చేతిలో పార్టీ పగ్గాలు పెట్టాలని డొంకతిరుగుడు డైలాగులు చెబుతున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు.