అధికారాన్ని రాజ‌రికంగా ఫీల‌వుతున్న తెలుగు త‌మ్ముళ్లు!

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇంకో ప్ర‌మాదం కేవ‌లం ఎమ్మెల్యేలే కాదు.. ప్ర‌తి ఊర్లో ప‌చ్చ చొక్క వేసుకున్న ప్ర‌తివాడూ బెదిరిస్తాడు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల‌న‌పై అన‌విగాని నీతులు చెప్పారు తెలుగు త‌మ్ముళ్లు! ఒక‌టి కాదు రెండు కాదు.. ఐదేళ్లూ వీరు బుగ్గ‌లు నొక్కుకోవడంలోనే స‌రిపోయింది! జ‌గ‌న్ అది, జ‌గ‌న్ ఇది.. అని తమ చ‌రిత్ర ప్ర‌పంచానికి తెలియ‌ద‌న్న‌ట్టుగా అప్పుడు శుద్ధ‌పూస‌ల్లా స్పందించారు! క‌ట్ చేస్తే.. అధికారం అంది వంద రోజులు అయినా గ‌డ‌వ‌లేదు కానీ, అధికారం తిరిగి త‌మ చేతికి అదండం అంటే త‌మ‌కు రాజ‌రికం బ‌హుమానంగా ల‌భించినట్టుగా వీరు స్పందిస్తూ ఉన్నారు.

స్వ‌యంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో నారా లోకేష్ త‌ను ఒక రెడ్ బుక్ రూపొందిస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా ప‌దే ప‌దే ఆ ప్ర‌క‌ట‌న చేశారు. అందులో చాలా పేర్లు ఉన్నాయ‌ని, త‌మ‌కు అధికారం ద‌క్కితే వారిపై ప్ర‌తీకార చ‌ర్య‌లు ఉండ‌బోతాయ‌ని అప్పుడే లోకేష్ ప్ర‌క‌టించారు. అంటే లోకేష్ ప్ర‌తీకారాల కోసం అధికారం ఇవ్వాలా అనే ప్ర‌శ్న అప్పుడే తలెత్తింది.

అయితే ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు త‌మ ప్ర‌త్య‌ర్థుల‌కు రాజ‌కీయ నేత‌లు అలంటి వార్నింగులే ఇస్తార‌ని, అదంత సీరియ‌స్ కాద‌ని సామాన్యుడు అనుకోవ‌డం లో పెద్ద ఆశ్చ‌ర్యం లేదు. అయితే అధికారంలోకి వ‌చ్చాకా కూడా ఇప్పుడు రెడ్ బుక్ అనే అంటున్నారు. రెడ్ బుక్ అంటే ఎందుకు భ‌యం అంటున్నారు!

స‌రే.. లోకేష్ త‌న ఎర్ర‌బుక్కులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలూ అంద‌రి పేర్ల‌నూ రాసుకుని వారంద‌రినీ ఒక్కొక్క‌రుగా జైలుకు పంప‌నీ! దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుకుంటుంది, ఎదుర్కొనే వాళ్లు ఎదుర్కొంటారు, జైలుకు వెళ్లే వాళ్లు జైలుకెళ్తారు! అందులో అధికారుల పేర్లు కూడా రాసిన‌ట్టుగా లోకేష్ చెబుతున్నారు. మ‌రి అప్పుడూఇప్పుడూ అధికారుల తీరులో వ‌చ్చిన తేడా ఏముంది? అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌కు వారు స‌లాములు కొడితే, ఇప్పుడు తెలుగుదేశం, జ‌న‌సేన ఎమ్మెల్యేల‌కు స‌లాం కొడుతున్నారు! ఈ మాత్రం దానికి వారి పేర్లు ఎందుకు రాసుకున్నారో లోకేష్‌.

క‌క్ష‌గ‌ట్టి కొంత‌మంది అధికారుల‌ను వేధించ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అప్పుడు కొంద‌రు అలా అధికారానికి మ‌డుగులు ఎత్తి ఉంటే, ఇప్పుడూ అదే ప‌నిలో కొంద‌రు ఉన్నారు క‌దా! ఎమ్మెల్యే భార్య పుట్టిన రోజు వేడుక‌ను పోలీసులు సెల‌బ్రేట్ చేయ‌డం అనేది సినిమాల్లో వ్యంగ్యంగా కూడా చూడ‌ని సీన్! అలాంటి స‌న్నివేశాన్ని ఏపీలో ఇప్ప‌టికే చూపించారు. మ‌రి ఒక ఎమ్మెల్యే భార్య పుట్టిన రోజును పోలీసులు సెల‌బ్రేట్ చేస్తే స‌రిపోతుందా? ఆ ఇన్ స్పిరేష‌న్ తో రానున్న నాలుగున్న‌రేళ్లూ ఇంకా చాలామంది పుట్టిన రోజుల‌ను ఇలా ప్ర‌భుత్వాధికారులు త‌మ తాహ‌తు కొద్దీ సెల‌బ్రేట్ చేయాల్సి ఉంటుంది!

గ‌తంలో ప‌రిటాల కుటుంబం ఇంట్లో ఆయుధ‌పూజ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ గ‌న్ మెన్ల ఆయుధాల‌ను పెట్టి పూజించారు! అలా కూడా ఆయుధ‌పూజ చేసుకోవ‌చ్చ‌ని తెలుగుదేశం పార్టీ వాళ్లే సందేశం ఇచ్చారు. మ‌రి ఇప్పుడు అధికారం త‌మ చేతికి అంద‌డం అంటే అదేదో రాజ‌రికం త‌మ చేతికి అందిన‌ట్టుగా భావిస్తున్న నేప‌థ్యంలో ఇలాంటి ముచ్చ‌ట్లు ఉంటాయి త్వ‌ర‌లోనే రానున్న ద‌స‌రా సంద‌ర్భంగా కూడా!

క‌డ‌ప జిల్లాలో ఒక మంత్రి భార్య ఒక పోలీసుకు వేలు చూపించి హెచ్చ‌రిస్తుంది. అదే జిల్లాలో ఒక ఎమ్మెల్యే సిబ్బందిని పెట్టి చెత్త‌ను మేయ‌ర్ ఇంటిముందు వేయిస్తుంది! పోలీసులు అంటే త‌మ ఇంటి బానిస‌లు అన్న‌ట్టుగా ఒక ఎమ్మెల్యే సీఐ చేత సారీ చెప్పించుకుని త‌న ఇగోను చ‌ల్లార్చుకుంటాడు!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడేమో ఎన‌లేని నీతులు చెప్పి, వ్య‌వ‌స్థ అంతా గ‌బ్బు ప‌ట్టిపోయింద‌ని బుగ్గ‌లు నొక్కుకుని, అధికారం ద‌క్కిన మూడు నెల‌ల్లోనే ఇన్ని వ్య‌వహారాల‌ను ప‌త్రిక‌ల‌కు ఎక్కిస్తున్నారు తెలుగు త‌మ్ముళ్లు! అధికార మార్పిడి అంటే.. తమ‌కు తోచింది చేయ‌మ‌ని ప్ర‌జ‌లు త‌మ‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టుగా వీరు ఫీల్ అవుతున్న‌ట్టుగా ఉన్నారు.

అంత‌ర్గతంగా చేసే వ‌సూళ్లు, ఇసుక దోపిడీలు, ఇత‌ర వ్య‌వ‌హారాలూ స‌రేస‌రి! అవ‌న్నీ ఎలాగూ ఉంటాయి. తాము చెప్పిన ధ‌ర‌కే భూములు అమ్మాల‌ని సామాన్యుల‌పై ఒత్తిళ్లు చేయ‌డ‌మూ కొత్త కాదు. 2014-19 స‌మ‌యంలో కియా కంపెనీ స‌మీపంలో భూములపై ఇలాంటి ఒత్తిళ్లు ఎన్నో జ‌రిగాయి. సామాన్యుల భూముల‌న్నీ బినామీల పేర్ల‌తో ఇద్ద‌రు ముగ్గురు ఎమ్మెల్యేలు వంద‌ల కోట్ల రూపాయాలు సంపాదించుకున్నారు. అందుకు ప్ర‌తిఫ‌లామూ గ‌ట్టిగానే ద‌క్కింది ఆ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో! అయితే మ‌ళ్లీ అదే క‌థ అన్న‌ట్టుగా త‌మ్ముళ్ల ధోర‌ణి క‌నిపిస్తూ ఉంది.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇంకో ప్ర‌మాదం కేవ‌లం ఎమ్మెల్యేలే కాదు.. ప్ర‌తి ఊర్లో ప‌చ్చ చొక్క వేసుకున్న ప్ర‌తివాడూ బెదిరిస్తాడు! అదేమంటే జ‌న్మ‌భూమి క‌మిటీలు అంటూ త‌మ్ముళ్ల జేబులు నింప‌డానికి అధికారికంగా నియ‌మించేస్తారు! అయినకాడికి ఎవ‌డికివాడు సంపాదించుకోవ‌డ‌మే ప‌ని. త‌మ పార్టీ ఉన్న‌దే కార్య‌క‌ర్త‌ల కోస‌మ‌ని, త‌మ కార్య‌క‌ర్త‌లు అంటే క‌లెక్ట‌ర్లు కూడా లేచి నిల‌బ‌డాల‌ని తెలుగుదేశం ముఖ్య‌నేత‌లే బాహాటంగా చెబుతూ ఉంటారు.

తాము హ‌త్య‌లు చేసి వ‌చ్చినా త‌మ పార్టీ అండ‌గా నిల‌బ‌డుతుంద‌ని ప‌చ్చ‌చొక్కాలు న‌మ్మ‌డంలో కూడా పెద్ద వింత‌లేని ప‌రిస్థితిని తెలుగుదేశం ముఖ్య‌నేత‌లే క‌ల్పిస్తూ ఉన్నారు. అలా నూత‌న సమాజ‌స్థాప‌న‌కు తెలుగుదేశం ముఖ్య నాయ‌క‌త్వం గ‌ట్టి పునాదులే వేసింది. దానిపై ఇప్పుడు గోడ‌లు నిర్మించ‌బ‌డుతూ ఉన్నాయంతే!

23 Replies to “అధికారాన్ని రాజ‌రికంగా ఫీల‌వుతున్న తెలుగు త‌మ్ముళ్లు!”

  1. సాక్షి పేపర్ సర్క్యూలేషన్స్ 13.5 లక్షల నుండి 9 లక్షలకు పడిపోయిందటగా.. రెండు నెలల్లో ఇంత భారీ పతనం .. ఆ దరిద్రపు పేపర్ రియల్ అవతారం ఇదే..

    ప్రజలిచ్చిన అధికారాన్ని ఇలా అడ్డంగా వాడుకొంటుంటే.. 11 కి పడిపోయారు పాపం.. అయినా మనం ఈవీఎం ల మీద పడి ఏడుస్తుంటాం..

  2. సాక్షి పేపర్ సర్క్యూలేషన్స్ 13.5 లక్షల నుండి 9 లక్షలకు పడిపోయిందటగా.. రెండు నెలల్లో ఇంత భారీ పతనం .. ఆ దరిద్రపు పేపర్ రియల్ అవతారం ఇదే..

    ప్రజలిచ్చిన అధికారాన్ని ఇలా అడ్డంగా వాడుకొంటుంటే.. 11 కి పడిపోయారు పాపం.. అయినా మనం ఈవీఎంల మీద పడి ఏడుస్తుంటాం..

      1. Thank you my friend..

        అవును.. నేను కూడా పర్సనల్ లైఫ్ లో బిజీ గా ఉన్నాను.. ఆల్మోస్ట్ 1 1/2 ఇయర్స్ అన్ని వదిలిపెట్టేయడం వల్ల .. ఇప్పుడు కొద్దిగా పనెక్కువైంది..

        పైగా కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది.. ఇక ఇక్కడ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది..

        ఎప్పుడైనా టైం దొరికితే ఆర్టికల్స్ కాకుండా.. కామెంట్స్ చదువుతున్నాను..

      1. you definitely need a break..

        after recent update.. comments section became more complicated and more worse…

        that is also one reason why I am not active in recent times..

  3. రాజరికం అంటె……

    రాజ్యంగబద్ద అధికారులకి కొర్టులని లెక్కచెయకపొవటం.

    రాజధాని తన సొంత వ్యవహారం అనుకొవటం.

    అక్రమ కెసులు బలాయించి ప్రతిపక్ష నాయకుల ని జైలు కి పంపటం .

    మాస్క్ అడిగిన దాక్టర్ ఉద్యొగాన్న పెకెసి చావగొట్టటం.

    తన మిత్రుడు మీద ఒక నటి కెసు పెడితె అక్రమంగా అమె మీద కెసు పెట్టి నిర్బందించటం.

    తన పార్టి వారికి BP వస్తె ఎదుటి పార్టి వారి కార్యాలయలు ద్వంసం చెయటం.

    తనకు నచ్చని పొస్టు పెట్టిన రంగనాయకమ్మ హొటల్ లాగెసుకొని, రాస్త్రం వదిలిలెలా చెయటం.

    తన పార్టి వారిని చంపి డొర్ డెలివెరి చెసె అదిక్కారం ఉంది అనుకొవటం.

  4. Baabu GA, telisi raastavo teleekunda raastavo kaani, nee articles lone appudappudu vishyam vuntadi. Nuvvu cheppinattu Officers addagoluga YSRCP kommu kaasarane Lokesh red book start chesindi.

  5. Baabu GA, telisi raastavo teleekunda raastavo kaani, nee articles lone appudappudu vishyam vuntadi. Nuvvu cheppinattu adhikaarlu addagoluga YSRCP kommu kaasarane Lokesh red book start chesindi.

  6. Baabu GA, telisi raastavo teleekunda raastavo kaani, nee articles lone appudappudu vishyam vuntadi. Nuvvu cheppinattu adhikaarlu addagoluga YCP kommu kaasarane NL red book start chesindi.

  7. Baabu GA, telisi raastavo teleekunda raastavo kaani, nee articles lone appudappudu vishyam vuntadi. Nuvvu cheppinattu adhikaarlu addagoluga YCP kommu kaasarane Lokesh erra book start chesindi.

  8. Baabu G…A, telisi raastavo teleekunda raastavo kaani, nee articles lo ne appudappudu vishyam vuntadi. Nuvvu cheppinattu adhikaarlu addagoluga YCP kommu kaasarane Lokesh erra book start chesindi.

  9. Baabu G..A, telisi raastavo teleekunda raastavo kaani, nee articles lone appudappudu vishyam vuntadi. Nuvvu cheppinattu adhikaarlu addagoluga YCP kommu kaasarane Lokesh erra pusthakam start chesindi.

  10. Baabu GiYe, telisi raastavo teleekunda raastavo kaani, nee articles lone appudappudu vishyam vuntadi. Nuvvu cheppinattu adhikaarlu addagoluga YCP kommu kaasarane Lokesh erra book start chesindi.

  11. Hi G/A/, telisi raastavo teleekunda raastavo kaani, nee articles lone appudappudu vishyam vuntadi. Nuvvu cheppinattu adhikaarlu addagoluga YCP kommu kaasarane Lokesh erra book start chesindi.

  12. Hi G/A/, telisi raastavo teleekunda raastavo kaani, nee articles lone appudappudu vishyam vuntadi. Nuvvu cheppinattu adhikaarlu addagoluga YCP kommu kaasarane Lokesh start chesindi.

Comments are closed.