పుష్ప 2 షాకింగ్ నెంబర్లు

తెలుగు సినిమా రాను రాను పెరుగుతోంది. బన్నీ- సుకుమార్- మైత్రీ సంస్థ నిర్మించి, సరైన బజ్, సరైన కాంబినేషన్ వున్న పాన్ ఇండియా సినిమాలు అంటే ఓ రేంజ్‌లో మార్కెట్ వుంటోంది. పుష్ప సినిమా…

తెలుగు సినిమా రాను రాను పెరుగుతోంది. బన్నీ- సుకుమార్- మైత్రీ సంస్థ నిర్మించి, సరైన బజ్, సరైన కాంబినేషన్ వున్న పాన్ ఇండియా సినిమాలు అంటే ఓ రేంజ్‌లో మార్కెట్ వుంటోంది. పుష్ప సినిమా నార్త్ బెల్ట్ లో పెద్ద హిట్ అయింది. ఎందుకు అయింది. ఎలా అయింది. జ‌నాలకు నచ్చిన పాయింట్లు ఏమిటి? ఇదంతా ఓ పెద్ద డిస్కషన్. పుష్ప పార్ట్ వన్ కు వచ్చిన బజ్ కారణంగా పార్ట్ 2 కు జ‌రిగిన ప్రీ రిలీజ్ మార్కెట్ ఓ అద్భుతం. ఇండియన్ సినిమాల్లో ఓ రికార్డుగా వుండబోతోంది అని తెలుస్తోంది.

పుష్ప 2 అల్ లాంగ్వేజెస్ ఓటిటి స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ కు విక్రయించారు. ఇది 275 కోట్ల డీల్ అని తెలుస్తోంది. ఇది చాలా హయ్యస్ట్ ఫిగర్. రికార్డ్ ఫిగర్. ఇక హిందీ వెర్షన్ జ‌స్ట్ 200 కోట్ల అడ్వాన్స్ మీద పంపిణీకి ఇచ్చారు. ఇది రావాలి అంటే హిందీ వెర్షన్ ఎంత వసూలు చేయాల్సి వుంటుంది, ఎంత ఖర్చులు, ఎంత కమిషన్ అనే లెక్కలు కడితే జిగేల్ మనే అంకెలు కళ్ల ముందుకు వస్తుంది.

ఇక అన్ని భాషలు కలిపి అడియో రైట్స్ ను 60 కోట్లకు టీ సిరీస్ కు విక్రయించారు. ఇది కూడా చాలా పెద్ద నెంబర్.

ఇక సౌత్ ఇండియా, ఓవర్ సీస్ థియేటర్ రైట్స్ ఏ మేరకు వుండబోతున్నాయో చూడాలి. చాలా సులువుగా 200 నుంచి మూడు వందల కోట్ల మధ్యలో వుంటాయి. మొత్తం థియేటర్ ఫిగర్లు అన్నీ కలిపి, సినిమా విడుదలయ్యాక వుండే గ్రాస్ ఫిగర్లు ఊహించుకుంటే తెలుగు సినిమా స్టామినా అర్థం అవుతోంది. డిసెంబర్ 6న విడుదలయ్యే పుష్ప 2 పలు సంచనాలకు దారి తీసేలా కనిపిస్తోంది.

7 Replies to “పుష్ప 2 షాకింగ్ నెంబర్లు”

  1. వైసిపి పార్టీ మద్దతు దారు సినిమా ఆ మాత్రం రేట్లు పలకడం విచిత్రం ఏముంది… వైసిపి కి ఆ స్థాయి లేకపోతే 11 సీట్లు ఎలా సాధించగలుగుతుంది..

Comments are closed.