మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా. అధికారం చేతిలో వుంటే, దాన్ని అడ్డు పెట్టుకుని బాబు పులిలా గాండ్రిస్తూ వుంటారు.
చంద్రబాబు టక్కుటమార విద్యలు తెలుగు సమాజానికి తెలిసిపోయాయి. అందుకే ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసినా, పట్టించుకునే వాళ్లే లేరు. భయపెట్టినా భయపడేవాళ్లు లేరు. అదేంటో గానీ, ఇటీవల పదేపదే చంద్రబాబు నోట భయం మాట వస్తోంది.
“ఎవరికీ భయపడను” అని అనేవాళ్లు ఎక్కువగా భయపడుతుంటారని మానసిక విశ్లేషకులు చెబుతుంటారు. పిరికివాళ్లు, భయపడే వాళ్లు మాత్రమే తమకు ఏమవుతుందో అనే ఆందోళన చెందుతుంటారు.
చంద్రబాబు యాంగ్జైటీ న్యూరోసిస్‌తో బాధ పడుతున్నారని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా మూడు రకాల మానసిక లక్షణాలతో బాధపడుతున్నారని ఆయన్ను దగ్గరగా గమనిస్తున్న సైక్రియాటిస్టులు చెబుతున్నారు. ఆ మూడు… భయం, ఆందోళన, అనుమానం అని వారు చెప్పుకొచ్చారు.
చంద్రబాబు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) అనే సాధారణ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని వారు చెప్పడం గమనార్హం. మీటింగ్‌ల్లో చంద్రబాబు చెప్పిందే చెప్పడాన్ని ఉదహరిస్తున్నారు.
ఉదాహరణకు నిన్న విజయనగరం జిల్లాలో పలు చోట్ల బాదుడే బాదుడు కార్యక్రమాల్లో మాట్లాడిన అంశాల్ని సైకియాట్రిస్టులు గుర్తు చేస్తున్నారు.
“రాష్ట్రంలో ప్రజల కష్టాలు చూసి పోరాడేందుకు వచ్చా. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. నేను ఎవరికీ భయపడేది లేదు. ఏం చేసుకుంటావో చేస్కో జగన్‌రెడ్డి” అని చంద్రబాబు సవాల్ విసిరారు.
చంద్రబాబు పదేపదే తానెవరికీ భయపడనని ప్రకటించడం… ఓసీడీలో భాగమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాయకత్వం వహించే నాయకుడే భయపడనని చెప్పడం… ఆయన మానసిక స్థితిని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.
2024లో అధికారం రాదేమో అనే భయం, ఏమవుతుందోననే ఆందోళన, ప్రజలపై అనుమానాల వల్లే చంద్రబాబు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు దీర్ఘకాలిక చికిత్స అవసరమని సైకియాట్రిస్టులు అభిప్రాయపడుతున్నారు.