టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన ముగ్గురు రెడ్డెమ్మ‌లు

మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేయాల‌నే మంచి ఆశ‌యంతో చంద్ర‌బాబు, లోకేశ్ టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటే, ప్ర‌జ‌ల‌కు భారంగా మారార‌నే అభిప్రాయం

తెలుగుదేశం పార్టీకి ముగ్గురు రెడ్డెమ్మ‌లు త‌ల‌నొప్పిగా మారారు. వీరి చ‌ర్య‌లు పార్టీకి రాజ‌కీయంగా తీవ్ర న‌ష్టం తెస్తున్నాయ‌ని ఆవేద‌న‌, ఆగ్ర‌హం టీడీపీ పెద్ద‌ల్లో వుంది. టీడీపీకి న‌ష్టం తీసుకొస్తున్నార‌ని సొంత పార్టీ పెద్ద‌లు ఆగ్ర‌హంగా ఉన్న ఆ ముగ్గురు మ‌హిళా రెడ్డెమ్మ‌లు… క‌డ‌ప ఎమ్మెల్యే ఆర్‌.మాధ‌వీరెడ్డి, ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియారెడ్డి, చంద్ర‌గిరి ఎమ్మెల్యే స‌తీమ‌ణి పులివ‌ర్తి సుధారెడ్డి.

వీళ్ల‌లో భూమా అఖిల‌ప్రియ వ‌య‌సురీత్యా మాధ‌వీ, సుధారెడ్డితో పోలిస్తే చిన్న‌వారు. అయితే రాజ‌కీయంగా మిగిలిన ఇద్ద‌రి కంటే సీనియ‌ర్‌. రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తే, క్రేజ్ వ‌స్తుంద‌ని అఖిల‌ప్రియ భావిస్తున్న‌ట్టున్నారు. క్రేజ్ సంగ‌తేమో గానీ, టీడీపీ అధిష్టానం మాత్రం మ‌రోలా చూస్తోంద‌న్న‌ది నిజం. ప్ర‌తిదీ ప్ర‌చారం కోసం చేస్తే, మ‌రో ర‌క‌మైన సంకేతాల్ని జ‌నంలోకి తీసుకెళుతుంద‌ని అఖిల‌ప్రియ గుర్తిస్తున్న‌ట్టుగా లేద‌ని సొంత పార్టీ నాయకులే అంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఉన్నామ‌నే సంగ‌తి మ‌రిచి, ఆళ్ల‌గ‌డ్డ‌కు తాను ఎమ్మెల్యే కాబ‌ట్టి, త‌న అనుమ‌తి లేకుండా ఎవ‌రూ ఏమీ చేయ‌కూడ‌ద‌ని చివ‌రికి సొంత పార్టీ వారిని కూడా వేధించ‌డం ఏంట‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. కొంత కాలంగా అఖిల‌ప్రియ వ్య‌వ‌హారాలు పార్టీకి న‌ష్టం తెచ్చేలా ఉన్నాయ‌ని, ఆమెను క‌ట్ట‌డి చేయ‌క‌పోతే చాలా ఇబ్బందులొస్తాయ‌ని ఇప్ప‌టికే అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఇక క‌డ‌ప ఎమ్మెల్యే ఆర్‌.మాధ‌వీరెడ్డి ధోర‌ణి వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. నాలుగు నెల‌ల పాల‌న‌కే మాధ‌వీరెడ్డి అంటే క‌డ‌ప జ‌నం జ‌డుసుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. క‌డ‌ప న‌గ‌ర అధ్య‌క్షుడు శివ‌కొండారెడ్డిపై హ‌త్యాయ‌త్నం జ‌రగ‌డం వెనుక ఎవ‌రి హ‌స్తం వుందో క‌డ‌ప‌లో జ‌రుగుతున్న ప్ర‌చారం గురించి తెలుసుకుంటే, మాధ‌వీరెడ్డి అంటే ఎంత భ‌య‌ప‌డుతున్నారో అర్థ‌మ‌వుతుంది.

క‌డ‌ప టీడీపీ న‌గ‌ర అధ్యక్షుడు శివ‌కొండారెడ్డిపై దాడి జరిగితే, ఇంత వ‌ర‌కూ ఆ పార్టీ ఎమ్మెల్యే అయిన మాధ‌వీరెడ్డి నుంచి క‌నీసం ఖండ‌న కూడా క‌నిపించ‌డం లేదు. నాలుగు నెల‌ల్లోనే ఐదేళ్ల‌కు స‌రిప‌డేంత చెడ్డ‌పేరు తీసుకొచ్చారంటూ మాధ‌వీరెడ్డి దొపిడీపై పెద్ద ఎత్తున ఫిర్యాదుల్ని చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌కు సొంత పార్టీ నాయ‌కులు పంపారు. ఇలా ఫిర్యాదు చేసిన వారిలో క‌డ‌ప టీడీపీ న‌గ‌ర అధ్య‌క్షుడు కొండారెడ్డి కూడా వుండ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీకి మ‌రో త‌ల‌నొప్పి పులివ‌ర్తి సుధారెడ్డి, చంద్ర‌గిరి ఎమ్మెల్యే నాని స‌తీమ‌ణి సుధారెడ్డి, పైన పేర్కొన్న ఇద్ద‌రు మ‌హిళా నేత‌లు… చ‌ట్ట‌స‌భ‌కు ఎన్నికైన ప్ర‌జాప్ర‌తినిధులు. సుధారెడ్డి మాత్రం వాళ్లిద్ద‌రికి భిన్న‌మైన నాయ‌కురాలు. క‌నీసం ఎమ్మెల్యే అయితే పెత్త‌నాన్ని భ‌రించొచ్చ‌ని, ఎమ్మెల్యే భార్య‌గా సుధారెడ్డి అధికారాన్ని చెలాయించ‌డం చంద్ర‌గిరిలో టీడీపీ శ్రేణులు సైతం జీర్ణించుకోలేకున్నారు. సుధారెడ్డి మాట‌తీరు, …అయ్య బాబోయ్ అని టీడీపీ అనుబంధ ప‌త్రికే రాసిందంటే ఇక ఆమె ఏ రేంజ్‌లో చంద్ర‌గిరిలో అధికారాన్ని చెలాయిస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

పేరుకే చంద్ర‌గిరికి నాని ఎమ్మెల్యే. అన‌ధికార ఎమ్మెల్యే తానే అని పులివ‌ర్తి సుధారెడ్డి ఆ మ‌ధ్య ప్రెస్‌మీట్‌లో తానే ప్ర‌క‌టించుకోవ‌డాన్ని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. ఇసుకైనా, మ‌ద్యం వ్యాపార‌మైనా, భూమి పంచాయితీలైనా… చంద్ర‌గిరిలో చీమ కుట్టాల‌న్నా సుధారెడ్డి క‌నుసైగ చేయాల్సిందే అని టీడీపీ శ్రేణులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. తానేదో చంద్ర‌గిరి రాజ్యానికి మ‌హారాణి అని భావించి, సుధారెడ్డి ఆదేశాలు ఇస్తున్నార‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆఫ్ ది రికార్డుగా మీడియా ప్ర‌తినిధుల‌తో గోడు చెప్పుకుంటున్నారు.

మ‌హిళ‌లు రాజ‌కీయాల్లో రాణిస్తే బాగుంటుంద‌ని స‌మాజం కోరుకుంటోంది. మ‌హిళ‌లైతే హుందాగా, న‌మ్ర‌త‌గా న‌డుచుకుంటార‌ని, త‌ద్వారా రాజ‌కీయాల‌పై గౌర‌వం పెరుగుతుంద‌నే ఒకే ఒక్క ఆశ‌తో జ‌నం వారి రాక‌ను ఆకాంక్షిస్తున్నారు. కానీ క‌డ‌ప రెడ్డెమ్మ‌ల తీరు మాత్రం తేడాగా వుంది గురూ అని టీడీపీ పెద్ద‌లు వాపోతున్నారు. మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేయాల‌నే మంచి ఆశ‌యంతో చంద్ర‌బాబు, లోకేశ్ టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటే, ప్ర‌జ‌ల‌కు భారంగా మారార‌నే అభిప్రాయం ఆ పార్టీలో అంత‌ర్గ‌తంగా వుంది. పులివ‌ర్తి సుధారెడ్డి అధికారాన్ని మంచి కోసం ఉప‌యోగిస్తే బాగుంటుందని స‌మాజం కోరుకుంటోంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె రాజ‌కీయ పంథా మాత్రం… అందుకు భిన్న‌మైన పేరు తీసుకొచ్చింద‌న్న‌ది వాస్త‌వం. ఇక నిర్ణ‌యం టీడీపీ అధిష్టానానిదే.

21 Replies to “టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన ముగ్గురు రెడ్డెమ్మ‌లు”

  1. అ పార్టి వస్తె రొజా రెడ్డి…

    మా రెడ్ల పరువు రెడ్డి కాని రెడ్డి జగన్ సగం తీసాడు ..మిగిలింది మీరు తియ్యండి అక్కయ్యలు

  2. అ పార్టి వస్తె రొజా రెడ్డి

    మా రెడ్ల ప..రు..వు రెడ్డి కాని రెడ్డి జగన్ స..గం తీ..సాడు ..మిగిలింది మీరు తియ్యండి అ..క్కయ్య..లు

  3. అ పార్టి వ..స్తె రొజా రెడ్డి

    మా రెడ్ల ప..రు..వు రెడ్డి కాని రెడ్డి జగన్ స..గం తీ..సాడు ..మిగిలింది మీ..రు తి..య్యం..డి అ..క్కయ్య..లు

  4. అ పార్టి వ..స్తె రొజా రెడ్డి

    మా రె..డ్ల ప..రు..వు రె..డ్డి కాని రె..డ్డి జ..గ..న్ స..గం తీ..సాడు ..మి..గిలిం..ది మీ..రు తి..య్యం..డి అ..క్కయ్య..లు

  5. “maహిళ‌లైతే హుందాగా, న‌మ్ర‌త‌గా న‌డుచుకుంటార‌ని…”

    ప్రతి పేరుకే ఏదో ఒక అర్ధమే ఉంటుంది గానీ ‘నమ్రత’ బదులు వినమ్రత అనొచ్చుగా…

  6. ఇదంతా ఏముందిలే కానీ, సజ్జలు గాడి పని బాగుంది మొగుడు కొడితే “పేపర్ పెళ్ళాం” ని ఎక్కుతాడు.. పెళ్ళాం కాదంటే, పార్టీ లో చేరి మొగుణ్ణి ఎక్కుతున్నాడు .. అదృష్టం అంటే ఇదే కదా??

  7. ప్యాలస్ లో అమాయకుడు పసి బాలుడు అయిన ఆన్న పైన రోజుకి ప్యాలస్ కి వంద కోట్లు వసూళ్లు లెక్క తగ్గితే

    వదినమ్మ ఆన్న లాగు పైకి ఎత్తి తొడ పాశం పెట్టడం, గోడ కుర్చీ వేపించడం లాంటి అరాచకాలు గురించి కూడా రాయి ఒకసారి.

    ప్యాలస్ లో ఇలాంటి విషయాల బయటకి తెలియకుండా ఉండేది కే ఆ ఫెన్సింగ్.

  8. GA గాడు రెడ్డెమ్మలంటూ కుల పిచ్చితో సంకలు కొట్టేసుకుంటున్నాడు…. కానీ అక్కడ అఖిలప్రియ భర్త ఏమో “కాపు”… సుధా రెడ్డి భర్త ఏమో “కమ్మ”… ఇక ఆపరా స్వామి నీ విన్యాసాలు….

Comments are closed.